SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

4  

SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

"యోధ (ఓ ఆత్మ ఘోష) -3"

"యోధ (ఓ ఆత్మ ఘోష) -3"

7 mins
525


"యోధ (ఓ ఆత్మ ఘోష) -2" కి

కొనసాగింపు...

"యోధ (ఓ ఆత్మ ఘోష) -3"

అలా ఢీ కొట్టిన వాళ్ల కార్ దగ్గరకు వచ్చి, ఎవరో ఆ కార్ డోర్ నీ కొడుతూ అందులో వున్న వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తున్నారు.

"సారు...!

సారూ...!" అంటూ ఒక మగ వాయిస్

"అయ్యా...!

అమ్మా..!" అంటూ మరొక ఆడ వాయిస్ తో

పార్ధు మరియు అతని స్నేహితులకు బయట నుండి వాళ్ళని ఎవరో పిలుస్తున్నట్టు వాళ్ళకి ఒకటే శబ్దాలు వినిపిస్తున్నాయి.

ఆ పిలుపులు దాటికి ఉల్లిక్కి పడి లేచి, డోర్ తీసిన వాళ్ళకి

అసలు వాళ్ళు ఎక్కడున్నారో?

ఎలా ఉన్నారో? కూడా అర్థం కావడం లేదు.

కానీ, చుట్టూ చూస్తుంటే అప్పటికే ఉదయం అయినట్టు వాళ్ళకి అర్థమైంది. కార్ పక్కనే ఒక మగ మనిషి, ఆడ మనిషి వాళ్ళకి దర్శనం ఇచ్చారు. కార్ లో నుండి కిందికి దిగిన వాళ్లకు, పక్కనే ఒక పెద్ద బంగ్లా కూడా దర్శనమిచ్చింది. ఆ బంగ్లా గోడకే వీళ్ళ కార్ డాష్ ఇచ్చినట్టు వాళ్ళు గమనించారు.

అలా కాసేపటికి తేరుకున్న వాళ్ళకి, రాత్రి జరిగిందంతా ఒకదాని తర్వాత మరొకటి వెంట వెంటనే గుర్తుకొచ్చాయి.

ఆ పక్కనే వున్న వాళ్ల వంక, పార్ధు మరియు అతని స్నేహితులు

"ఎవరు వీళ్ళు..?" అన్నట్టు ఆ ఆడ-మగ వంక ఆలాగే తదేకంగా చూస్తున్నారు. వాళ్ళు మాత్రం వీల్లేవరో తెలిసినట్టు వీళ్ళ వంక కొంచెం మర్యాద పూర్వకంగానే చూస్తున్నారు...

" దండాలు సామీ...!"

అంటూ వాళ్ళిద్దరూ పార్ధుకి మరియు అతని స్నేహితులకి చేతులు జోడించి నమస్కారాలు పెడుతూ...

వాళ్ల కార్ వంక చూస్తూ అందులో ఏవో వెతుకుతున్నారు.

ఇంతలో పార్ధు...

"ఎవరు మీరు..?

ఇక్కడ మీకేం పని..?"

అంటూ వాళ్ళని నిలదీశాడు.

"క్షమించాలి అయ్యగొరు...

కంగారులో సెప్పడం మర్సిపోయాను..

నా పేరు ఈరయ్య...!

ఇది నా పెళ్ళాం లచ్చిమి..!

మమ్మల్ని ఇక్కీ బాబుగొరు అంపారయ్యా..!

మీరిక్కడ వారంపాటు ఉంటారనీ,

మీరెల్లే దాకా మీ బాగోగులు సూసుకుంటూ.. మీకు మమ్మల్ని తోడుగా ఉండమని సెప్పరయ్యా...

ఇంట్లో మీకవసరమైన ప్రతి పని ఇదే సెత్తాధి..

(తన పెళ్ళాని లక్ష్మి నీ చూపిస్తూ)

బయట ఏదైనా అవసరమైతే నేను సేత్తానయ్యా..."

నిజానికి మీరు నిన్న సాయంకాలానికే వత్తారని సెప్పారయ్యా.. ఇక్కీ బాబుగారు.

అందుకే, నిన్న పొద్దుకోక ముందే ఇక్కడికి మేము అచ్చేసాము. పైగా ఈ దారుల్లో రాత్రుళ్ళు పయాణం అంత మంచిది కాదని. మీకోసం చూసి, చూసి రాతిరి పదకొండింటికి పడుకున్నాం. మధ్యలో ఇక్కడేదో శబ్ధమయినట్టు ఇనిపించింది కానీ, ఆ సమయాన బయటకి రాడానికి భయపడి....

(తన బుర్ర గోక్కుంటూ)

అది మీదని, ఆ సమయంలో మీరు బాగా ఇబ్బంది పడి ఉంటారని, ఇప్పుడిదంతా సూత్తంటే అర్ధమవుతుంది."

అంటూ తమని తాము పరిచయం చేసుకుంటూ... ఆ రాత్రి జరిగింది చెప్పుకొచ్చాడు ఆ పనివాడు వీరయ్య.

పక్కనే వాళ్లు చేరుకోవాల్సిన గెస్ట్ హౌస్ కాబట్టి, చెడిపోయిన ఆ కార్ నీ అక్కడే వదిలేసి, కొంచెం విశ్రాంతి తీసుకున్నాకా ఆ కార్ నీ రిపైర్ చేసుకుందామనే ఉద్దేశ్యంతో...

అక్కడి నుండి ఎవరికివాల్లు వాళ్ల లగేజ్ తీసుకుని, ఆ గెస్ట్ హౌజ్ లోకి వెళ్ళబోతున్నారు దానికున్న ఓ పెద్ద గేట్ ద్వారా...

బయట నుండి ఆ బంగ్లా చూస్తుంటే, ఓ పాడు బడిన బూతు బంగ్లా లా ఉంది. దాని ప్రహరీ చుట్టూ చెట్లు, పెద్ద వృక్షాలు తప్ప ఏం లేవు. ప్రహరీ లోపల ఇంటి ముందు ఆవరణ మాత్రం అంతా చాలా శుభ్రంగా, ఎవరో డైలీ క్లీన్ చేస్తున్నంత నీట్ గా ఉంది. దానికి తోడు ఒక స్విమ్మింగ్ పూల్, దాని నిండా స్వచ్ఛమైన నీరు.

బయటకి లోపలకి ఉన్న ఆ తేడా చూస్తుంటే, వీళ్ళు రాత్రికి రాత్రే అదంతా శుభ్రం చేశారా ? అన్నట్టుంది, కానీ వాళ్ళకి నమ్మకం కలగడం లేదు.


అది చూస్తూ పార్ధు మరియు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు.

"ఏంటిక్కడ ఎవరూ ఉండరని చెప్పారు..?

మరి ఇదేంటి, ఇక్కడింత శుభ్రం గా ఉంది, ఎవరో రోజు ఇక్కడే ఉండి ఈ ఇంటిని కాపలా కాస్తున్నట్టు. పైగా మీరు కూడా రాత్రే వచ్చారని చెప్తున్నారు. ఇంత తక్కువ టైంలో దీన్ని ఇంత అందంగా బాగు చేయడం సాధ్యమా?"

అంటూ తమలో మెదులుతున్న ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసింది గౌతమి.

"అవునమ్మా..!

ఇక్కడ ఎవరూ ఉండరు...

మేమొచ్చింది కూడా రాతిరికి రాతిరే, నిజానికి మేము ఒచ్చేపాటికే ఇలా ఉంది. మేము సేసిందేది లేదు. ఇదంతా ఎవరు సేశారో మాక్కూడా ఆచ్చర్యంగానే ఉంది. కానీ, మాకిదంతా మామూలే. ఇలా మీలాంటోలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటామ్. వచ్చిన ప్రతిసారీ ఇలానే, ఇంతే సుబ్రంగా ఉంటుంది ఈ ఇల్లు. ఎవరిదంతా సెత్తున్నరో మాక్కూడా అర్థం కాలేదు ఇంత ఒరుకూ" అంటూ వీరయ్య, గౌతమి ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

దాంతో వాళ్ళలో అనుకొని, ఊహించని భయాలు మొదలయ్యాయి. పార్థుకి మాత్రం వీరయ్య చెప్పేదేది నమ్మాలనిపించడం లేదు. తను ఇంకా వాళ్లందరినీ ఏమార్చడానికి, ఇదాంతా విక్కీ ఆడుతున్న నాటకంగానే భావిస్తున్నాడు.

"సర్లే కానీ, మేము కొంచెం ఫ్రెష్ అవ్వాలి. రూమ్స్ చూపించి, కొంచెం నువు ఆ కార్ రిపేర్ చేసే మెకానిక్ నీ తీసుకురా..!"

అంటూ అడిగాడు పార్ధు వీరయ్యను.

"అలాగే అయ్యగోరు..

మెకానిక్ నీ నేను దగ్గర్లో నున్న పట్నంకెళ్ళి తీసుకొస్తాను, చాలా సమయమే పట్టుద్ది. ఈ లోపు మీరలా కాసేపు సేద తీర్చుకుందురు కానీ, పదండి గదులు సూపెడతాను." అంటూ ఆ బంగ్లా యొక్క ముఖద్వారం తెరుస్తాడు వీరయ్య.

ఆ బంగ్లా తలుపులు తెరవగానే లోపల చూస్తుంటే, అదంతా ఇంద్ర భవనంలా ఉంది. కిందంతా పెద్ద హాలు... ఓ పెద్ద వంట గది, దాని ఆనుకొని డైనింగ్ రూమ్.

లివింగ్ రూం, డ్రాయింగ్ రూం... స్టోర్ రూం. మరియు ఓ చిన్న గది. అందులోనే వీరయ్య, అతని భార్య లక్ష్మి ఉంటున్నట్టు ఆ రూం చూస్తుంటే వాళ్ళకి అర్థమైంది.




పైన సరిగ్గా 7 గదులు, ఒక్కొక్కటి చాలా విశాలంగా, మరింత విలాసవంతంగా ఉన్నాయి. ఎప్పుడో వందల ఏళ్ల క్రితం అయినా ఆ భవంతిని చూస్తుంటే, ఈ కాలపు నిర్మాణ విలువలు ఉట్టిపడేలా నిర్మించినట్టుంది. ఒక మహాలను తలపించేలా ఉంది.




అదంతా చూస్తూ ఆశ్చర్యపోతున్న వాళ్ళని, వారి వారి కి కేటాయించిన ఆ గదుల్లోకి వారిని పంపి,

"సరే బాబు గారు... మీరు కాసేపు ఇశ్రాంతి తీసుకోండి, నేను ఆ మెకానిక్ తీసుకొచ్చే పనిమీదుంటా...

ఈ లోపు మీకేదైనా అవసరముంటే, మా లచ్చిమి సూసుకుంటాది." అంటూ లక్ష్మి వంక చూస్తాడు వీరయ్య.

"అలాగే మావ..!

ఈల్లు సానాలు చేసి, వచ్చే లోపు ఈళ్ళు తినడానికన్ని ఏర్పాట్లు సేసెత్తాను. నువ్వెల్లి ఆ బండి సంగతి చూడు కాత్త." అంటూ వీరయ్యను అక్కడినుండి పంపించేసింది లక్ష్మి.

వీళ్లు ఫ్రెష్ అవ్వడం... తినడం...

వీరయ్య మెకానిక్ నీ తీసుకొచ్చి ఆ కార్ నీ బాగు చేయించడం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అవ్వకనే అయ్యింది. తర్వాత భోజనం చేసి కాసేపు అలా వాళ్ళందరూ నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రం ఆరు గంటలవుతుంది.

బయట నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపుల దాటికి అందరూ ఒక్కసారిగా నిద్ర నుండి లేచి, బయటకి వచ్చి చూసారు. పక్కనే ఉన్న స్మశానం నుండి వస్తున్నాయి అవన్నీ. ఆ స్మశానంలో కాలుతున్న శవాలను చూస్తూ, నక్కలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అరుస్తున్నాయి.

కాలుతున్నవి, ఒకటి రెండు కాదు...

కొన్ని పదుల సంఖ్యలో శవాలు, గుంపుగా చేర్చి ఎవరో కాల్చేసి వెళ్ళిపోయారు.




దీంతో పార్ధు...

"వీరయ్య... వీరయ్య..." అంటూ గట్టిగా అరుస్తూ వీరయ్యను పిలిచాడు అక్కడికి.

"ఏంటి బాబు..!" అంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన వీరయ్యను చూస్తూ...

"ఇక్కడేంటి ఇదంతా...

శవాలను అలా గుంపులుగా కాల్చేస్తున్నారు. పైగా అక్కడ ఎవరూ లేరు ..

ఈ చుట్టూ పక్కల దరిదాపుల్లో ఎవరూ ఉండరని చెప్పారు.? మరి ఇవన్ని, ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినట్టు.?

అసలు వీటన్నిటినీ ఎవరి తీసుకొచ్చారు ఇక్కడికి..?"

అంటూ నిలదీశాడు పార్ధు.

అవన్నీ అనాధ సవాలు బాబు గోరు. దగ్గర్లో నున్న పట్నంలో కొన్ని కొన్ని ఆసుపత్రులలో, ఎవరు తీసుకెళ్ళక మిగిలిపోయిన శవాలను... ఆల్లిలా పగటి పూట గుంపులుగా తెచ్చి, తగలెట్టేస్తారు, పొద్ధుకోక మునుపే మరెవరికీ కనిపించకుండా ఎళ్ళిపోతారు. ఇక్కడైతే ఎవడూ అడిగేవాడుండడు కదా!

అదే ఆళ్ల దైర్యం!"

అంటూ అక్కడ జరిగేదని గురించి వివరిస్తాడు వీరయ్య.


"మరి అంత దారుణంగా ఒకేసారి అన్ని శవాలను, ఇంత దగ్గరలో తగలపెడుతుంటే కనీసం కొంచెమైనా వాసన రావడం లేదు" అంటూ తనకున్న మరొక సందేహాన్ని అడుగుతాడు పార్ధు.

ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ...

"అదా ...!

ఈ చుట్టూ... మంచి మంచి సువాసనను వెదజల్లే చెట్లుండడం వల్ల అవి ఆ చెడు వాసనని మన దగ్గరకి చేరకుండా చేస్తున్నాయి. అందుకే ఈ గెస్ట్ పక్కనే ఆ శవాలను కాలుస్తున్నా వాటి ప్రభావం ఇక్కడ పెద్దగా ఉండదు."

"అవునూ...ఇక్కడికి ఎవరైనా వస్తుంటారా అసలు?" అంటూ విశాల్ కూడా తనకున్న సందేహాన్ని అడుగుతాడు.

"ఎందుకు రారు బాబు ..!

ఇక్కి బాబు గారు వాళ్ల సుట్టాలు, అప్పుడప్పుడు ఇక్కడికి ఒత్తంటారు. ఆళ్ళ నాన్నగారి స్నేహితులు కూడా వత్తుంటారు.

కాకపోతే..."

"హా...కాకపోతే, మధ్యలో ఆపేసావే చెప్పు , వీరయ్య..!" అంటూ తను చెప్పేది అలాగే కొనసాగించమన్నట్టు అడుగుతాడు విశాల్.

"అది... అది...

ఈ ఆడకూతుర్ల ముందు, అంత విడమర్చి చెప్పడం పద్దతి కాదేమొనయ్యా? అంటూ అతనంటుంటే,

"మేమూ.. చదువుకున్న వాళ్ళమే, వీళ్లతో సమానంగా మాకు హక్కులున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ధైర్యంగా చెప్పు వీరయ్య..! అది మాకు తెలియాలి." అంటూ అది తెలుసుకోవాలనే ఆతృతతో అతన్ని రెట్టించి అడుగుతుంది కృతి.

వీరయ్య... పార్ధు వంక చూస్తూ ..

"ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ, వాళ్ల వాళ్ళ కామ దాహాలను తీర్చుకోవడానికి వస్తారయ్యా.. అంటే, ఆడకూతుర్లను వారి వెంట తెచ్చుకుని, వాళ్ల వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. వయసు మళ్ళిన ముసలి ముక్కా కూడా కన్నె పిల్లల్ని తెచ్చుకుంటారు. కొందరైతే ముక్కు పచ్చలారని పసివాల్లని సైతం ..."

అంటూ వీరయ్య చెప్తుండగా

"ఛీ...!!

ఛీ...!!!

ఇలాంటి వెధవలికి, అడ్డు చెప్పేవాళ్ళు లేరా...?

వచ్చే వాళ్ళకి అసలు బుద్ధి ఉండదా..?

అయినా ఇంత దూరం వాళ్ళని బలవంతంగా ఎలా తీసుకొస్తారు అసలు...?" అంటూ మధ్యలో కలుగజేసుకుంటుంది రమ్య.

"హమ్..

బలవంతం ఏముందమ్మా!

పేరుకే ఇది గెస్ట్ హౌజ్ కానీ, నిజానికి ఇదొక బ్రోతల్ హౌస్ లాంటిది.

ఇక్కి బాబు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి ఆళ్ళ ప్రెండ్స్ నీ ఇట్టపడే ఒత్తారు..

ఇంట్లో పరిస్థితులకు తలొగ్గి కొంతమంది ఒత్థారు.

పెద్ద పెద్దోళ్ళు అయితే వాళ్ళకి నచ్చినోల్లని బలవంత పెట్టి, లేదా ఆళ్లకి ఇంకేదో ఆశ చూపి గేలమేసు తీసుకొత్తారు."

ఒప్పుకున్న వాళ్ళు, తలొగ్గిన వాళ్ళు బతికి బట్ట కడతారు. లేదంటే అదిగో ఆ స్మశానంలోనే శాశ్వత సమాధులు గా అవుతారు. మొదట్లో మీరు కూడా అలాంటోరే అనుకున్నా, కానీ మీ మాటల్లో తెలుత్తుంది మీరు ఆరీలాంటోల్లు కాదని" అంటూ అక్కడున్న పరిస్థితిని వివరిస్తాడు వీరయ్య..

"ఛీ.. ఛీ... మమ్మల్ని చూస్తే నీకెలా అలా అనాలనిపించింది వీరయ్య !" అంటూ గౌతమి అతను తెలియకన్న ఆ మాటలను ఖండించింది.

దాంతో వీరయ్య సిగ్గుతో తలదించుకున్నాడు.

"మరి ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతుంటే,

ఎవరూ అడ్డు చెప్పరా..?

అసలిక్కడింత జరుగుతుంటే బయట ప్రపంచానికి తెలియదా?" అంటూ అడుగుతుంది ప్రియ.

"అసలిక్కడ ఒక గెస్ట్ హౌజ్ అన్నది ఉన్నట్టే ఎవరికి తెలీదు. ఇక ఇక్కడ జరిగే ఆటి గురించి ఇంకేం తెలుత్తాది. ఈ మధ్య ఇక్కడికి వచ్చినాల్లు, ఇక్కడేదో ఉందని భయంతో భయపడి పారిపోతున్నారు. ఇంకొందరు ఆ భయాన్ని తట్టుకోలేక ఏకంగా సచ్చిపోతున్నారు. అందుకే, ఈ మధ్య ఇక్కడ జరిగే అరాచకాలన్ని పగలే జరుగుతున్నాయి. రాత్రులు రావడానికి మంది భయపడుతున్నారు సామీ!. కానీ, మాకైతే ఇలాంటివన్నీ ఒట్టి అపోహలే!" అంటూ బదులిస్తాడు ఆ వీరయ్య.

అప్పటికే నైట్ తొమ్మిదైంది. లక్ష్మి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టింది. అది తిన్న వెంటనే, ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి అంతా కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి బదులు, వీరయ్య చెప్పిన దాని గురించి ఒకటే ఆలోచిస్తున్నారు. దానికి తోడు రాత్రి జరిగిన సంఘటనలు కూడా వారి భయాలకు ఆయువు పోస్తున్నాయి.

ఒకపక్క అందరూ భయంతో బిక్కు బిక్కు మంటుంటే, వీరయ్య చెప్పినదాంట్లో ఒక్క కామం టాపిక్ మాత్రమే గుర్తుంచుకున్న అవేష్ మాత్రం, రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళాడు. అసలే మన ఆవేశ్ మంచి రొమాంటిక్ ఫెల్లో కూడాను.

ఎప్పటినుండో తన గర్ల్ ఫ్రెండ్ తో కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న తను, ఇదే మంచి అదునుగా భావించి, ఏకాంతంగా ఉన్న తన గర్ల్ ఫ్రండ్ ప్రియ రూం కి వెళ్ళాడు.

ప్రియ రూం దగ్గరకి వెళ్ళిన అవేశ్, చుట్టూ అంతా చూసి, ఆ చుట్టూ పక్కల ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని, ఆ రూం డోర్ మెల్లగా గెంటాడు. ఏదో వీల్లిద్దరూ ముందే ప్లాన్ చేసుకున్నట్టు ప్రియ డోర్ క్లోజ్ చేయకుండా అవేశ్ కోసమే తెరుచుకుని ఉన్నట్టు డోర్ క్లోజ్ చేయకుండా అలానే తెరిచి ఉంచింది.

ఆ డోర్ నీ మెల్లగా ఓపెన్ చేసిన అవేశ్ లోపలికి వెళ్ళి, అంతే మెల్లగా ఆ డోర్ నీ దగ్గరికి క్లోజ్ చేసి లాక్ చేశాడు. అప్పటికే స్నానం చేసి, టవల్ తో అద్దం ముందు నిల్చున్న ప్రియని చూసి, అవేశ్ కామ వాంఛ మరింత ఎక్కువైంది. తనలో మంచి ఊపుమీదున్న ఆ కామ క్రీడాకారుడు ఒక్కసారిగా బయట పడ్డాడు.

"అబ్బబ్బా... మనకన్నీ ఎంత బాగా కలిసొస్తున్నాయి, అనుకుంటూ...

ప్రియని వెనుకనుండి వెళ్లి గట్టిగా వాటేసుకుని, ప్రియ వీపును తన మొహంతో తడుముతూ...

ప్రియా.. ప్రియా... అంటూ కలవరిస్తూ

ప్రియ కప్పుకున్న టవల్ ముడిని తన వక్షోజాల నుండి విప్పే ప్రయత్నం చేసున్న అవేశ్ చేతులను గట్టిగా పట్టుకుని వాటిని మరింత గట్టిగా నొక్కుతూ... ఆ చేతులని బలవంతంగా విడిపించుకుంటూ

"ఎవర్రా...

ప్రియా....!

యోధ..!

యోధ..!!

అంటూ గంభీరంగా, మరింత బిగ్గరగా అరుస్తూ అవేష్ నీ వెనుక నుండి ఒక్క తన్ను తన్నింది.

దాంతో గాల్లో ఎగిరి గోడకు అంటుకుని, కింద పడ్డాడు అవేష్ ఎవరో విసిరి కొట్టినట్టు.

యోధ ఎవరు..?

అవేష్ ని ఏం చేయబోతుంది..?

అసలు తన కథేమిటి..?

యోధ అక్కడుంటే, మరి ప్రియ ఏమైనట్టు...?

మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి..?

లాంటి ప్రశ్నలకు సమాధానాలు

"యోధ(ఓ ఆత్మ ఘోష)-4" లో తెలుసుకుందాం.

అంతవరకూ ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Horror