ఇంద్ర ధనుస్సు లోని ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాగే హోలీ పండుగ రోజు, అందమైన రంగులతో సరదాగా ఆడే ఆటలతో, మన జీవితాన్ని కూడా అందంగా, ప్రత్యేకంగా, ఆనందంగా మార్చుకుందాము.
హోలీ అంటేనే ఆనందాల రవళి. పెద్దలు కూడా పిల్లల్లా మారి, రంగులతో సరదాగా ఆటలు ఆడుతూ గడిపే చక్కటి పండుగే హోలీ పండుగ.
మన విజయం మనతో పాటు, మరో నలుగురికి ఉపయోగపడితే, అప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము. అనుభవించి తీరాల్సిందే !!
జీవితంలో విజయం సాధించడం అంటే, మనల్ని ప్రేమించే నలుగురిని సంపాదించుకోవడంతో పాటు, మన గురించి ఆలోచించే సన్నిహితులతో మన బంధాన్ని ఎల్లప్పుడూ జాగర్తగా కాపాడుకోవడం కూడా !!
విజయం పొందినప్పుడు పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా, రెండిటినీ సమానంగా చూడగలిగినప్పుడు మాత్రమే, జీవితాన్ని ప్రశాంతంగా గడపగలము.
ప్రతీ పనిలో విజయం పొందాలని కోరుకోవడం సహజం. ఒకవేళ పొందలేకపోయినా కూడా,నిరుత్సాహ పడకుండా,విజయం కోసం చేసిన ఆ ప్రయత్నాన్ని ఒక అనుభవంగా గుర్తు పెట్టుకొని,దాని నుంచి అవసరమైన పాఠాలు నేర్చుకొని,మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాలి. ఇలా చేస్తే,ఏదో ఒకరోజు విజయం తప్పక మన దరి చేరుతుంది.
పెద్ద పెద్ద చదువులు చదవడం, గొప్ప గొప్ప జీతాలు అందుకోవడం మాత్రమే విజయం కాదు. ఒత్తిడి లేని జీవనం గడపటం కూడా విజయమే !! అందుకే, ఆ విజయానికి చేరువయ్యే దారిని అన్వేషించడం మొదలు పెట్టాలి.