అమ్మా అని నోరారా పిలిచిన అమ్మలగన్న అమ్మయున్ పలుకున్ అంతటనే వచ్చి కావగా అండగా నిలుచున్ మూర్తీభవించిన కరుణలాలసహృదయంతో అక్కున చేర్చి అడగకనే ఆకలిదప్పులు తీర్చున్ ప్రకృతి సశరీరం దాల్చిన దివ్యత్వ శక్తియే అమ్మ ఆమె పాదాల చెంతన్ అఖండ భువనముల్ కనుసైగతో చరాచర జగత్తులో చలనముల్ గల్లున్ అట్టి మాతృ శక్తి రూపముల్ దాల్చిన ప్రతీ మాతృమూర్తికి ఇవియే నమస్సుమాంజలుల్