నీతో ఉన్న అవసరాన్ని దాటి రమ్మని చూడు!... నిజంగా నిఖర్సుగా నీతో ఉండే వాళ్ళేవరో నీకే తెలుస్తుంది!!.. వాళ్ళ రేపటి అవసరాల కొరకే అంతలా అనురాగపు నాటకాలు!!!.. _ హరాక్షర 3074✍️
ఇయ్యాల రేపట్ల పరిచయాలు కూడా బాగా పిరమైనయ్!.. జేబుల పైస లేకపోతే ప్రక్కనే పలకరింపులు కూడా కరువైనయ్ !!... అసొంటిది?.... ఇక 'ఊపిరి పోతే'!... నీ ఊసెత్తే వాడు కాదు కదా!... నీ గురించి ఆలోచనే ఎవడికి రాదు!!... ఇది కలికాలం మరి!!!... _ హరాక్షర 3074✍️
ఎదురయ్యే ప్రతీ పరిచయాన్ని మీతో బంధంగా ఉన్నంతకాలం పదిలంగా కాపాడుకోండి!... ఆ పరిచయ జీవం ఎప్పుడూ పరిమళంవాడిన పూవై రాలుపోతుందో చెప్పలేం!... _హరాక్షర 3074✍️
ఇక్కడ ఎవ్వడూ ఎప్పటికీ పర్మినెంట్ కాదు బాబాయ్!.. అంతా expire date గాళ్ళమే!... ఎవడి time ఎప్పటి వరకు ఉందో తెలీదు!... చావు!... మనం ఎంత ఎగిరిన అంతా సర్ధించి మరీ సక్కంగ ఎత్తుకపోతది. దీనికి ఏ రెకమండేషన్ లు పనిచేయవు బాబాయ్! _హరాక్షర 3074✍️
అన్ని జెండాలు మోసే బదులు నీకంటూ ఓ ఎజెండా పెట్టుకోవచ్చుగా!... ఎన్నిండ్లు తిరిగిన సొంత గూటికి చేరాల్సిందేగా... _ హరాక్షర 3074✍️