SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

4  

SATYA PAVAN GANDHAM

Horror Crime Thriller

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 2"

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 2"

7 mins
588


గమనిక: కథను కొంచెం మెల్లగా చదివితేనే కథలో ఆసక్తి ఉంటుంది, anxiety కూడా ఫీల్ అవుతారు.

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 1" కి

కొనసాగింపు...

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 2"

అలా ఛాలెంజ్ చేసిన మరసటి రోజు నుండే కాలేజ్ అంతా ఒక రెండు వారాలు ప్రాజెక్ట్ హాలిడేస్ ఇవ్వడంతో....

విక్కి, పార్ధుని వీలైనంత త్వరగా ఈ ఛాలెంజ్ నీ ఫినిష్ చేయవలసిందిగా తొందరపెడతాడు.

విక్కి గురించి కాకపోయినా... దీన్ని ఎంత తొందరగా వీలైతే, అంత తొందరగా కంప్లీట్ చేద్దామనే ఆలోచన పార్ధుకి ఉంది. దీని గురించి పార్ధు తన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి, విక్కితో ఛాలెంజ్ చేసిన ఆ మరుసటి రోజు సాయంత్రమే అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు.

"అంతా బాగానే ఉంది కానీ, ఈ వారం రోజులు ఎక్కడికి వెళ్తున్నారని ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి?" అంటూ తనకున్న సందేహాన్ని బయటపెడుతుంది, పార్ధు స్నేహితులలో ఒకరైనా ప్రియ.

విశాల్, గౌతమి కూడా "అవును కదా..!" అన్నట్టు తలాడిస్తూ పార్ధు వంక చూస్తారు.

"ఏముంది... ప్రాజెక్ట్ వర్క్ మీద ఒక వన్ వీక్ బయటకి వెళ్తున్నామని చెప్తే సరిపోతుంది." అంటూ బదులిచ్చింది కృతి వాళ్ల ప్రశ్నకు.

"అవును...!

అది నిజమే, మన ఇళ్ళల్లో మన ఫ్రెండ్షిప్ గురించి కూడా తెలిసిందే కాబట్టి, దీనికి ఎవరూ అడ్డు చెప్పరు... పైగా మన వాళ్ళతో కలిసి వెళ్తున్నామంటే, వాళ్ళకి కొంచెం దైర్యం కూడాను"

అంటూ మరోపక్క కృతి చెప్పినదానికి సపోర్ట్ ఇస్తూ, అండగా నిలుస్తాడు అవేశ్ కూడా...

అందరూ దానికి అంగీకరించి, ఆ రోజు సాయంత్రం వాళ్ల వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు.

కొన్ని కొన్ని అపోహలు, భయాలు వాళ్ల మధ్య ఉన్నప్పటికీ... పార్ధు గురించి, పార్ధు చేసిన ఆ ఛాలెంజ్ గురించి ఆలోచించి వాటిని బయటపడనివ్వకుండా జాగ్రత్త పడతారు పార్ధు ఫ్రెండ్స్.

వాళ్ళు అనుకున్నట్టుగానే అడిగిన వెంటనే, వారి వారి ఇళ్ళల్లో ఒక వారంపాటు బయటకి వెళ్ళడానికి వాళ్ల తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.

పార్ధు ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వాళ్ళు, వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఆ నైట్ అంతా కూర్చొని ,

అసలు నిజంగా ఈ దెయ్యాలు, భూతాలు ఉన్నాయా?

అవి మనుషులను చంపుతాయా, లేక భయపెట్టి వదిలేస్తాయా?

చచ్చిన మనుషులే దెయ్యాలు, పిశాచాలగా మారుతాయా?

సినిమాలు, కథల్లో చూపించినట్టుగా... చనిపోయిన వారు పగలు, కోరికలు తీర్చుకోవడానికి దెయ్యాలుగా మారతారా?

అన్న వాటి గురించి పదే పదే తమ తమ మొబైల్ లో వెతుకుతున్నారు. తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ, తమలో ఏర్పడుతున్న ఆ కొద్దీ భయాన్ని పోగుట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పార్ధు మాత్రం...

తన తండ్రికి లాగానే క్రైమ్ వార్తలను ఎక్కువగా చూస్తాడు. తన ఫోన్లో న్యూస్ ఫీడ్ లో ఎప్పటికప్పుడు వాటిని చాలా ఇంటరెస్టింగ్ గా ఫాలో అవుతాడు. అలా కాలేజ్ నుండి వచ్చేసిన ఆరోజు నైట్ కూడా ...

ఆ రోజు ఉదయం టీవీలో వచ్చిన న్యూస్ గురించి , ఆ మర్డర్ కేసులు గురించి వెతికి వెతికి చదివాడు. ఇలా ఏ ఒక్క రోజో కాదు, ప్రతిరోజూ ఇదంతా పార్ధుకి అలవాటే. ఆ క్రైమ్ న్యూస్ ల గురించి చదివి, వాటి వెనుకున్న కారణలను తనలో తానే భేరీజు వేసుకుంటూ తన ఊహల్లో వాటిని అన్వేషిస్తాడు.

ఇలా అర్ధరాత్రుల్లు నేరవార్థలు, హార్రర్ స్టోరీస్ చదివినా... లేక వాటి గురించి విన్నా ... దెయ్యాలు భూతాలు అంటే భయం పోతాయనే ఒక నమ్మకం పార్దుకి.

అవే సలహాలు, సూచనలు వాళ్ల ఫ్రెండ్స్ కి తరుచుగా చెప్తూ, వాళ్ళలో ఉన్న భయాన్ని ఎప్పటికప్పుడు పోగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు పార్ధు.

ఇప్పుడు పార్ధు బ్యాచంతా చేస్తుంది కూడా అదే, పార్ధు ఇచ్చిన సలహాలను, సూచనలను తూ... ఛా... తప్పకుండా పాటించడం.

                           ****************

వాళ్ళు వెల్దామనుకున్న రోజు తెల్లారింది. ఆ రోజు ఆదివారం. మార్నింగ్ అంతా అందరూ తమ తమ లగేజ్ ప్యాక్ చేసుకుని, ఆ రోజు మధ్యాహ్నం మొదలయ్యి, ఆ గెస్ట్ హౌజ్ కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. నిజానికి మధ్యాహ్నమే బయలుదేరాలనుకున్నా, కృతికి ఒక చిన్న పని ఉండడం వల్ల, అనుకున్న సమయానికి స్టార్ట్ అవ్వలేకపోయారంతా.

అప్పటికే విక్కి.... పార్ధు కి ముందే చెప్పాడు. ప్రస్తుతం వీరున్న చోటు... అదే సిటీ నుండి ఆ గెస్ట్ హౌజ్ కి వెళ్ళడానికి సుమారు నాలుగైదు గంటలు సమయం పడుతుందని, ఎందుకంటే అక్కడికి వెళ్ళే దారి రాళ్ళు రప్పలతో నిండి, నిర్మానుష్యంగా ఉంటుందని. అడువులు, కొండలు దాటుకుంటూ వెళ్ళాలని.

కానీ, పార్ధు దానిని పెద్దగా పట్టించుకోలేదు. అలా అడ్వెంచర్ గా ట్రావెల్ చేయడమంటే కూడా పార్ధుకీ బాగా ఇంటరెస్ట్ ఆపై మరింత ఇష్టం కూడాను. పైగా సొంత కారే కదా! ఎప్పుడైనా, ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళ్ళొచ్చనే నిబ్బరం తనకి.

చివరికి విక్కికి సమాచారం అందించి, ఆ గెస్ట్ హౌజ్ డీటైల్స్ తీసుకుని, ఆ రోజు సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో వారికున్న ఒక జీపులో బయలుదేరి వెళ్ళారు వారంతా.

సిటీ దాటున్నంత సేపూ... అంటే అలా చాలా సేపటికి, దాదాపు పది గంటలు ఆ సమయం వరకూ, వారి ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా సాఫీగానే సాగినా ...

కానీ, ఒక్కసారిగా ఆ అడువుల, కొండలల మధ్య దారిలోంచి వాటిని దాటుకుంటూ వెళ్తుంటే, వాళ్ళకి మొదలయ్యింది అసలు కథ. చీకట్లో బండి లైట్స్ కూడా సరిగా దారిని చూపించలేకపోతున్నాయి. బండి హార్న్ సౌండ్ కూడా సరిగా వినిపించడం లేదు. ఏమేం అడ్డు తగులుతున్నాయో, మరేమేమి వాళ్ళని అనుసరిస్తున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు.

చుట్టూ నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఎవరూ దారి చెప్పేవాళ్ళు లేకపోయినా... రూట్ మ్యాప్ సహాయంతో పడుతూ లేస్తూ వారి ప్రయాణం అలానే సాగుతుంది.

అలా అడువుల్లో దాదాపు ఒక గంట సేపు ప్రయాణించిన తర్వాత...

"చూస్తుంటే చుట్టూ పక్కల అసలెవరు లేరు .. చెట్లు చేమలు తప్ప!

ఇప్పుడు గనక ఏదైనా అయ్యి, టైర్ పంచర్ అయ్యిందే అనుకో!

మన పరిస్థితి ఏంటో..?" అంటూ అసలే నోటి దురద ఎక్కువున్న అవేశ్ అంటుండగా..

అతను అలా అన్నాడో లేదో ఒక్కసారిగా

"టప్.." అంటూ పెద్ద శబ్దం.

వారు వెళ్తున్న ఆ జీప్ కాస్త గాడితప్పి పక్కనే ఉన్న ఒక చెట్టుని ఢీ కొట్టింది. కారు నెమ్మదిగా వెళ్తుండడంతో అందులోనున్న ఎవరికి ఏమీ కాలేదు.

కిందికి దిగి, అది పంచర్ అవ్వడం వల్లే అలా జరిగిందని తెలుసుకున్న వాళ్లంతా

"అది నోరా లేక మూసి నదా.. !

అలా అన్నావో.. లేదో ఇలా జరిగిపోయింది...!

అసలేం నోరు రా బాబు నీది..!

అయినా ఇంత నెగటివ్ థాట్స్ ఏంట్రా నీకు..?

స్టెఫిని ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీడన్న మాటలకి మన పరిస్థితి ఏంటో?"

అంటూ ఒకరి వెనుక ఒకరు అవేశ్ పై తిట్ల దండకం మొదలెట్టారు.

"ఈరోజు మొదలు, మనమందరం ఇక్కడ నుండి మళ్ళీ బయటకి వెళ్లవరకూ నువ్వు నోరు తెరిచావో...?

నీకుంటుంది అవేశ్!" అంటూ అవేశ్ పై కోపంతో రగిలిపోయింది తన గర్ల్ ఫ్రెండ్ ప్రియ కూడా...

ఎందుకంటే, వీళ్ళు అక్కడికి రావడానికి, ఆ చిక్కుల్లో పడడానికి కూడా కారణం అవేశే కదా మరి..!

అదే, అదే అతని నోటి దురుసే కదా మరి కారణం అన్నింటికీ.

అందుకే, అవేశ్ కూడా వాళ్ల మాటలకు ఏమీ అనలేక అలాగే మౌనంగా ఉండిపోయాడు.

ఆపసోపాలు పడి చివరికి ఎలాగో వారితో పాటు వెంట తెచ్చుకున్న స్టెఫిని మార్చారు వాళ్ల కార్ కి.

అలా మళ్ళీ వారు మొదలవ్వబోతుంటే, ఆ కార్ కి అడ్డంగా ఒక పెద్దాయన

(చేత కర్ర పట్టుకుని, బొడ్డు కింద రెండు జానాల వరకూ ఒక చిన్న బట్ట కప్పుకుని, మిగిలిన బక్క పలచని ఒంటి నిండా బూడిద పోసుకుని, విరబూసిన జుట్టు కురులు, మాసిన గడ్డంతో అవన్నీ మర్రి చెట్టు ఊడల్లా వేలాడుతున్నాయి, మొహం పీక్కుపోయి, కళ్ళు లోపలికి పోయి, పెదవులను కప్పుతున్న బీర మీసాలతో... చూస్తుంటే ఒక అఘోర ని తలపించేలా ఉన్నాడు అతను..)

ఇదిగో ఇలా



"ఆగండి..ఆగండి..." అంటూ అతగాడు వాళ్ళు వెళ్తున్న కారుకి అడుపడ్డాడు.

"ఇదిగో పెద్దాయన ఎవరు నువ్వు?

ఇలా కారుకి అడ్డంగా నిల్చున్నావే, బుద్దుందా నీకసలు?" అంటూ గోపాల్ తగులుకున్నాడు అదే కార్ లో నుండి అతనిని చూస్తూ.

"నా బుద్ధి సంగతి పక్క పెట్టు...

అసలు ఇక్కడికి రమ్మని ఏ బుద్ధి లేనివాడు మీకు చెప్పాడు...?

ఎవరో ఏదో చెప్తే, ఏమీ తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చేయడంలో మరి మీ బుద్ధి ఏమైంది?" అంటూ అతను మన పార్ధు వాళ్ల పై విరుచుకుపడ్డాడు.

"హేయ్..!

పెద్దాయన, ఏదో వయసు మల్లిన వాడివి కదా, చేదస్థంతో అంటున్నావని, పోనీలే పాపమని ఇలా ఓపికగా సమాధానమిస్తున్నాం నీకు, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావ్..?

కిందికి దిగానో..? నీ సంగతి తెలుస్తా..!"

అంటూ విశాల్ కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు.

"హా... హహ్హ.. హాహహ్హ...

అంటూ పెద్దగా నవ్వుతూ...

నేను ముసలోడినీ, నేనేం చేయలేను అనే కదా దానర్థం..?

అయినా మీరు నన్నేం చేయగలరు రా మూర్కుల్లారా?

కిందికి దిగితే మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు.

తస్మాత్ జాగ్రత్త..!" అంటూ తన కర్రని వాల్లకేసి చూపిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ, మరింత రెచ్చగొడతాడు ఆ వృద్ధుడు.

దాంతో ఆవేశం కట్టలు తెంచుకున్న ఆవేశ్,

ఆవేశంతో ఊగిపోతూ ..

"ఉండ్రా... నీ పని చెప్తాను!" అంటూ క్రిందికి దూకబోతుంటే,

ఇంతలో... "నిన్ను వెళ్లేవరకూ నోరు మూసుకోమన్నానా..!" అంటూ అడ్డుకుంటుంది ప్రియ ఆవేశ్ నీ.

కార్ డ్రైవ్ సీట్లో ఉన్న పార్ధు...

"మీరు ఊరుకోండి రా...!

ఈ పిచ్చోడేదో వాగుతుంటే, దానికి మీరు కూడా రియాక్ట్ అవుతారు. మనల్ని ఏదోలా భయపెట్టడానికి ఆ విక్కి గాడే ఇదంతా ప్లాన్ చేసుంటాడు." అంటూ వాళ్ళందరి నోరు మూయించి..

ఆ వృద్దుడి మాటలేవి వినకుండా వాటిని పెడచెవిన పెట్టీ, అతనిని తప్పించుకుంటూ ఆ కార్ నీ ముందుకు పోనిస్తాడు.

"వెళ్ళండి రా...!

వెళ్ళండి రా...!!

నేను పిచ్చొడినా...

నా మాట వినకుండా ముందుకు వెళ్తే, మీ జీవితాలకు ఇక ముగింపే. మిమ్మల్ని సృష్టించిన ఆ బ్రహ్మ కూడా మిమ్మల్ని రక్షించలేడు. మీ చావు మీరే కొని తెచ్చుకుంటున్నారు." అంటూ వెళ్లిపోతున్న వాళ్ళని, భయపెట్టేలా బిగ్గరగా అరుస్తాడు. ఆపై గట్టిగా పిచ్చోడిలా నవ్వుతాడు.

అలా వాళ్ళు ఆ అడివిలో ఇంకొంచెం దూరం ప్రయాణించాక..



వారికి ఒక మర్రి చెట్టు తగులుతుంది. అది పక్కనే ఉన్న స్మశానం నుండి వచ్చే వేడి మంటల దాటికి పూర్తిగా ఎండిపోయి, బూడిద తో నిండి, ఎండిన దాని కొమ్మలు మాత్రమే కనబడుతుంటాయి. ఇదిగో ఇలా...



దాన్ని దాటుకుంటూ వెళ్తుంటే...

"ఎక్కడికిరా..?" అంటూ ఒక పెద్ద శబ్ధం వినిపిస్తూ...

వాళ్లు వెళ్తున్న కార్ ముందే ఒక అమ్మాయి ముసుగేసుకుని అడ్డు తగలడం గమనిస్తారు.



వెంటనే పార్ధు తన కార్ బ్రేకులు కొట్టి, ఆ కార్ నీ అక్కడే నిలిపెస్తాడు. కార్ లో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా భయపడి కిందికి దిగి ఎవరది, ఎవరది అంటూ చుట్టూ చూస్తారు...

కానీ, వారికేం కనిపించదు, మరేం వినిపించదు.

ప్రియ, గౌతమి ఇంకా ఆ భయం నుండి తేరుకోలేదు. వాళ్ళు ఇంకా ఆ షాక్ లోనే ఉంటారు. ఇంతలో గోపాల్ వాళ్ళకి కార్ లో ఉన్న వాటర్ తెచ్చిచ్చి, ఆ షాక్ నుండీ వాళ్లు కొంచెం బయటపడేట్టు చేస్తాడు. ప్రియ, గౌతమి కాకుండా మిగిలిన వాళ్ళలో కూడా కొంచెం భయం, కంగారు మొదలవుతుంది ఆ సంఘటనతో... పార్ధు అందరి ముఖాల్లో అది గమనిస్తాడు.

అప్పటికే ఆకాశం అంతా నల్లగా మారింది. చుక్కలు ఏ కోశానా కనిపించడం లేదు. అప్పుడప్పుడే ఈదురు గాలులు కూడా మెల్లగా మొదలయ్యాయి. అసలే అర్ధరాత్రి పన్నెండు అవుతుంది, పైగా ఆదివారం, ఆపై అమావాస్య.

దాంతో ఆ భయం అందరిలో మరింత పెరుగుతుంది.

"ఇదంతా విక్కి ఆడుతున్న ఓ గేమ్ అని, ఎలాగైనా మనల్ని ఈ పోటీ నుండి తప్పించడానికి తనకున్న పలుకుబడి ఉపయోగించి ఇలాంటి పన్నాగాలు పన్నుతూ, కుయుక్తులు వేస్తున్నాడనీ వాళ్ళందరికీ నచ్ఛ చెప్పి వాళ్ళలో దైర్యం నింపుతాడు.

విక్కి ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఇంకా కొంచెం దూరంలోనే ఆ గెస్ట్ హౌజ్ ఉందని వారందరికీ చెప్పి, ఇలా ఆలస్యం చేస్తే మనలో వాళ్లు ఇంకా భయం నింపడానికి ట్రై చేస్తారనీ, అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాడు పార్ధు వారందరిని తీసుకుని.

మర్రి చెట్టు, ఆ స్మశానాన్ని దాటుకుంటూ పక్కనే ఉన్న గెస్ట్ హౌజ్ చూస్తూ అక్కడికి వచ్చేసరికి...

పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉరుములు, మెరుపులు స్టార్ట్ అయ్యాయి...

వాటితో పాటు ఏవేవో వింత వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి...

అవి నక్కలు, తీతువు పిట్టలు ఏదో పగపట్టినట్టు అరుస్తున్నట్టున్నాయి.

ఆ శబ్దాలు మధ్య నుండి...

మరొక పెద్ద అరుపు...

" వద్దని చెప్తుంటే,

మీకర్థం కాదా?

వెనక్కి పొండి!!

అంటూ వారు కార్ ప్రయాణిస్తున్న దారి మధ్య నుండి ఒక అర చెయ్యి భూమిని చీల్చుకుంటూ పైకి రావడం



గమనించిన వాళ్ళందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. దాంతో పార్ధు...

అది తప్పించబోయి, వెంటనే తన కార్ ను పక్కకు తిప్పడంతో అది అదుపు తప్పి, ఆ గెస్ట్ హౌజ్ కి ఉన్నా ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టింది. అప్పటికే భయం గుప్పిట్లో ఉన్న వాళ్ళందరి గుండె జళ్ళుమని, స్పృహ కోల్పోయి సొమ్మసిల్లి పడిపోయారు అందులోనే. ఆఖరికి పార్ధు తలకి ఆ స్టీరింగ్ కొంచెం బలంగా తగలడం వల్ల తను కూడా స్పృహ కోల్పోయాడు.

స్పృహ కోల్పోయిన తర్వాత, తిరిగి మళ్లీ వాళ్ళు ఎలా మెలుకువలోకి వచ్చారు?

వెళ్తున్న దారిలోనే వాళ్లకిన్ని అవరోధాలు ఎదురైతే, ఇక వారం పాటు వాళ్ళు ఆ గెస్ట్ హౌజ్ లో ఎలా ఉండగలరు?

పార్ధు వాళ్ళని లీడ్ చేయగలడా?

లేక భయంతో తాను కూడా లొంగిపోతాడా?

ఆ అఘోర...? అడ్డు తగిలిన ఆ అమ్మాయి..? ఆ అరచేయి ఎవరివి..?"

"ఇన్ని అవరోధాలు నిజంగానే ఎవరైనా సృష్టిస్తున్నారా?

లేక దెయ్యాలు, భూతాలు ఉన్నాయా?

వీటన్నింటికి సమాధానం తర్వాతి భాగంలో...

"యోధ (ఓ ఆత్మ ఘోష) - 3"

మిగిలిన కథను కొనసాగిద్దాం..

అంతవరకూ ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Horror