SATYA PAVAN GANDHAM

Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Others

తనతో ప్రయాణం (తన వీడ్కోలు)

తనతో ప్రయాణం (తన వీడ్కోలు)

6 mins
542


తనతో ప్రయాణం (తన పై ప్రేమ ) పార్ట్ 3 కి 

కొనసాగింపు...

తనతో ప్రయాణం (తన వీడ్కోలు) పార్ట్ 4


ఒకసారి డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రి లో చేరాను. బెంగళూర్ కదా!! తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే సహోద్యోగులు తప్ప..! అప్పటికే తన దగ్గర నుండి ఎందుకో రెండ్రోజులగా మెసేజ్ కూడా లేదు. హాస్పిటల్ లో అడ్మిన్ అయిన రోజు సాయంత్రం, తన దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చింది. 

"ఏం చేస్తున్నారని..??"  

విషయం చెప్పా...!!

ఇది వరకు నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే, కంగారు పడి జాగ్రత్తలు చెప్పేవారు..తను!! 

ఈ సారెందుకో తన దగ్గర నుండి ఆ మునుపటి స్పందన కరువైంది. తన మాటల్లో విచారం కూడా కనిపించింది.

కారణం ఏంటో తెలుసుకుందామని? "ఏమైంది రెండ్రోజులు నుండి సరిగా కాంటాక్ట్ లో లేరు, ఇప్పుడు కూడా కొంచెం డల్ గా కనిపిస్తున్నారు" అని అడిగా.


అప్పుడు తను ఏం లేదంటూనే,

"హా.. ఏముందండి!!, అక్కకి మ్యాచ్ సెట్ అయ్యింది కదా !! ఇప్పుడు రిలేటివ్స్ అంతా నా మీద పడ్డారు.. నా పెళ్లి గురించి!! కొంతమందైతే మ్యాచేస్ కూడా తీసుకొస్తున్నారు.!!" అంటూ తన మనసులోనున్న అయిష్టతను బయట పెట్టారు..


దానికి నేను! అయితే ఇంకేముంది, బయట వాళ్ళ కన్న మీ రిలేటివ్స్ లో ఎవరైనా (మేనత్త , మేనమామ గార్ల అబ్బాయిలు, ఇదివరకే చెప్పారు ఉన్నారని) మీ పేరెంట్స్ తీసుకొస్తే ప్రొసీడ్ ఐపోండి! బయట అబ్బాయిలు అంత మంచిగా లేరని" సలహా ఇచ్చాను.


సరదాకన్న మాటలే అయినా.. నా ఫీలింగ్ కూడా అదే!!

తన అమాయకత్వానికి తన గురించి అన్ని తెలిసిన వాల్లైతే, తనని బాగా చూసుకోగలరనేది నా అభిప్రాయం.


దానికి తను కోప్పడ్డారు. "ఏంటండి? అన్నీ తెలిసి మీరు కూడా ఇలా అంటున్నారు..? మీకు ఆల్రెడీ చెప్పా గా "నేను కూడా అక్కలా బాగా సెటిల్ అవ్వాలి" నాకిప్పుడు ఈ మారేజ్స్, రిలేషన్స్ ఇష్టం లేదని". తన పలుకులు వెనుకనున్న ఆ ఆవేదనపు నిట్టూర్పులు నాకర్ధమయ్యాయి..


సరదాకి అన్నానని, కెరీర్ పై ఫోకస్ పెట్టాలంటే ఇంట్లో దైర్యం చేసి, ఇప్పుడిప్పుడే ఇవన్నీ ఇష్టం లేదు, కొంచెం టైం కావాలని అడగమని కాసేపు దైర్యం చెప్పాను. 


నేను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి వచ్చి 10 రోజులు ఉన్నా ... కానీ, ఎందుకో తను ఈ మధ్య సరిగా మాట్లాడం లేదు (chatting). ఎప్పుడో!! గుర్తొచ్చినపుడు తప్ప(తన ఇంట్లో పరిస్థితులు కి నలుగుతున్నారేమోనని నేను కూడా ఊరుకున్నా)...!! 

ఎప్పుడూ నాకు నేనుగా తనకి మెసేజ్ చేసింది లేదు, తన దగ్గర నుండి మెసేజ్ వస్తె రిప్లై ఇవ్వడం తప్ప! 


ఇంటి దగ్గర నుండి రిటర్న్ అవుతున్న రోజు తన దగ్గర నుండి ఒక కామెంట్ వచ్చింది. నేను సింగిల్ అని పెట్టిన వాట్సప్ స్టేటస్ కి "అబ్బా ఛా" అని.

ఆ స్టేటస్ పెట్టినందుకు నన్ను ఆటపట్టించారు..అల్లరి చేశారు..

ఇంటిని వీడి వెళ్తున్నాన్నన్న దిగులు కాస్తా పోయి... తనతో ఆ ప్రయాణం అలా సరదాగా సాగింది. 


ఆ తర్వాత రెండ్రోజులు వరకు తన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు.. తన దూరం, నను మరింత బాధించింది. ఒక రోజు ఉండ పట్టలేక అడిగేసా అసలేమైందని!!. కొంచెం వర్క్ ప్రెషర్, ఒక 15 రోజులు వరకూ ఉంటుందన్నారు. ఆ 15 రోజులు నన్ను దూరంగా ఉండమన్నట్టనిపించాయి ఇన్ డైరెక్ట్ గా, అందుకే సరే అన్నా...!!


ఈ మధ్యలో నేను అనుకోకుండా చేసిన ఒక పొరపాటు ("people will change, when new people come into their life." అని నా క్లోజ్ ఫ్రెండ్ గురించి పెట్టిన వాట్సప్ స్టేటస్)

తనకి కోపం తెప్పించింది. వెంటనే నాకు తన నుండి రిప్లై వచ్చింది, అది తన గురించే పెట్టాననుకుని, "తన character అలాంటిది కాదని", "తను అలాంటి అమ్మాయిని కానని" "తనని అనుమానిస్తున్నానని " తనలో నేను ఎప్పుడూ ఎరుగని కోపంతో..నన్ను అపార్థం చేసుకున్నారు.


అది తన గురించి కాదని, తన గురించి నాకు తెలుసని అలాంటివి తన విషయం లో పొరపాటున కూడా చేయనని తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ, అసలు తను నా మాట వినలేదు. సరే!! అసలే, వర్క్ ప్రెషర్ తో స్ట్రగుల్ అవుతున్నాన్నన్నారు. ఇక తనని ఈ రకంగా కూడా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్ అయిపోయా..


సరిగ్గా 10 రోజులు గడిచాయి. ఇంతలో వాళ్ళ సిస్టర్ బర్త్ డే కి విష్ చేశాను. తన రెస్పాన్స్ లో ఇంకా నా పై కోపం తగ్గలేదని అనిపించింది. అప్పటికి తనన్నా 15 రోజులు కూడా అయిపోవడంతో.., 

ఇంకా వర్క్ ప్రెషర్ అలానే ఉందా ..!! అని అడిగాను..

"మీకెందుకు అండి" అని రిప్లై వచ్చింది. కొంచెం కోపం కలగలిసిన ఆశ్చర్యం.!! కానీ, నేను కొంచెం తగ్గి..

అదేంటి..!! 

"15 రోజులు తర్వాత మీరే కదా మాట్లాడతా అన్నారు" అన్నాను.

"నాకు మీతో మాట్లాడటం ఇష్టం లేదండీ సరే నా..!!" 

(అలలాంటి తన అలకలు కాస్తా, కోపపు కెరటంలా ఎగిసిపడ్డాయి.)


నాకు ఏం మాట్లాడాలో? ఎలా రియాక్ట్ అవ్వాలో?? తెలియలేదు. నేనూ జాబ్ చేస్తున్నా.. నా ఫీల్డ్ లో కూడా వర్క్ ప్రెషర్ సహజమే, కానీ నేను ఇంతలా ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. తను మెసేజ్ పెట్టిన వెంటనే ఎక్కడ తను ఫీల్ అవుతారోనని వెంటనే బదులిచ్చేవాడిని.


ఇలా ఎందుకు మారిపోయారు తను, ఈ చిన్న చిన్న గొడవలు, అలకలు మా మధ్య ఎప్పుడూ ఉండేవి, కానీ... ఈసారెందుకు తను ఇలా ఉంటున్నారు??

పెళ్లి ఏమైనా కుదిరిందేమో?? అందుకని నన్ను దూరం పెడుతున్నారేమో??

లేదా ఇంట్లో నా గురించి తెలిసి తనను ఏమైనా అన్నారేమో??

(వాల్లక్క, మదర్ కి ఇద్దరికీ తెలుసూ నాతో టెక్స్ట్ చేస్తున్నట్టు.. వాళ్ళ ముందే నాతో టెక్స్ట్ చేస్తానని చాలా సార్లు చెప్పారు తను)

అలా...

నాలో చాలా సందేహాలు మొదలయ్యాయి.


మా ఇద్దరికీ ఒక ముచ్యువల్ ఫ్రండ్ ఉన్నారు. (నాకు సిస్టర్ లాంటింది, తనకి బాగా క్లోజ్) తనకి చెప్పి చూసా(రీసెంట్ గానే తినకి చెప్పా తనకి చేసిన ప్రపోజల్ గురించి).. కానీ, తనని ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేనప్పటికీ, ఏం జరిగిందో తెలుసుకోవాలని తనని అడగమన్నా .. "కానీ, తనకి కూడా ఏం చెప్పడం లేదు, నార్మల్ గానే తనతో మాట్లాడుతున్నారని" చెప్పగానే నాలో ఎందుకో తెలియని భయం, అలజడి రేగాయి.


ఒక రెండ్రోజులు కామ్ గానే ఉన్నా... ఇక నా వల్ల కాలేదు, ఆ రోజు సండే కదా ఫ్రీ గా ఉంటారేమో అని అసలు రీజన్ తెలుసుకుందామని మెసేజ్ చేశా...


"ఎందుకు నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదన్న కూడా పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తారు??". 

మీకు నాతో మాట్లాడం తప్ప వేరే పనిలేదా??" ఇంకా ఎన్నో...మాటలు.. తనకి "నాపై ఉన్నది కోపం కాదు ద్వేషమని" తన మాటల ద్వారా అర్ధం చేసుకోవడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. కారణం లేకుండా నన్ను అనరాని మాటలనడం, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడటం, అది అసలు తను కాదేమొననిపించారు, ఆ మాటలు చాలా బాధించాయి. తనని ఎలా నియంత్రించాలో అర్ధం కాలేదు.

అప్పటివరకూ పట్టిన ఓపిక ఒక్కసారిగా నశించిపోయింది. నాలో కోపం కట్టలు తెంచుకుంది. ఇక తన మాటలకు నాలో ఉన్న మూర్కుడు బయటకు వచ్చాడు...


"నువ్వు అందరి అమ్మాయిలా కాదు అనుకున్నా కానీ, అందరిలాంటి దానివేనని,

నీకు అందముందనే పొగరని,

నాతో నువ్వు టైం పాస్ చేశావని,

నీకంటే గొప్పగా లైఫ్ లో సెటిల్ అవుతానని, ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యనని" ఆ సమయంలో పట్టరాని ఆవేశంతో తనని చాలా చాలా మాటలు అనేశాను.


నా మాటలకు చాలా హర్ట్ అయ్యి ఎప్పుడూ లేనంత ఎమోషనల్ గా మాట్లాడారు(chatting). ఇక మళ్ళీ జీవితంలో నాతో మాట్లాడనన్నన్నారు తను.


తిరిగి వాటిని చదివితే నా మీదే నాకే అసహ్యం వేసింది. ఇక తను అసహ్యించుకోవడంలో తప్పేం లేదనుకున్నా...!!

నా తప్పు తెలుసుకుని తనని convience చేయడానికి ట్రై చేసాను... కానీ, ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


తన ఇన్స్పిరేషన్ తో అప్పుడప్పుడే నేర్చుకుంటున్న డ్రాయింగ్స్ తో, నా దగ్గర తనకిష్టమైన రచనలతో నాలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి, తనకి దగ్గరవడానికి చాలానే ప్రయత్నించాను... కానీ అవేమీ తనని సంతృప్తి చెందించలేదు.


ఒక 3 వారాలు , సైలెంట్ గా ఉండి, తర్వాత మళ్లీ తనని కదిపాను!! ఇంకా నా పై తనకి అదే ద్వేషం. 


తనకి ఏమైందో తెలియడం లేదు, 

ఇక లాభం లేదనుకుని వాళ్ల సిస్టర్ తో కాంటాక్ట్ అయ్యి, తనకేమైందని ఈ మధ్య ఎందుకో అవాయిడ్ చేస్తున్నారని అడిగా... అప్పుడు వాళ్ళ సిస్టర్... "తనకంతా బాగానే ఉందని, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారని నన్ను ప్రశ్నించారు సందేహపడుతూ..!!(ఇంత చనువుగా వాళ్ళ సిస్టర్ గురించి అడిగితే తనకు అర్ధం అయ్యినట్టు ఉంది), 


ఇక దాయడం ఇష్టం లేక, జరిగిందంతా చెప్పేశా.. (కొన్ని సవరించి, ఇందులో తన తప్పేం లేదన్నట్టు, తప్పంతా నా మీదే వేసుకున్నా.. మళ్ళీ తన మీద ఎక్కడ చెడు అభిప్రాయం ఏర్పడుతోందొ వాళ్ళక్కకని).


జరిగిందంతా వాళ్ళ చెల్లి తనకు చెప్పలేదని, చెప్తే ఇంత దూరం రానిచ్చేదానిని కాదని, ఇంట్లో ఇవన్నీ నచ్చవని, మళ్ళీ తెలిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని, నాకు నచ్చ చెప్పారు.


తనకి కూడా మరేజ్ ఫిక్స్ అయ్యిందని డేట్ చెప్పారు... తన సిస్టర్ కి కూడా మ్యాచెస్ చూస్తున్నట్టు చెప్పారు... 

దానికి నేను తను కెరీర్ బాగా బిల్డ్ చేసుకోవాలని ఆశ పడుతున్నారని, నేను క్రియేట్ చేసిన ఈ డిస్టర్బన్స్ వల్ల తనకి ఇష్టం లేనివి చేస్తే ఆ తప్పు నాదై అది నన్ను జీవితాంతం వేధిస్తోందని రిక్వెస్ట్ చేశాను. తను కూడా వాళ్ళ సిస్టర్ కెరీర్ యే ముఖ్యమని నా మాటలకు అనుకూలంగానే స్పందించారు .


ఒకప్పుడు తన సిస్టర్ మారేజ్ కి స్పెషల్ గా ఇన్వైట్ చేస్తానని చెప్పిన తను, కనీసం మారేజీ ఫిక్స్ అయినా విషయం కూడా నా దగ్గర దాయడం కొంచెం నన్ను నిస్పృహకు గురి చేసింది.


వాళ్ళ సిస్టర్ మారేజీ అయిన కొన్ని రోజులకు తనకి మెసేజ్ చేశాను. అప్పటికే తను నా నుండి దూరం అయ్యి 3 నెలలు దాటింది.. ఇంకా అదే ద్వేషం తన మాటల్లో.. పైగా నేను తనని అనుమానిస్తున్నట్టు ఎవరితో మాట్లాడం లేదని స్క్రీన్ షాట్స్ తీసి ప్రూఫ్స్ చూపించ దలచింది. అదంతా! నా మీద నాకే అసహ్యం కలిగించేలా చేశాయి. బెంగళూర్ లో చూట్టూన్న సహోద్యోగులు బాగా కలుపుగోలుగా ఉంటున్నా..? ఎందుకో ఒంటరి తనం ఆవహించింది నాలో?, ఇక అక్కడ ఆ ఒంటరి తనం భరించలేక జాబ్ కి రిజైన్ చేసి ఇంటికి వచ్చేసాను.


మళ్ళీ కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాను.

తను బర్త్డే 6th Jan అర్ధరాత్రి 12 గంటలకు మెసేజ్ చేసినా తన నుండి ఏదో మొక్కుబడి రిప్లై.(కాల్స్ ఎప్పుడూ మాట్లాడలేదు)


కనుమకి ముగింపు:

ఎందుకో తన దగ్గర ప్రతిసారీ ఇంతలా దిగజారిపోతోన్నా.. నేను చేస్తుంది తప్పేం అనిపించలేదు. తను మన అమ్మాయే కదా అనే భావన నాలో...


గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ పడితే తనకి షేర్ చేశాను కానీ, అప్పడు కూడా తన నుండి ఎలాంటి రిప్లై రాలేదు.

ఇక లాభం లేదనుకుని,

తనకి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇష్టం ఉండదని తెలిసి కూడా... తను నా మీద పెంచుకుంటున్న అసహ్యానికి రీసన్ తెలుసుకోవాలనుకునే ఉద్దేశ్యంతో,

ఫేక్ చాటింగ్ చేశా ...తన విషయంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఎదైనా ఉంది అంటే అది ఇదే.

తనకి నిజం తెలిసి వాళ్ళ సిస్టర్ కి బాధ పడుతూ జరిగింది చెప్పడం, తను నాకు కాల్ చేయడం, ఇద్దరికీ మాట మాట పెరిగి ఒక చిన్న పాటి మాటల యుద్ధం జరగడం! అంతా నిమిషాల వ్యవదిలో జరిగిపోయింది... 


తర్వాత వాళ్ళ సిస్టరే మళ్ళీ కాల్ చేసి అలా చేయడానికి కారణమడిగారు, "తనని ప్రేమించాను కాబట్టి, తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదని, ఒకప్పుడు నన్ను ఎప్పటికీ ద్వేశించనన్న తను ఇప్పుడెందుకు అసహ్యాహించుకుంటున్నారో తెలుసుకోవాలనే అలా చెయ్యాల్సి వచ్చిందని చెప్పాను.. తను కెరీర్ బాగా ప్లాన్ చేసుకున్నారు, తన ఇన్నోసెన్స్ వల్ల అది గాడిన పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించాను. "


తన కెరీర్ గురించి నేను కేర్ తీసుకుంటానని, మీరు చేస్తుందంతా తనకి నచ్చడం లేదు, కాబట్టి కొన్నాళ్ళు తనని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు. ఇలా ఇండైరక్ట్ గా కన్నా, మిమ్మల్ని బయట కలిసి మాట్లాడతానని, నాకొక బరోసా ఇచ్చారు. అప్పటివరకూ సైలెంట్ గా ఉండమని రిక్వెస్ట్ చేశారు.

తన మాట ప్రకారం ఆరోజుతో డిసైడ్ అయ్యాను ఇంకెప్పుడు తనని డిస్టర్బ్ చేయకూడదు అని.


"చేయిదాటిన ఓ చెలియా..

చెదిరిపోనిది నీ చెలిమి.


నీ పై ఇష్టం నిన్ను ఇబ్బంది పెట్టిన వేళ!

నా వేదన నీకు వేధింపు గా మారిన వేళ!


ఆశగా నీకు దగ్గర అవ్వాలన్న ఆలోచనని అడియాశగా మార్చి

నీ ఆశయం కోసం దూరమవుతూ అనుభవిస్తున్న ఈ వేధనని


నీ దరికి చేర్చాలని...

నా ఊహల్లో జీవించియున్న ఓ కలల కావ్యమా!


నిలుపుకోనా మది నిండా నీ ఊసుల్ని

హత్తుకోనా యద నిండా నీ రూపాన్ని"


అందుకే. ...

తనతో ప్రయాణంలో

తన వీడ్కోలు ... "ఓ అబద్ధం".

                                                 - సత్య పవన్ ✍️



Rate this content
Log in

Similar telugu story from Classics