మంచి చెడు, కష్ట సుఖాలలో ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే ఒక మంచి స్నేహితుడిని కలిగివున్న వానికంటే గొప్ప అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు! ఆ ఒక్క స్నేహితుడు వందమంది స్నేహితులకన్నా ఎక్కువ!
సత్ విలువలతో కూడిన బ్రతుకు ప్రయాణంలో ముళ్ళవంటి కష్టాలు ఎన్ని ఎదురొచ్చినా, పూల పానుపులాంటి సుఖాలు ఎన్ని దరి చేరినా మన వ్యక్తిత్వం మరియు నడతలో మార్పు ఉండదు.
ఉరుకుల పరుగుల ప్రయాణాలు! గందరగోళ బిజీ జీవితాలు! డబ్బుడబ్బంటూ వెంపర్లాడుతూ.. కంటినిండ నిద్ర, కడుపునిండా తిండికి నోచుకోని ప్రాణులు!!
కడవరకు తోడుంటాడనే ఆశతో ఎన్నో కలలు కంటాము. ఆ వ్యక్తి దూరమయ్యాకగానీ తెలిసిరాదు ఈ జీవిత ప్రయాణంలో మనం ఒంటరివాళ్ళమని! చివరి మజిలీలో కూడా ఎవరూ మన తోడురారని!!