స్నేహం అయినా బంధం అయినా కలకాలం నిలిచి ఉండాలి అంటే... ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరి పై ఒకరికి నమ్మకం, ఒకరంటే ఒకరికి మన అనే ఆత్మీయత ఉన్నప్పుడు స్నేహంలో అయినా, బంధంలో అయినా విడిపోవడాలు ఉండవు...!!!!
ఒకటి రెండు విషయాలు ఒక మనిషిలో నచ్చి ఇష్టపడడంలో ఉన్న.... ప్రేమ అసలు విషయమే తెలియకుండా ఒక మనిషిని ఇష్టపడడంలోని... ప్రేమ ఒక్కటే ఎలా అవుతుంది..!?
ప్రతీ ఊళ్లోనూ.. ప్రతీ లొకాలిటీలోనూ వేకువజామునే "కౌసల్యా సుప్రజా రామా" అనో.. "అల్లా" అనో ఓ మైక్ విన్పిస్తుంది. అంత పొద్దున్నే అలా మైక్ విన్పించబడాలంటే ఏడాది పొడవునా ఓ మనిషి తప్పనిసరిగా తాను లేచి ప్రపంచాన్ని లేపుతుండాలి. నిజంగా ఇన్స్పిరేషనే కావాలంటే ఆ ఒక్క మైక్ చాలు మన బద్ధకాన్ని వదిలించుకుని పొద్దున్నే లేవడానికి! - Sree
సమస్య వెంట పరిష్కరం నీడ వెంట వెలుగు రాత్రి వెంట పగలు ఎప్పుడు ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకు మిత్రమా..! శ్రీ..✍️