SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

4  

SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 4"

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 4"

8 mins
443


"యోధ (ఓ ఆత్మ ఘోష) - 3" కి

కొనసాగింపు...

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 4"

విసిరి కొట్టిన బంతిలా గోడకు తగిలి కింద

డభేల్.. మంటూ పడిన అవేశ్ కి నడ్డి విరిగినంత పనైయింది.

అలా కింద పడిఉన్న అవేశ్ దగ్గరకి, తనని విసిరికొట్టిన ఆ దెయ్యం ఒక్క ఉదుటున అక్కడికి వచ్చి, అవేశ్ మొహంలో మొహం పెట్టి అలానే చూస్తుంది. కొంచెం తేరుకుని పైకి తలెత్తి చూసిన ఆ దెయ్యాన్ని ఒక్కసారిగా చూసిన అవేశ్, ఖంగుతిన్నాడు.

ఎందుకంటే, తను చూస్తున్న ఆ రూపం ఎవరిదో కాదు...

ఆ ఇంటి పని మనిషి లక్ష్మిది.

గాలికి విరబూసుకున్నట్లున్న తన జుట్టు కురులు

ఏదో బూడిద పూసుకున్నట్టున్న తెల్లగా తన మొహము,

కాటుక రాసుకున్నట్టున్న నల్లటి కళ్ళు,

మధ్యలో తెల్లగా ఉండాల్సిన తను రెండు కను బొమ్మలు ఎర్రటి లావాని తలపిస్తున్నాయి.

వాటి నుండి రక్తం ధారగా కారుతుంది.

తన కళ్ళను మరింత పెద్దవి చేస్తూ తదేకంగా అలానే చూస్తుంది అవేశ్ ను లక్ష్మి.

నల్లటి పెదవుల వెంబడి పక పక బిగ్గరగా ఒకటే నవ్వుతూ..

ఒక్కోసారి ఆ నవ్వు ఆపుతూ...

కోపంగా, ఆవేశంగా గట్టిగా తన ఉచ్ఛ్వాస నిశ్వాస లను పీల్చుకుంటూ, వదులుతూ అవేశ్ వంక ఉరిమి ఉరిమి చూస్తుంది

ఇలా..





లక్ష్మిని అలా చూస్తున్న అవేష్ కి, ఒళ్లంతా జలదిరుస్తుంది.

తన ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి.

తనకి నోట్లోంచి అసలు మాట కూడా రావడం లేదు.

గోడకు ముడుచుకుని కూర్చుని, గజ గజమని ఒక్కటే వణికిపోతున్నాడు.

తన ఆలోచనలన్నీ భయంతో నిండిపోయాయి. అలాంటి ఆలోచనలతో

అంటే, లక్ష్మి దెయ్యమా ?

మరి లక్ష్మి భర్త వీరయ్య..?

అంటూ ఒకటే తన మనసులో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాడు.

అలా తను వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం దొరక్క...

తన ఒంట్లోనున్న శక్తినంతా కూడగట్టుకుని,

"ఎ.. ఎ... ఎవర్ నువ్వు..?(బిక్కు బిక్కు మంటున్న స్వరంతో..)

అంటూ ఒకపక్క వణుకుతున్న తన చూపుడు వేలిని లక్ష్మికేసి చూపిస్తూ లక్ష్మిని అడుగుతాడు అవేశ్.

"ఎవరా...?

నేనెవరా...?"

అంటూ అవేశ్ చేతిని పట్టుకొని, గట్టిగా లాగి, పక్కనే ఉన్న మంచం మీదకి విసిరికొట్టింది.

అంతకుముందే గోడకు తనని విసిరికొట్టడంతో అప్పటికే కొంచెం బెణికిన తన నడ్డి కాస్త, ఈ సారి ఇంకాస్త ఎక్కువైంది అవేశ్.

ఒక్క ఉదుటున ఆ మంచం మీద పడున్న అవేశ్ దగ్గరకి వచ్చి, తన మీద అడ్డంగా కూర్చుని,



"అవేశ్ షర్ట్ కాలర్ పట్టుకుని,

అట్... అట్... అట్... ఎట్టా..?

ఎవరా...?

నేనెవరా...?

నేనెవరో తెలీదా..?

హా... హహ్హ.. హహ్హహ్హ అంటూ బిగ్గరగా నవ్వుతుంది.



క్షణాల్లోనే ఆ నవ్వు ఆపి, కోపంగా తన వంక ఉరిమి చూస్తుంది లక్ష్మి.

లక్ష్మిలో ఎప్పటికప్పుడు ఏర్పడుతున్న , మారిపోతున్న ఆ మొడ్స్ నీ తట్టుకోవడం అవేశ్ వల్ల కావడం లేదు. తను మరింత భీతిల్లాడు.

"పార్ధు..., గోపాల్..., విశాల్... గౌ..."

అంటూ అవేశ్ అరవబోతుంటే,

లక్ష్మి తన రెండు కళ్ళు మరింత పెద్దవి చేస్తూ...

"అరవకు రా...!"

అంటూ గధమాయించింది.

దాంతో ఒక్కసారిగా తన మీదనున్న లక్ష్మి ని కిందకు తోసి, అవేశ్ అక్కడి నుండి పారిపోతూ... డోర్ దగ్గరికి వెళ్ళి, లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించే లోపు, లక్ష్మి అక్కడికి చేరుకుని, అతని జుట్టు పట్టుకుని మళ్ళీ అదే మంచం మీదకి విసిరికొట్టింది.

దాంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు అవేశ్.

అవేశ్ చూస్తుండగానే, లక్ష్మి ఆ డోర్ దగ్గర మాయమయి, అదే మంచం మీద తనకి అడ్డంగా తన మీద కూర్చుని ప్రత్యక్షమైంది మరలా.

"పిచ్చి... పిచ్చి...

వేషాలు వేసావనుకో...!

పీక కొరికి చంపేస్తా...!!

అది ఎలాగో ఎవరూ తప్పుంచలేరనుకో..!" అంటూ అవేశ్ కి వార్నింగ్ ఇస్తుంది.

దాంతో భయపడ్డ అవేశ్...

"అసలు ఎవరు నువ్వు..?

నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావ్..?

నేనేం చేశాను..?" అంటూ అడుగుతాడు.

"చిన్నగా మొదలయ్యి కాస్త కాస్తా పెద్ద పెద్ద గా నవ్వుతూ...



ఏం చేసావా..?

నువ్వేం చేసావా..?

ఈ గదిలోకి ఏ ఉద్దేశ్యంతో వచ్చావ్ రా..?

మీకు ఆడపిల్లలంటే అంత అలుసా రా...?

వాళ్లు దానికి తప్ప దేనికి పనికిరారా...?

ఆడపిల్ల పుట్టింది, మీ కోరికలు తీర్చడానికి మాత్రమేనా రా..?

ఎందుకు వాళ్ళని ఒక ఆట వస్తువులా చూస్తారురా..?

అంటూ అవేశ్ ని నిలదీస్తుంది.

"అది... అది...

అది నా గర్ల్ ఫ్రెండ్

నా ఇష్టం వచ్చింది చేసుకుంటా ...

అయినా అది నేను చూసుకుంటాం...

మా మధ్య నీకెందుకు..?" అంటూ బదులిస్తూ అవేశ్

దాంతో కోపం కట్టలు తెంచుకున్న లక్ష్మి,

"తన రెండు పెదవులు బిగువు చేసి, కళ్ళు పెద్దవి చేసి

అవేశ్ చొక్కా కాలర్ పట్టుకుని ఎడా పెడా రెండు చెంపలు వాయిస్తు....



ఏమన్నావ్ రా... ?

నీ గర్ల్ ఫ్రెండ్ ఆ..?

అది.., ఇది.., అని ఆ ఆడకూతుర్ని నీ ఇష్టమొచ్చినట్లు అంటున్నావ్..?

అంతా నీ ఇష్టం వచ్చింది చేసుకుంటావా..?

నీ ఇష్టం వచ్చింది చేసుకుంటుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమైనా నీ ఇంటి పనిషినా ..?

యోధ..!

యోధ...!!

అంటూ మరింత గట్టిగా అరుస్తుంది లక్ష్మి, అవేష్ మొహంలో మొహం పెట్టి.

"అసలు ఎవరే నువ్వు..?

నన్ను తగులుకున్నవెంటే..?

నేను నీకేం ద్రోహం చేసానే..?

ఇంకేం అన్యాయం చేశానే..?"

అంటూ మళ్ళీ అవేశ్ తనలో నశించిన సహనంతో లక్ష్మిని ప్రశ్నిస్తాడు.

ఇన్నిసార్లు చెప్పాగా

అయినా నీకర్థం కావడం లేదా..?

ద్రోహం చేసింది, అన్యాయం చేసింది నాకు కాదు

ఓ ఆడకూతురికి..

ఏంట్రా...?

పోనీలే అని చూస్తుంటే,

వే..., గే... అంటూ రెచ్చిపోతున్నావ్..!

ఇంకోసారి అలా అన్నవో నీ రక్తం తాగుతా అంటూ అవేశ్ నీ బెదిరిస్తుంది లక్ష్మి.

"నేనే తప్పు చేయలేదు..?

ఎవరికి అపకారం తలపెట్టలేదు..?

ప్రియ కూడా ఇష్టమే, అందుకే నేనిలా చేయడానికి ట్రై చేసాను..?

అంటూ బదులిస్తూ కొంచెం కోపంగా మాట్లాడతాడు అవేశ్.

దాంతో లక్ష్మి...

తాను తన ఆ భయంకరమైన రూపాన్ని మార్చుకుని, ఒక సౌందర్యవంతమైన రూపంలోకి వచ్చేస్తుంది.

తన కలువ రేకుల్లా, బుగ్గలు ఆపిల్ పళ్ళలా, పెదవులు ఎర్రటి గులాబిల్లా...

చుట్టూ ప్రకాశవంతంగా...

అవేశ్ కి అదంతా చూస్తుంటే, అప్పటికవరకూ దెయ్యంలా కనిపించిన తను అప్పటినుండి ఒక దేవ కన్యలా తనకు దర్శనం ఇస్తుంది.


తనను అలా చూస్తూ తనకు తానే ఏమారిపోయిన అవేష్ తో

"తిందరపడకురా సుంధరవధనా..?

నువ్వేం ఏం చేసావో, ఎవరిరేవరికి అన్యాయం చేశావో ఇప్పుడే తెలుస్తాగా" అంటూ తన అరచేతిని అవేష్ గుండెలపై నుండి రొమాంటిక్ గా పైకి పోనిస్తూ తన మేడ, దానిపైనా గెడ్డం, పెడవుల గుండా ముక్కు , చెంపలను నిమురుతూ, తన రెండు కళ్లను మూయించి, తన నుదుటి పై, లక్ష్మి బ్రోటన వేలితో గట్టిగా నొక్కి తనని గతంలోకి తీసుకెళ్లిపోతుంది. అంటే అవేశ్ ని హిప్నాటిజం చేస్తుంది.

                      ******************

"అవి అవేశ్... డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజులు.

పద్మ..

ఓ పేదింటి పిల్ల. చాలా మంచమ్మాయి. చదువులో కూడా చాలా బాగా రాణిస్తుంది. ఎవరి జోలికి వెళ్ళని తత్వం. అవేశ్ తో పాటే డిగ్రీ అదే సంవత్సరం తను కూడా అదే కాలేజ్ లో డిగ్రీ లో జాయిన్ అయ్యింది.

వాళ్ళ క్లాస్ లోనే చాలా అందమైన, తెలివైన అమ్మాయి తను.

అప్పటికే, తన వెనుక ప్రేమ పేరుతో చాలా మందే తన వెనుక పడ్డా...

తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వాల్లని ఒక గొప్ప స్థితిలో నిలపాలనే లక్ష్యంతో అలాంటి వారికి దూరంగా ఉంటూ వారికి లొంగని తత్వం తనది.

ఒక్క చదువు తప్ప, ఇంకో ధ్యాస లేని అమ్మాయి.

అవేశ్...

ఒక ఉన్నత కుటుంబం నుండే వచ్చాడు. అసలే కామవాంఛ ఎక్కువ అతనికి. ఆ రోజు డిగ్రీలో జాయిన్ అయిన పద్మ అందాన్ని చూసిన అవేశ్, ఆ అందానికి ముగ్ధుడయ్యాడు.

తన కోరికలను ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేక పోయాడు. ఎలాగైనా తనని అనుభవించాలనే కామకొరిక తనకి పుట్టింది.

దానికి తోడు, చుట్టూ ఉన్న స్నేహితులు కూడా అతన్ని రెచ్చగొట్టడంతో...

వెంటనే తన వద్దకు వెళ్లి, "నాతో ఒక నైట్ స్పెండ్ చేస్తావా..?" అంటూ సిగ్గులేకుండా అడుగుతాడు పద్మని తన ఫ్రెండ్స్ అందరి ముందే.

దాంతో కోపోద్రిక్తురాలైన పద్మ, అవేశ్ అన్న మాటలకు ఆవేశంగా, అదే అందరి ముందు చాచిపెట్టి గట్టిగా అవేశ్ రెండు చెంపలను చెళ్లుమనిపించింది.

చుట్టూ ఉన్నవాల్లంతా అవేశ్ నీ చూస్తూ పగలబడి నవ్వుతారు. అవేశ్ ఫ్రెండ్స్ కూడా అవేశ్ ను హేళన చేస్తారు. అవమాన భారంతో అవేశ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

తనని ఏదోకటి చెయ్యాలనే కసి అవేశ్ మదిలో మొదలవుతుంది. ఇప్పుడేం చేసినా అది తన మీదకే వస్తుందని భావించి, మూర్ఖపు నిర్ణయాలతో కాకుండా తనని తెలివిగా దెబ్బకొట్టాలని ప్రణాళికలు రచిస్తాడు అవేశ్.

అలాంటి ప్రణాళికలో భాగమే, పద్మ దగ్గర మంచివాడిగా నటించి, తనని ప్రేమలోకి దింపి, ఆ తర్వాత తనని లోబర్చుకోవడం. ఇదే అతని ప్లాన్.

మరునాడు వెళ్లి, తను చేసిన తప్పుకు క్షమాపణలు కోరతాడు. తనని మచ్చిక చేసుకుని, తనతో చెలిమికి ప్రయత్నిస్తాడు. చివరికి తను అనుకున్నట్టుగానే, సరిగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు, పద్మ దగ్గర ఓ మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ప్రేమ పేరుతో తనకి గేలం వేస్తాడు. పద్మ గురించి తెలిసిందేగా, అంతకుముందు వాళ్ల లాగానే, అవేశ్ కి కూడా లొంగలేదు. తనని కూడా రిజెక్ట్ చేస్తూనే... మంచి ఫ్రెండ్స్ గా ఉందాం అంటూ చెప్తుంది. దానికి అవేశ్ కూడా ఏమనకుండా ఒప్పుకోవడంతో తనపై, పద్మకి ఇంకాస్త మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

వాళ్ల ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ముగుస్తుందనగా కాలేజ్ యానివర్సరీ రానే వచ్చింది. ఆ రోజు నైట్ అందరూ పార్టీ లో బాగా ఎంజాయ్ చేశారు. అప్పటికే బాగా లేట్ నైట్ అవ్వడంతో, పద్మ ఆ నైట్కి వాళ్ల ఫ్రెండ్స్ రూంలో ఉందామనుకున్నా...

"మా రిలేటివ్స్ రూం పక్కనే, అక్కడైతే నీకు ఏ ఇబ్బంది ఉండదు," అంటూ తనకి సలహా ఇస్తాడు అవేశ్.

తను అతనితో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నా కూడా..

"నువ్వు ఇప్పుడు రాకపోతే, ఇంకా నా మీద నీకు నమ్మకం లేనట్టే, ఆ రోజు జరిగింది నువ్వింకా మనసులో పెట్టుకున్నావు కదూ!" అంటూ తన గుంట నక్క తెలివి పద్మ దగ్గర చూపించాడు అవేశ్.

అసలే సున్నిత మనస్కురాలైన పద్మ, అతని మాటలకు కరిగిపోయి చివరికి అవేశ్ రిక్వెస్ట్ ని కాదనలేక ఒప్పుకుంది.

అలా తనని రిలేటివ్స్ రూం కి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. ఇల్లంతా కాళిగా ఉంది. దాంతో భయ బ్రాంతులకి గురైనా పద్మ..

"ఏంటి..? ఇక్కడ మీ రిలేటివ్స్ ఉంటారు అని చెప్పావు. ఇల్లంతా కాళిగా ఉంది." అంటూ అవేశ్ ని ముక్కు సూటిగా ప్రశ్నించింది పద్మ.

"ఓహ్..!

అదా.. నాకు కూడా ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అందరూ ఎక్కడికో వెల్లినట్టున్నారు.

అయినా ఎందుకంత భయం..!

నేనున్నాగా..!!

ఆ చెమటలు చూడు ఎలా పడుతున్నాయో, (తుడుచుకోమన్నట్టుగా పక్కనే ఉన్న టవల్ ఇస్తూ)"

అంటూ అప్పటికే భయంతో చెమటలు పట్టిన మొహాన్ని తన చేతులతో తుడుచుకుంటున్న పద్మ తో అన్నాడు అవేశ్.

"నాకెందుకో చాలా భయం వేస్తుంది.

పదా వెళ్ళిపోదాం!"

అంటూ పద్మ కొంచెం భీతిల్లిన స్వరంతో అంటుంటే,

"అబ్బబ్బా... నీ తెలివి చదువులోనే,

బయట ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు అన్నమాట...!

అయ్యో తింగరి ఎందుకంత భయం... ఉండు వాటర్ తీసుకొస్తాను" అంటూ తనని సోఫా మీద కూర్చోబెట్టి, ఆ పక్కనే ఉన్న కిచెన్ లోకి వెళ్ళాడు అవేశ్.

ఈ లోపు ఆ గదినంతా తదేకంగా గమనిస్తున్న పద్మ, చుట్టూ ఎటు చూసిన శృంగారభరిత వాల్ పెయింటింగ్స్, నగ్న చిత్రాలు, చిన్న చిన్న నగ్న బొమ్మలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అవి చూసిన పద్మ కు మరింతగా భయం ఎక్కువైంది.







ఈ లోపు అవేశ్ వాటర్ తీసుకు రావడంతో, వాటిని గట... గటా.. తాగేసింది ఎత్తిన నోరు దించకుండా. పాపం పద్మకి తెలీదు అప్పటికే అందులో అవేస్ మత్తు కలిపాడని.

ఆ మత్తు నీళ్ళు తాగిన పద్మ, స్పృహ కోల్పోయి పడిపోయింది.

అలా స్పృహ కోల్పోయిన పద్మను అదే అదునుగా భావించి తనను లైంగికంగా లోబర్చుకున్నాడు. విచక్షణ లేకుండా తనపై అత్యాచారం చేశాడు.

తెల్లారి స్పృహలోకి వచ్చిన పద్మకి విషయం తెలిసి, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని గ్రహించి, తను ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో రోదించింది.

పక్కనే ఉన్న అవేశ్...

వెటకారంగా నవ్వుతూ...

చూసావా..? ఆరోజు అడిగిన వెంటనే ఒప్పుకుంటే, ఈరోజు నేనింత ప్రయాస పడేవాడిని కాదు, నువ్వింత బాధ పడేదానివి కాదు అంటూ తనతో ఎగతాళిగా అంటుంటే,

అప్పటికి తన కపటి బుద్ధి తెలుసుకున్న పద్మ

అవేశ్ కాలర్ పట్టుకుని

You... Cheat...

You...cheat ..

అంటూ తన రెండు చెంపలు చెళ్లుమనిపించబోతుంటే..

తన రెండు చేతులను గట్టిగా పట్టుకుని, నువ్విపుడు ఏది చేస్తే దానికి తలాడించడానికి నిన్నటి మొన్నటి అవేశ్ నీ కాదే...

ఒక్కప్పటి అవేశ్ నీ,

పో... పోయి నీ దిక్కున్న చోట చెప్పుకో..!" అంటూ తనని పక్కకు తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవేశ్.

తను అలా అవెష్ చేతిలో మోసపోయిన విషయం ఎక్కడైనా చెప్తే, తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఈ సమాజం తప్పుగా అనుకుంటుదేమొనని... ఒకవేళ ఎప్పటికైనా ఈ విషయం బయటకి పొక్కచ్చనే భయంతో బలవంతంగా ఆత్మహత్య చేసుకుంది పద్మ.

అంత కష్టపడి చదివించిన కూతురు, అర్ధాంతరంగా అలా బలవన్మరానికి పాల్పడడం, ఆ కేసును take-up తీసుకున్న పోలీసులు, తను నలుగురితో తిరిగి ప్రెగ్నెన్సీ రావడం, ఇంట్లో తెలిస్తే తిడతారని భయంతో చనిపోయినట్టు గా ఆ కేసుని క్లోజ్ చేస్తారు. దాంతో తమ కూతురు అలాంటిది కాదని ఎంత వారించినా... ఈ సమాజం తన మీద పదె పదే నిందలు వేయడం తట్టుకోలేని వాళ్ల తల్లిదండ్రులు కూడా కొన్నాళ్ళకి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

ఇంత జరుగుతున్నా అవేష్కి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని, తన కుటుంబాన్ని, అతని సరదాల కోసం నాశనం చేసిన అవెశ్ కి, అసలు కొంచెం కూడా పశ్చాత్తాపం అనేది లేకుండా తన పని తాను చూసుకుంటాడు."

అలా తను మర్చిపోయిన ఆ గతాన్ని, అవెశ్ కి మళ్ళీ గుర్తు చేస్తుంది లక్ష్మి.

దానికి ఆశ్చర్యపోయిన అవెశ్...

"ఇవన్నీ నీకెలా తెలుసు!" అని అంటుండగా

లక్ష్మి తన రూపాన్ని మార్చుకుని, పద్మ యొక్క రూపంలోకి మారి అవేశ్ కి దర్శనమిస్తుంది. అప్పుడు అర్ధమవుతుంది అవెష్ కి, తన వల్ల చనిపోయిన పద్మ అలా ఆత్మ రూపంలో తనపై పగ తీర్చుకోవడానికి వచ్చిందని.





"నన్నేం చెయ్యొద్దు.. , నన్నేం చెయ్యొద్దు...."

అంటూ అవెష్ తనని ప్రాధేయపడుతుండగా..

"అప్పుడు నేను కూడా ఇలాగే ప్రాధేయపడ్డాను రా...

నువ్వేమన్నావ్...?

ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో అని కదూ..!

ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారో నేను చూస్తా...!

అంటూ ఒక చేతితో అవేశ్ కంఠాన్ని గట్టిగా పట్టుకుని,

మరొక చేతి వేళ్ళని అవేశ్ కడులోకి చొప్పించి, తన ప్రేగులను బయటకి తీసి, అతి కిరాతకంగా మరింత దారుణంగా అతనిని చంపేస్తుంది.




ఆమాయకులైన ఆడపిల్లలను కనికరం లేకుండా పొట్టన పెట్టుకున్న నీ లాంటి మృగాలందరికి,

ఇదే ఈ యోధా విధించే మరణ శాసనం అంటూ అక్కడి నుండి మాయమవుతుంది ఆ ఆత్మ.

అసలింతకీ యోధ ఎవరు..?

యోధ ఆత్మ లక్ష్మీలోకి ఎందుకు ప్రవేశించింది?

ఆ ఆత్మ పద్మ లా ఎలా మారింది..?

యోధ.. లక్ష్మి... పద్మ వీళ్ళందరికీ ఒకరికొరికి సంబంధమేమిటి..?

మిగిలిన వాళ్లందరినీ కూడా ఆ ఆత్మ ఇలానే చంపబోతుందా..?

(ఒకవేళ వాళ్ళు కూడా అవేశ్ చేసిన తప్పులు చేసుంటే)

ఇప్పటికే అవేశ్ చనిపోయాడు, మరి మిగిలిన వారి పరిస్థితేంటి?

వాళ్ళు బ్రతికి బయట బట్ట గలరా..?

ఏం జరగబోతుందో..

తర్వాతి భాగం...

యోధ (ఓ ఆత్మ ఘోష) -5

లో తెలుసుకుందాం.

అంతవరకూ ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Horror