"ఎందుకురా ఛీకొట్టేవాళ్ళ వెంబడి తిరుగుతావ్?" అంది నా చెల్లి "అప్పుడే కదమ్మా మనిషి అనేవాడు ఎలా ఉండకూడదు అనేది తెలుస్తుంది" అన్నాను నేను
ఒక కుండకి 20 తూట్లు పడ్డాయి, నీరు పోతుంది, కానీ నీకు పది వేళ్ళే ఉన్నాయి. ఆపడం కష్టం కదా!!! కుండ నీ మనసనుకో ... నీరు ప్రేమనుకో గాయం నీ మాటలనుకో .. మళ్ళి చదువు
ఒక కుండకి 20 తూట్లు పడ్డాయి, నీరు పోతుంది, కానీ నీకు పది వెళ్లే ఉన్నాయి. ఆపడం కష్టం కదా!!! కుండ నీ మనసనుకో ... నీరు ప్రేమనుకో గాయం నీ మాటలనుకో .. మళ్ళి చదువు
నువ్వు తోపు రా... నువ్వు తురుం రా అని పొగిడి రెచ్చగొట్టేవాళ్లు మధ్యలో వస్తారు, మధ్యలోనే వదిలేసి పోతారు. ప్రమాదం మిత్రమా! అలాంటివారితో కాస్త జాగ్రత్త!!
పల్లకి మీద ఊరేగినా సరే, దిగి నడవలసింది నేల మీదనే. గడపవలసినది ఆ పల్లకి ఎక్కించేంత మనసున్న మనుషులతోనే. ఆ గౌరవం నీ దేహానికి కాదు, నీలో ఉన్న విద్యకి. అది మరచిపోకు మిత్రమా!!!
ఓటమి గెలుపుకు తొలిమెట్టు. నిజమే!! గెలిచాక నీ ప్రయత్నాన్ని అదే తీరున కొనసాగించకుంటే తరువాతి ఓటమికి కూడా ఆ గెలుపే తుది మెట్టు అవుతుంది.