ప్రేమ అర్ధం కాకుండానే కాలాన్ని వ్యర్థం చేసే ఒక వెసనం
మీ దిల్
నేను ఎవరన్నది నువ్వు నిర్ణయించలేవు
ని ఊహలలో నేను వేరు
నా ఆలోచనలలో నేను వేరు
నేను ఎం అవ్వాలన్నది నువ్వు శాసించలేవు
నేను ఎటు వెళ్తున్నది నా ఆడుగులకి మాత్రమే తెలుసు
మీ దిల్
ఆకారం పెద్దగా ఉన్నంత మాత్రాన లేని విలువ రాదు
పరిమాణం తగ్గినంత మాత్రాన ఉన్న విలువ పోదు
మీ దిల్
జీవితాన్ని వర్ణించాలని సంకల్పించిన ప్రతిసారి
భగవంతుడు ఉన్నాడని నమ్మాలిసివస్తుంది
మీ దిల్
శ్వాసించే ప్రతి జీవికి ఆశించే హక్కు ఊంటుంది
చెలించే ప్రతి జీవికి చేరుకునే మార్గం ఊంటుంది
పయత్నించే ప్రతి వ్యక్తికీ దాన్ని పొద్దే రోజు వస్తుంది
మీ దిల్
కమ్మిన కారు మబ్బులు వెలుగుని చూసి ఎలా పారిపోతాయో
అలానే
ని జీవితంలోకి వచ్చిన కష్టాలు
ని దైర్యన్ని చూసి చెదిరిపోతాయి
మీ దిల్
విజయం సాదించాలి అనుకోవడం తప్పుకాదు
ఎప్పుడు విజయమే కావాలి అనుకోవడం తప్పు
మీ దిల్
గుంపులో ఒకడిగా ఊండటం సులభం
కానీ ఒంటరి పోరాటానికి గుండె దైర్యం కావాలి
మీ దిల్
బంధాల శంకేళ్లు తెంచలేక
బాధ్యతల భారాన్ని మోయ్యాలేక
మనసుకోరుకుంటున్న దాన్ని పొందలేక
ఏవరికి చెప్పుకోలేక
నిరంతరం నిరీక్షిస్తున్న
ఆశతో ముందుకెళ్తున్న
మీ దిల్