ఇతర భాషలు మనకి అవసరం మాత్రమే ..
కానీ మాతృభాష మనకు ఆయువు వంటిది ..
ఆయువు లేదంటే మన ప్రాణం పోయినట్టే ...
మాతృభాషను మరిచిపోతే మానమున్నా లేనట్టే ...
- సాయిరాజ్
ఎంత నేర్చుకుంటున్నాం అన్నది కాదు ముఖ్యం ...
సమాజం లో మనం ఎలా నడుచుకుంటున్నాం అన్నదే ముఖ్యం ...
- సాయిరాజ్
నా భారతీయ సౌరభ్యము యంతయున్ ...
అది అందించు ఆతిధ్యము లోనే వెలువడుచుండెన్ ....
నమ్మకం ..
అంత గొప్ప భారతాన్నే నడిపాడు శ్రీకృష్ణుడు ..
నా జీవితాన్ని నడపలేడ ?!
నిజం ..
శ్రీకృష్ణుడు రథం నడుపుతున్నాడు కదా అని ,
అర్జునుడు చేతులు కట్టుకొని కూర్చోలేదు కదా ..?
యుద్ధం చేసాడు ...