చిత్ర విచిత్రాలలో
దాగున్న అరుదైన
సజీవ సంపదలు!
భౌగోళిక చారిత్రక ఆధారాలకు
ఆనవాళ్ళు
ప్రదర్శనశాలలు!
పుట్టినరోజు
పుడమి పులకరించి
పున్నమి వెన్నెల విరిసినట్లు
తల్లిదండ్రుల ప్రేమను తలచి
దీవెనలందుకున్న చాలు
కష్టపెట్టక కన్నీరు నింపక
కడుపార కమ్మని హృదయమునిచ్చిన చాలు
పుట్టుకకదే నిత్యము పండుగ రోజు!
నిద్ర
కనుమరుగైంంది కాలం
కలతను నింపింది దూరం
నా కనులకు చేరువ కానంటుంది
నిద్ర!
నిద్ర
కనుమరుగైంంది కాలం
కలతను నింపింది దూరం
నా కనులకు చేరువ
కానంటుంది నిద్ర
స్వప్నాలెన్నో కరిగి
రేపటి చీకటి మొదలైంది
నా మదిలో...!
అల వైంకుఠ పురమే
ఇల ఎదుట నిలిపే
సరి లేరు నీకెవ్వరే
రంగస్థలమై....హంగులన్నీ
అద్దే చిత్రాలకు నిలయం
చలన చిత్రం!
హొళి
నవీనతకు నాంది
రంగుల హోళి
కావాలి ...
నవ భారతావని పునాది!
రంగులు
వర్ణాలెన్నో... వర్ణనలెన్నో...
ప్రకృతి ఒడిలో
వెలిసిపోనీయకు నీ జీవిత రంగులు!
నేటి ఉత్సవం ముగిసింది...
రేపటి ఉత్సాహానికి ఊతమిస్తూ
మహిళా దినోత్సవం!
నేటి ఉత్సవం ముగిసింది...
రేపటి ఉత్సాహానికి ఊతమిస్తూ
మహిళా దినోత్సవం!