ఒక్కపూట వండుకొని తినగా మిగిలిన భోజనాన్ని మరోపూటకు పెంటపాలు చేస్తావు. మరి దేవుడి ప్రసాదంలోని ఒక్క మెతుకు క్రిందపడినా, దాన్ని కళ్ళకద్దుకొని మరీ తింటావెందుకు?? ఆకలితో ఒక అభాగ్యుడు నీ ఇంటి తలుపు తడితే, ఒక్క ముద్ద కూడా అతని కంచంలో వేయవు. మరి ఏమీ కోరని ఆ దేవుడికి మాత్రం పంచభక్ష్య పరమాన్నాలు, ధూపదీప నైవేధ్యాలను పెడతావెందుకు???