Mareechika ✍️

61
Posts
0
Followers
0
Following

I'm Mareechika and I love to read StoryMirror contents.

Share with friends

#కుటుంబం చుట్టూ పది మంది ఎప్పుడూ సందడి చేస్తూ ఉంటే కుటుంబం అయిపోదు. ఉన్నది ఇద్దరైనా ముగ్గురైనా ఒకరికి ఒకరు మనస్ఫూర్తిగా సహకారం అందించుకున్న రోజే కుటుంబం అవుతుంది.

#పరీక్ష జీవితం పెట్టే పరీక్షలు ఎలా ఉంటాయంటే ఫలితం వచ్చిందాకా మన బలబలాలు అర్ధం కావు.

#ఆహరం మితంగా తింటే ఆహారం అమృతం, అతిగా తింటే అదే విషం.

#పచ్చబొట్టు శరీరం మీద వేసిన పచ్చబొట్టు సర్జరీతో పోతుందేమో కానీ, మనసులో ఏర్పడిన పచ్చబొట్టు శరీరం కాలిపోయే వరకూ పోదు.

#స్నేహం పేద ధనిక బేధం, కుల మత బేధం లేకుండా.. ఎటువంటి బంధుత్వం లేకపోయినా ఒక మనిషిని ప్రాణసమానంగా ఇష్టపడే బంధమే స్నేహం.

#చిరునవ్వు చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే.. మౌనం ఎన్నో సమస్యల్ని దగ్గరకు రాకుండా చేస్తుంది.

#దయ ఆపదలో చిక్కుకున్న అపకారికి అయినా ఉపకారం చేసే దయ కలిగి ఉండాలి.

#దయ విరబూసే పూలను కోయడం వల్లన అవి బాధపడతాయని "అక్కటా ఎంత దయ లేని వారు మీ ఆడవారు" అని కరుణశ్రీ కలం పలికింది. కానీ పాశవికంగా పసిపిల్లలను చిందేస్తుంటే ఏ మాత్రం దయ జాలి కలగడంలేదా జనాలకు..

#దయ జాలి దయ మొదలైన పదాలు గుర్తువుంటున్నాయి కానీ ఆ భావాలను అనుభవించే పరిస్థితులు ఎదురైతే మాత్రం ఏమాత్రం దయ లేకుండా దయ అనే పదాన్నే మర్చిపోతున్నాం.


Feed

Library

Write

Notification
Profile