మనిషి సాధించాలనుకుంటే పడినచోటనే పరుగు మొదలుపెట్టి తన ఆటకు కొత్త ప్రారంభం ఇవ్వాలి
ఎండి బీటలు వారిన భూమి విచ్చుకున్న నోరువలె
వర్షపు చినుకుకై ఎదురు చూస్తున్నట్లుంది
అన్న అంటే ఒక పెద్దరికం, తమ్ముడు అనగానే అభిమానం.
ఇప్పుడు ఆ రెండు పేర్లు వింటే గుర్తొచ్చేది రాజకీయం.
సముద్రం ఒడ్డున అలలతో హోరెత్తిస్తుంది.
కానీ లోన బడబాగ్ని రగులుతున్నా
మధ్య భాగంలో ప్రశాంతతను కలిగి ఉంటుంది
మనకందరికీ అన్నీ ఇచ్చి కాపాడేది భూమాత
మరి మనదే కదా కాలుష్యాల నుండి
ఆమెను రక్షించే బాధ్యత
ప్రభుత్వ హెచ్చరిక మద్యపానం ఆరోగ్యానికి హానికరం
సారాయి దుకాణాలకు మరి ప్రభుత్వమే ఇస్తుంది అనుమతి పత్రం
చల్లని వెన్నెల, చక్కని వాతావరణం
మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి.
సమయానికి జీతం ఇవ్వని వాడి దగ్గర పని చేయడం కన్న
ఉద్యోగం మానేసి స్వయం ఉపాధి చూసుకోవడం మిన్న
పదిమంది ఉండి ఎవరి దారి వారిది అన్నట్లు ఉంటే కాదు అది ఇల్లు,
కలిసిమెలిసి ఉండే ఇద్దరున్నా నవ్వులు పూయిస్తూ ఉంటే అదే అసలైన ఇల్లు