Lahari Mahendhar Goud

Abstract Tragedy Inspirational

4  

Lahari Mahendhar Goud

Abstract Tragedy Inspirational

తరాలు మారినా...మారని తలరాతలు

తరాలు మారినా...మారని తలరాతలు

5 mins
526


అబ్బా అమ్మ ఇప్పటికిప్పుడు నువ్వు లీవ్ పెట్టమంటే పెట్టడానికి నేనేమీ కాలేజ్ స్టూడెంట్ ని కాను ఒక బాధ్యతగల ఏసీబీ ఆఫీసర్ని


ఏసీబీ ఆఫీసర్ అయినా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నా 

నాకు మాత్రం నా కూతురివే కాదనే...

మంచి సంబంధం నా మాట విను విజేత....


చూడమ్మా నీ మాట నేనేం వినను అనటం లేదు ఇప్పటికి ఇప్పుడు నువ్వు లీవ్ పెట్టమంటే పెట్టడం కుదరదు అని చెప్తున్నాను


వచ్చే శుక్రవారం నేను ఫ్రీగా ఉన్నాను ఆ రోజు పెట్టుకుందాం పెళ్ళిచూపులు 

నీ సరదా నేను ఎందుకు కాదు అనాలి


కట్ చేస్తే


***************


అబ్బాయికి అమ్మాయి, 

అమ్మాయికి అబ్బాయి నచ్చారు కాబట్టి ఇంకా మీరు మీరు మాట్లాడుకుంటే నిశ్చితార్థం ముహూర్తం పెట్టేస్తాను ఏమంటారండి


పంతులుగారు ఒక్క నిమిషం నేను అబ్బాయి తో కాస్త మాట్లాడాలి


విజేత ఏంటే ఇది..... 

క్షమించాలి ఏదో తెలియని తనం కొద్దీ


అమ్మా నువ్వు కాస్త ఉంటావా ఇది నా లైఫ్ 

ఇప్పుడు కూడా నన్ను మాట్లాడనివ్వవా....


అయ్యో పర్లేదు ఆంటీ 

నిజం చెప్పాలంటే నేను కూడా తనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను


////////////////


విజేత గారు మీ ఫోటో చూపించేగానే 

**ద గ్రేట్ ఏసిబీ ఆఫీసర్ విజేత గారితో** 

కాసేపైన మాట్లాడొచ్చు అని పెళ్లిచూపులకి వచ్చాను 

నేను మీ ఐడియాలజీకి చాలా పెద్ద ఫ్యాన్ అండి


సో నా గురించి అన్నీ తెలిసే పెళ్లి చూపులకు వచ్చారు కాబట్టి డైరెక్టుగా పాయింట్ వచ్చేస్తున్నాను

ఇప్పటివరకు నా సాలరీ లో సగం నేను అడాప్ట్ చేసుకున్న పిల్లల చదువు కోసం యూస్ చేస్తున్నాను

పెళ్లయ్యాక కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది దానికి మీరు ఒప్పుకున్నట్లు అయితే ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు


చెప్పాను కదండీ 

మీరంటే నాకు చాలా అభిమానం అని 

మీ అంత రేంజ్ కాకపోయినా నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ నే

మీ శాలరీ మీ ఇష్టం 

క్లిష్ట పరిస్థితుల్లో తప్ప మీ శాలరీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు

ఇకనైనా ఈ పెళ్లికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే ఒకసారి ప్రేమగా మీ నోటి నుండి నా పేరుని పిలిస్తే వినాలని ఆశిస్తున్నాను


విజేత కొంచెం సంకోచిస్తూ... ఐ యాం సారీ అండి 


ఇంత చెప్పినా మీకు నా మీద నమ్మకం కలగలేదా విజేత గారు


అయ్యో అలా అని కాదండి 

నేను చెప్పిందానికి ఒప్పుకున్నప్పుడు ఆలోచిద్దాంలే అని 

కనీసం మీ పేరు కూడా అడగలేదు అమ్మకి 

అందుకని మీ పేరు తెలియక పిలువలేక పోతున్నదుందుకు ఐ యాం సారీ


అంటే మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా యాహూ....

హూ ఐ యాం సారీ మీరు ఒప్పుకున్న ఆనందంతో కొంచెం ఎక్సైట్ అయ్యాను

ఐయాం చైతన్య....



పి పి పి డుం డుం డుం మధ్య విజేత చైతన్య ల వివాహం అంగరగ వైభవంగా జరిగిపోయింది అనుకున్నారా 

సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకుని 

చిన్న రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేసుకున్నారు....


ఎనిమిదేళ్ల తర్వాత


ఇప్పటికే నువ్వు నాకన్నా హెయిర్ క్యాడర్లో ఉన్నావు ఇంకా ఇప్పుడు నువ్వు ఈ ప్రమోషన్ తీసుకోవడం అవసరమా 

నాకైతే ఇష్టం లేదు 

మొగుడి పర్మిషన్ తో సంబంధం లేదు అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు తగలడు 

అని తిట్టి బయటకు వెళ్ళిపోయాడు చైతన్య


స్టడీ రూమ్ లో పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఇదంతా విన్న సునీతకు విజేతని చూస్తే చాలా జాలేస్తోంది....


ఏంటక్కా ఇది

ప్రతి రోజు మా నాన్న నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని చదవమని నాకు చెబుతుండేవాడు...

ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న నువ్వు ఇలా ఒక మామూలు ఇల్లాలులా అంతలా భయపడటం అవసరమా


మనం ఉద్యోగపరంగా ఏ పొజిషన్లో ఉన్నా 

పెళ్లయి పిల్లలు పుట్టాక

ఆ పిల్లల కోసమైనా వాళ్లు అనే మాటలు భరిస్తూ పడి ఉంటాము అని మగవాళ్ళ ధీమా

చైతు మాత్రమే కాదు భార్య ఎదుగుదలను ఏ భర్త కూడా తట్టుకోలేడు.....


************



సాకేత్ శారద ఇద్దరూ ఒకే కాలేజీలో బీఈడి చదువుతున్నారు

చదువులు అయిపోయాక ఇద్దరికీ టీచర్గా జాబ్స్ వచ్చాయి

కాలేజీలో ఉన్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడ్డారు కానీ 

జాబ్స్ వచ్చే వరకు వెయిట్ చేశారు...


పోస్టింగ్స్ ఇవ్వగానే సాకేత్ వాళ్ళ పేరెంట్స్ తో శారద వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు

నో చెప్పడానికి పెద్దగా రీజన్స్ ఏమీ కనిపించనందువల్ల శారదా పేరెంట్స్ వెంటనే పెళ్లికి ఒప్పేసుకున్నారు


ఇష్టపడిన ఇద్దరూ ఒకటయ్యారు

కొత్త ఉద్యోగం 

పెళ్లి చేసుకుని కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టారు

ఆనందంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో సంవత్సరాలు క్షణాల్లో కరిగిపోయాయి


శారదకు ఉన్న మెరిట్ మార్కులకు తోడు మహిళా కోటాలో పోటీ ఎక్కువ లేనందున 

శారదకు టీచర్ నుండి హెడ్మాస్టర్ గా ప్రమోషన్ వచ్చింది 


***నీకేమైనా పిచ్చి పట్టిందా శారద హెడ్మాస్టర్ గా ప్రమోషన్ తీసుకుంటే బాధ్యతలు పెరుగుతాయి 

అప్పుడు ఇంట్లో పిల్లల చదువు బాధ్యత ఎవరు తీసుకోవాలి

ప్రమోషన్ తీసుకుంటే ఇది పరిస్థితి అని నీకు చెప్పటం లేదు 

నువ్వు ప్రమోషన్ తీసుకోవడానికి వీలు లేదు అని ఆర్డర్ వేస్తున్నాను***


మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందని 

ఎంతో ఆనందంగా తనకు చదువు చెప్పిన గురువు అయిన శారదకు స్వీట్స్ తీసుకొని వచ్చిన సునీత ఇదంతా విని షాక్ తినింది


మేడం మీరు మామూలు టీచర్గా ఉంటేనే మాలాంటి ఎంతోమంది విద్యార్థులను చక్కదిద్దారు

అలాంటి మీరు హెడ్మాస్టర్ అయితే సమాజానికి ఇంకా మేలు జరుగుతుంది కదా మేడం 

ప్లీజ్ మేడం సార్ ని ఎలాగైనా ఒప్పించి 

మీరు ప్రమోషన్ తీసుకోండి మేడం


నీకు తెలియదు సునీత 

మీలాంటి స్టూడెంట్స్ అందరికీ మేము పాఠాలు చెప్తే

జీవితానికి సరిపడ గుణ పాఠాలు చెప్పేది మగవాళ్ళు

ఆడవాళ్ళు ఎంతగా ఎదిగిన కూడా ఇంకా వాళ్ళ జీవితాన్ని శాసిస్తునే ఉన్నారు ఈ మగ వాళ్ళు



***********


కొన్ని సంవత్సరాల తరువాత


ఉమెన్స్ డే సందర్భంగా ఒక మహిళా సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమంలో అక్కడి వాళ్లకు అన్ని సమకూరుస్తున్నాడు సర్వెంట్ ఆనంద్


వాళ్ల నాన్నను చూసి అటుగా వెళ్తున్న అతని కూతురు దూరం నుండి నిలబడి ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంది


ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఒక పెద్దావిడ ఇలా మాట్లాడుతూ ఉంది


"" ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనేది ఒకప్పటి మాట కానీ

ఉద్యోగం చేసే ప్రతి ఆడదాని విజయం వెనుక ఆమె భర్త ఉంటాడు అనేది నేటి మాట""" 


దానికి ఉదాహరణ మన ముందు ఉన్న చైతన్య మరియు సాకేత్ 

నేను అన్న మాటలకు నిదర్శనంగా వాళ్ల భార్యల పెదవుల పైన చెరగని చిరునవ్వు మీరందరూ చూడొచ్చు


ఇప్పుడు అంత గొప్ప చైతన్య సాకేత్ లను మన మహిళా సంఘం తరఫున సన్మానించడానికి స్టేజి మీదికి రావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను


నా భార్య ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది ఎంతో ధైర్యంగా లంచగొండులను చట్టానికి పట్టించి తన కర్తవ్యం నిర్వహిస్తుంది అలాంటి గొప్ప వ్యక్తికి భర్తను అయినందుకు చాలా సంతోషంగా ఉంది....

అంటూ ముగించాడు చైతన్య


ఆడవాళ్ళు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది

అలాంటి ఎందరినో తీర్చిదిద్దుతున్న నా భార్య శారదను చూస్తుంటే నేను తన దగ్గర ఎంతో నేర్చుకోవాలి అనిపిస్తుంది ....అని నక్కతోలు కప్పుకొని మాట్లాడుతున్న సాకేత్ ని అలాగే చూస్తూ ఉండిపోయింది శారద


ఆ మహిళా సంఘం వాళ్ళు చేస్తున్న సన్మానానికి వాళ్ళిద్దరు అర్హులు కారు అని గొంతెత్తి చెప్పాలని ఉన్నా


తమ ఇష్టాలు, జీవిత అభివృద్ధి కంటే కూడా సమాజంలో గౌరవమే ముఖ్యమని బ్రతికే సగటు ఆడవాళ్ళలా అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు విజేత మరియు శారదా...


**********


ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడా అని గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంది సునీత


అక్క నువు మరీను

గేటు దాకా వచ్చిన నాన్న ఇంట్లోకి రాకుండా పోతాడా అని ఆటపట్టిస్తున్నారు సునీత వాళ్ళ అన్న , తమ్ముడు


వాళ్ల నాన్న రాగానే అతనిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి

అతని పాదాలు కడిగి

ఆ పాదాల మీద పువ్వులు చల్లి

యూనివర్సిటీలో వచ్చిన గోల్డ్ మెడల్ ను అతని పాదాల దగ్గర ఉంచి 

నోట్లో స్వీటు పెట్టి క్యాంపస్ సెలక్షన్లో తనకు వచ్చిన జాబ్ లెటర్ కూడా వాళ్ళ నాన్న చేతిలో పెట్టింది


అసలు నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతుంటే....

ఎంటమ్మా ఇది ఇన్ని సంతోషాలు ఒకే సారి చెప్తే ఈ ముసలి గుండె తట్టుకుంటుందా....


అయినా నువ్వు కష్టపడి తెచ్చుకున్న నీ గోల్డ్ మెడల్ 

దేవుడు పటాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే బాగుండేది

ఇలా సరస్వతి మాతను నా పాదాల దగ్గర పెట్టి అవమానించవచ్చ


మీరు ముసలి వాళ్ళ ఏంటి నాన్న 

మీరు నిజంగానే నా పాలిట దేవుడు

ఎవరో కని చెత్తకుప్పలో పడేస్తే ఇంటికి తీసుకురావడమే మహాభాగ్యం అనుకుంటే 

మీ పిల్లల కంటే ఎక్కువగా నన్ను చదివించారు 

నా అంత అదృష్టవంతురాలు భూమి మీద ఉంటుందా నాన్న


మనసు నిండా కుళ్ళు

ఒంట్లో నిలువెల్లా మగవాళ్ళు అనే అహంకారంతో 

ఇంట్లో ఒకలా సమాజం ముందు ఒకలా నటించే మనుషులకే ఇవాళ అంత గొప్ప సన్మానం జరిగితే

మీలాంటి వాళ్ళకి నేను చేసిన సన్మానం ఏ పాటిధి నాన్న....


అలా అయితే నువ్వు నాకు చేసిన ఈ సత్కారం

నీ చదువుకు ఆర్థిక సహకారం అందించిన విజేత మేడంకు 

అలాగే నిన్ను ఈ స్టేజ్ లో చూడాలి అని ఎంతో తపన పడి నీకు చదువు చెప్పిన శారద మేడంకు చెందాలి ఈ సత్కారం


నిజమేనా నాన్న నేను ఒప్పుకుంటాను

వాళ్ల సహాయం లేనిదే ఇప్పుడు నేను ఇలా ఉండేదాన్నే కాను


కానీ నేనంటూ ఉన్నానంటే అది ఆ రోజు మీరు కాపాడటం వల్లనే కదా....

మీ పేరులో ఉన్న (ఆనంద్) ఆనందం నలుగురికి పంచాలి అనే మంచి మనసు నాన్న మీది

మీ కూతుర్ని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వ పడుతున్నాను నాన్న


""ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ

ప్రతి ఆడదాని విజయం వెనుక మాత్రం 

ఆమె తండ్రి శ్రమ ఆనందం నేనున్నాను అనే ధైర్యం మాత్రం తప్పకుండా ఉంటుంది"".






పాఠకులకు మరియు స్నేహితులకు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 




Rate this content
Log in

Similar telugu story from Abstract