*కొన్ని కొన్ని దూరంగా ఉంటేనే ఆస్వాదించగలం, ఆనందించగలం...*
*దగ్గరగా మసలాలనుకుంటే అప్పుడు కనిపించే మచ్చలూ, మరకలతో మనశ్శాంతి దూరం కావచ్చు....*
నీకై నువ్వు నువ్వేంటో నిరూపించుకునేదాకా.... ఎవరూ నిన్ను గుర్తించరు
ఒక్కసారి నువ్వేంటో లోకానికి నిరూపణ అయ్యాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు....
ఇదే జీవితం😊
గడియారం నిండా ముల్లులే
ఎదను ఘడియ ఘడియకూ గుచ్చుతూ
నిన్నటిలా బాగుంటుందని
జరుక్కుంటూ వచ్చా
శూన్యానికి దారని తెలిసినా
వెనుదిరిగలేకున్నా.....😔😔
ఎవరిని నేను
నిన్ను అన్వేషించే చకోరాన్నా....
నన్ను నేను తెలుసుకునే నిరంతర నిఘంటువునా...
నాకెందుకీ వాతావరణం పడటం లేదు....
లోనా బయటా నాటకాల మధ్యన ఉన్న తెర నాకెందుకు నచ్చడం లేదు.....
దిద్దుకోలేని తప్పు చేసేసిన
తర్వాతి పశ్చాతాపం
అత్యంత
దారుణ శిక్ష......
అంత త్వరగా
బయటపడలేం....
నోట్ : తప్పని తెలీక చేసే తప్పే ఆ దిద్దుకోలేని తప్పు
ఎవరి ఆటలోనో మనం పావులం అవుతాం.....
మనదనుకున్న నిజాయితీని తెలీకుండానే పోగొట్టుకుంటాం.....
నేనెవరో నాకు ఎరుకే అనుకుంటూ ఉంటా....
నువ్వు చల్లిన మాటల మత్తులో మునిగిపోయాక నా ఉనికినే మరచిపోతుంటా......