Engineer by Profession , Writer by Hobby. ShareChat Dronacharya award winner for literatue and education from ShareChat, poetry competition winner conducted by Helo App. Comedy Star and Mega Star(literature) contest winner conducted by ShareChat..
Share with friendsకలలకు రెక్కలు తొడిగే కంటే ముందు శ్రమకు చెప్పులు తొడుగు.. చూపు ఆకాశం వైపు ఉండడం తప్పు కాదు కానీ పాదాలు నేలపై ఉండటం ముఖ్యం!!
పిల్లలకు లాల పోసి, పౌడరద్ది, దృష్టి చుక్క పెట్టి పాలు పట్టి, బజ్జో పెట్టక కానీ అమ్మకు తన ఆకలి గుర్తుకురాదు!!
చిన్నప్పుడు అమ్మ కొంగు గాయానికి కట్టు అయ్యేది భయానికి తెర అయ్యేది ఎండకు నీడయ్యేది... అమ్మ కట్టే చీర కొంగే అంత రక్షణ కల్పిస్తే ఇక అమ్మ మనకు ఎంత రక్షణ కల్పించివుండాలి!!
మనం విసుక్కున్నా, కసురుకున్నా మన బంగారు భవిత కోసం ప్రతిరోజు మనల్ని నిద్దురలేపే అలుపెరుగని Alarm "అమ్మ"