దగ్గరగా ఉంటుంది కాబట్టి భూమిని కాళ్ళతోతొక్కుతాం.అందదు కాబట్టి ఆకాశాన్ని ఆరాధిస్తాం.మనుషులైనా అంతే. -లోగిశ లక్ష్మీనాయుడు సింహాచలం.
సూర్యుడితోపోటీపడి మేలుకుంటావు. సూర్యుడు సాయంత్రానికి అలసిపోతాడు. నీకు అలుపు రాదు. గెలుపు లేదు.తల్లీ...వందనం. -లోగిశ లక్ష్మీనాయుడు సింహాచలం.
ఉత్తములు చెట్టుతోసమానం.విమర్శలరాళ్ళతో కొడుతున్నా అనుభవాలపళ్ళనేపంచుతారు. -లోగిశ లక్ష్మీనాయుడు సింహాచలం.