పుస్తకాలు
మనసు సంతోషంతో పాటు ,మెదడు సంతోషానికి మరియు జ్ఞాన సంపదకు ప్రత్యక్ష నిదర్శనాలు.
అసూయ
మనిషి అహాన్నీ పెంచి సంతోషాన్ని, ప్రేమనీ హరించే నీచమైన విలువలేని యంత్రం.
యోగా
మానసిక మరియు శారీరక ఊత్తేజంతో పాటు ఉద్వేగాల నియంత్రణల శిక్షణా సాధనం.
సంగీతం
అలసిన మనసుకు మధురమైన ఊరట కలిగించే అత్యద్భుత సాధనం
తెలివి
మనసు,బుధ్ధి అనుసంధానమైనవి,కనుక విపత్కర పరిస్థితిలో ధైర్యం కోల్పోనివాడే నిజమైన వివేకవంతుడు.
విహారయాత్ర
మనసు సంతోషానికే కాదు,జ్ఞాన సంపదకు అతి విలువైన యాత్ర.
డబ్బు
జీవనానికి ఆధారం డబ్బు.
ప్రస్తుతం మనిషినే కాదు,యావత్ ప్రపంచాన్నీ నడిపిస్తుంది.
శాంతి
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది.
గెలుపు
ప్రయత్నం చేసిన ప్రతీసారీ గెలుపు సొంతం కాదు,కానీఏదో ఒక రోజు గెలుపు తథ్యం.