SATYA PAVAN GANDHAM

Tragedy Crime Inspirational

4.5  

SATYA PAVAN GANDHAM

Tragedy Crime Inspirational

స్వప్నిక I.A.S (ఓ వేశ్య కథ)-3

స్వప్నిక I.A.S (ఓ వేశ్య కథ)-3

7 mins
491


స్వప్నిక I.A.S (ఓ వేశ్య కథ)-2 కి

కొనసాగింపు,

స్వప్నిక I.A.S (ఓ వేశ్య కథ)-3

ఇప్పటివరకూ తన జీవితంలో జరిగిన చీకటి కోణాలన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే, ఆ రెండో వైపు జరిగిన దుర్ఘటనలను కూడా వివరిస్తుంది స్వప్నిక.

"వాళ్ళ అరాచకాలు, అంతటితో ఆగలేదు సార్!

ఆ డాక్టర్ నా భర్తను చంపించి, ఆరోగ్యం పాడయ్యి చనిపోయినట్టు. ఓ కట్టు కథ సృష్టించారు.

ఆ పోలీస్ నా బిడ్డను ఒక అనాధ ఆశ్రమంలో పడేసి నాకున్న ఆ ఒక్క తోడు కూడా దూరం చేశాడు.

ఇక, ఆ లాయరయితే ఏకంగా నన్ను ఒక వేశ్యగృహ నిర్వాహకురాలికి అమ్మేశాడు. పోలీసులు పట్టుకుని విడిచి పెట్టిన ప్రతిసారీ, ఎవరెవరికో అప్పగించేవాడు.

అలా... నా ఒళ్లుతో సొమ్ము చేసుకునే వాళ్ళు.

అక్కడికి వచ్చే వాళ్ళందరూ బడాబాబులే కదా!

భౌతికంగా, మానసికంగా ఎంత చితికిపోయినా, మరెంత నలిగిపోయినా .. ఏరోజుకారోజు కొత్త పెళ్లి కూతురు లా వాళ్లకు కావలసినట్టు ముస్తాబయి, వాళ్ళ కోరికలు తీర్చడమే నా పని.

ఒక్కొక్కడు ఒక్కో రకం.

ఒకడు గిచ్చుతాడు, ఇంకొకడు గిల్లుతాడు, మరొకడు కొరుకుతాడు. మృగంలా మీద పడి రక్కుతారు. పీరియడ్స్ టైంలో తీవ్ర రక్త స్రావం జరుగుతున్నా కూడా.. వాళ్లకేం పట్టదు. వాళ్ళకి కావాల్సిన సుఖం వాళ్ళు పొందుతారు.

నొప్పిని బరించలేక "అమ్మా..!' అని గట్టిగా అరిస్తే,

నోరు మూయవే "నీ యమ్మా..!" అంటూ నా నోరు నొక్కి బలవంతంగా నాపై అత్యాచారం చేసేవారు. వాళ్ళ మాట వినకపోతే చావ కొట్టేవాళ్ళు. కర్కశంగా, పాశవికంగా ప్రవర్తిస్తూ తమ తమ పైశాచకత్వాన్ని నాపై చూపించేవాళ్లు ఆ శాడిస్టులు.

చావకుండా ఉండడానికి నా ముందో గుప్పెడు మెతుకులు పారేసేవారు. ఒకవేళ వాళ్ళ హింసలకు తాళలేక నేను చచ్చిపోతే వాళ్లకు డబ్బులేలా వస్తాయి మరి?

నేను కన్న కలలేంటి, ఇప్పుడు అనుభవిస్తున్న జీవితమేంటని ఆ వేశ్య గృహంలో పడి ఉన్న ఏ దిక్కూ లేని, నన్ను నేను చూసుకుంటుంటే అనిపించేది... ఆ బాధలు బరించలేక ఆత్మహత్య చేసుకుందామని చాలా సార్లు అనుకున్నా....

నా బిడ్డను దృష్టిలో ఉంచుకుని, ఆ సూసైడ్ ఆలోచనల నుండి బయటపడేదాన్ని.

ఇవన్నీ కాదు కానీ, సార్!

ఒక్కోసారి నా బిడ్డను చూడాలని ఉందంటే, అక్కడికి వాళ్ళు తీసుకెళ్లినపుడు, అప్పటికే గాయాలైన నా రొమ్ములతో నా బిడ్డకి చనుబాలు పడుతుంటే, అది ఎంత నొప్పిని కలుగ చేస్తుందో తెలుసా సార్!

కానీ, నా బిడ్డకు కనీసం పాలిచ్చే అదృష్టమయినా దొరికిందనే సంతోషం, ఆ నొప్పిని భరించెలా చేసి, ఆ కాసేపు కమ్మటి అమ్మతనం ఆశ్వాదించెలా చేసేవి.

చివరికి నాకింత అన్యాయం జరిగి, సర్వశం పోగొట్టుకున్న నాపై ఈ సమాజం వేసిన ముద్ర వేశ్య.

అలా ఒక వేశ్యలా మొదటి సారి మీ పోలీసులకి దొరికాను. నిజం చెప్దామని ప్రయత్నించాను. కానీ, అప్పటికే మీ ఈ మగజాతి చేతిలో, ఈ చట్టం చేతిలో మోసపోయి కీలుబొమ్మైన ఆడదాన్ని కదా సార్...!

అందులోకి ఆ రోజు డ్యూటీ లో ఉన్న పోలీసులు(అడా, మగ) నన్ను దుర్భషలాడడం చూసి, నాకు ఈ వ్యవస్థ మీద, సమాజం మీద పూర్తిగా నమ్మకం పోయింది.

మొదటి సారి దొరికినప్పుడే కేసు బుక్ చేసి నన్ను అక్కడే స్టేషన్లో ఉంచేస్తే బాగుండనిపించింది. కనీసం, కొంచెం ప్రశాంతతైనా దొరికేదేమో.

బయటకి వచ్చిన ప్రతిసారీ, ఆ క్రూర మృగాలు నన్ను వెంటాడి వేధించేవి. వాళ్ళ మాట వినకపోతే నా బిడ్డను చంపేస్తామని బెదిరించేవారు. నన్ను బలవంతంగా ఆ వ్యభిచార కుంపటిలోకి లాగి నాతో వ్యభిచారం చేయించేవారు.

కానీ, మీ స్టేషన్ లో పోలీసులకి ఇవన్నీ తెలిసో, తెలియకో నన్ను నానా మాటలన్నారు. అప్పటికే భౌతికంగా పాడైన నా శరీరంతో పాటు, ఆ మాటలకు నా మనసూ ముక్కలైంది.

పది మంది పక్కలో పడుకున్న ఓ ఆడదాన్ని వేశ్యంటున్నారే, మరి పది మంది పక్కలో పడుకున్న అదే వేశ్య పక్కన పడుకున్న వాడికి ఏం పేరు పెట్టాలి సార్.. ఈ సమాజం.? కానీ, వాడు మగాడంటూ ఊరేగిస్తుంది.

ఈరోజు ఉదయం మిమ్మల్ని చూడగానే నేను గుర్తుపట్టాను.

కానీ, మీతో అక్కడే ఇవన్నీ చెప్దామంటే, అసలు నన్ను మీరు గుర్తు పడతారో లేదో... ?

అక్కడున్న మీ పోలీస్ వాళ్ళలాగా మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటారెమోనన్న సందేహాలతో మీకు నా మొహం చూపించలేకపోయాను.

చివరికి మీతో రమ్మన్నప్పుడు కూడా...

మీరు నాకు రక్షణ కల్పిస్తారని భావించలేదు.

మీరు కూడా మీ అవసరాలు తీర్చుకోడానికి రమ్మన్నరేమోనని కంగారు పడ్డాను. వాళ్ళలా చేస్తారేమోనని భయపడ్డాను.

నాకు I A S అవ్వాలనే కోరిక మీ నుంచి స్ఫూర్తి పొందడం వల్లే, నా మనసులో మీకో తండ్రిలాంటి స్థానం ఉంది...

ఒకవేళ మీరు కూడా అలా చేస్తే, ఇక నేనెవరికి చెప్పుకోవాలి. దానివల్లే ఆ భయం, ఆ కంగారు.

ఇక్కడికి వచ్చాక కానీ, మీ పై నమ్మకం కలగలేదు నాకు. క్షమించాలి నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే."

అంటూ అప్పటివరకు పడిన తన వేదనని ఆవేదనతో తెలిపింది స్వప్నిక"

స్వప్నిక కు ఎదురైనా ఆ సంఘటనలన్నీ వింటున్న ఆ డీజీపీ ఆఫీసర్ భార్య ..."ఆ నీచులను ఊరికే వదిలిపెట్టకూడదు. వాళ్ళకి కచ్చితంగా పెద్ద శిక్షే పడాలి." అంటూ కోపంతో రగిలిపోతుంటుంది.

స్వప్నిక మధ్యలో కలగచేసుకుని,

శిక్షా..!

ఎంతమందికి ?

నా ఒక్కదాని వల్లే ఇంత మంది బయటకు వచ్చారంటే, నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఇలాంటి జీవితాలను భరిస్తూ బ్రతుకుతున్నారో.. వాళ్ళ జీవితాలు చిధ్రమవడానికి వాళ్ళ వెనుక ఇంకెంతమంది ఉన్నారో కదా ..!

అయినా మీరు శిక్షించాలాంటే,

తాగుడుకు బానిసై కుటుంబ సంరక్షణ వదిలి

పై చదువులకు అడ్డు పడ్డ నా తండ్రి లాంటి వారిని శిక్షించాలి.

నాకు ఆ చిన్న వయసులోనే పెళ్లి చేసిన నా కలలను అడ్డుకున్న మా అమ్మ లాంటి వాళ్ళను శిక్షించాలి.

ఉన్నంతలో బ్రతుకున్న మా జీవితాల్లోకి చీకటి నింపి నిర్లక్ష్యంతో ఆక్సిడెంట్ చేసిన ఆ డ్రైవర్ ని శిక్షించాలి.

నా దుస్థితికి కారణమైన ఆ మేనేజర్, డాక్టర్, పోలీస్, లాయర్, బ్రోకర్, విటులు, మొత్తానికి వేశ్యగా ముద్ర వేసిన ఈ సమాజం.... అందర్నీ .... అందరినీ (పట్టరాని కోపంతో తన ఆవేశం కట్టెలు తెంచుకుంది...)

అంతమందిని మీరు శిక్షించగలరా?

అంటూ తన ఆవేదనని వెళ్లబుచ్చింది స్వప్నిక.

తన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోయింది.

అయినా.. శిక్ష పడినంత మాత్రానా సమస్య తొలగిపోతుందా...?

ఈరోజు వీళ్లకి శిక్ష పడితే, రేపు ఇంకొకడు.. ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసేవారీ పై దశాబ్దాల తరబడి శిక్షలూ పడుతూనే ఉన్నాయి. వాటితో పాటే ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. అందుకే, ముందు ఈ సమాజంలో ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మారాలి...

అందుకే, నాకు కావాల్సింది, వీళ్లకు మాత్రమే శిక్ష పడడం కాదు. వీళ్లతో పాటే సమాజం లో ఇలాంటి ఆలోచనలు కల్గిన ప్రతి ఒక్కరి ఆలోచనకు శిక్ష పడాలి. అప్పుడే ఈ సమాజంలో మార్పు కనిపిస్తుంది. నాకే కాదు నాలాంటి వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టవుతుంది."

అంటూ తనకున్న ఆ పరిపక్వత ఆలోచనలను వెల్లడిస్తుంది స్వప్నిక.

"నీ ఆలోచనే కరెక్టమ్మ. నువు పడిన వేదనకు, రాల్చిన ప్రతి కన్నీటిబొట్టుకి నువ్వే ప్రతీకారం తీర్చుకోవాలి.

అలాంటి వాళ్ళకి నీ చేతుల మీదే శిక్ష పడాలి.

అందుకే, నువ్వు చేరాలనుకున్న గమ్యం వైపు మళ్ళీ మొదటి నుండి అడుగులు వేయడం ప్రారంభించు.

ఒక తండ్రిలా.. ఓ తల్లిలా..

నీకు తోడుగా, రక్షణగా మేముంటాము... "

అంటూ ఆ డీజీపీ ఆఫీసర్ మరియు వాళ్ళ భార్య తనలో దైర్యం నింపుతారు.

ఆ అనాధశ్రమానికి వెళ్లి తన బిడ్డను కూడా తీసుకొచ్చేస్తారు.

ఎవరూ తీసుకెళ్లారు అని అడిగితే ఫలానా డీజీపీ దత్తత తీసుకున్నారని చెప్పమంటారు అక్కడున్న కేర్ టేకర్ కి. మళ్ళీ ఆ మృగాలు తనకి హాని తలపెట్టే అవకాశం లేకపోలేదని గ్రహించి.

ఆరోజు మొదలు, ఆ నీచుల లాంటి వాళ్ళందరికీ శిక్ష పడాలనే ఉద్దేశ్యంతో క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో మొదలైన స్వప్నిక కొత్త జీవితం, ఆ డీజీపీ ఆఫీసర్ సహాయంతో శిక్షణ తీసుకుంటూ వికసిస్తుంది.

సరిగ్గా ఒక సంత్సరం తిరిగే సరికి తను అనుకున్న లక్ష్యాన్ని, తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటుంది స్వప్నిక.

ఇప్పుడు స్వప్నిక ఓ వేశ్య కాదు. స్వప్నిక IAS.

ఒకప్పుడు ఏ చట్టాలకైతే తను బలైయ్యిందో...?

ఇప్పుడు అదే చట్టాలను తను శాసించే స్థాయిలో ఉంది.

తనకి అన్యాయం చేసిన వాళ్ళందరి ఆటే కాదు, ఏ ఆడపిల్లకి అనాయ్యం జరిగినా వాళ్ళ వెనుకనున్న వాళ్ళందరి ఆట కట్టిస్తుంది స్వప్నిక. కొత్త కొత్త చట్టాలను పిల్లలు చదివే పాఠ్యాంశాలలో చేర్పించి, వాళ్ళకి ఆ బాల్య దశలోనే మానవతా విలువలంటే ఏంటో తెలిసేలా చేసి ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది.

స్వప్నిక కు అన్యాయం చేసిన ఆ మానవ మృగాళ్లు, అలాంటి వేరొక కేసులోనే దొరకడంతో, వాళ్ళ వల్ల ఈ సమాజానికి నిరుపయోగమని వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తారు ఆ డీజీపీ. ఒకప్పుడు స్వప్నికకు ఏ పోలీసు, వైద్య , న్యాయ వ్యవస్థలైతే అన్యాయం చేశాయో ఇప్పుడు అవే వ్యవస్థలు స్వప్నిక కు బాసటగా నిలిచాయి.

మరొకపక్క తన తల్లిదండ్రులు, అత్తమామలకు ప్రతీకగా ఒక వృద్ధాశ్రమం నడిపిస్తుంది.

ఎందరో వితంతువులకు బాసటగా నిలుస్తుంది. అనాధశ్రామలను నెలకొల్పి ఎందరో పిల్లలను ఓ అమ్మలా చేరదీస్తుంది.

చదువుకోవడానికి స్థోమత లేని వారికి తాను అండగా ఉంటుంది.

ఇలా ఒకటా... రెండా... తన జీవితం నాశనం అవ్వడానికి ఏర్పడిన ప్రతి అడ్డంకిని తను అధిగమించడమే కాకుండా అవి వేరేవారికి అడ్డు తగలకుండా తను ఒక అడ్డుగోడగా నిలుస్తుంది.

దుఖంతో మొదలైన స్వప్నిక జీవితం చివరికి సుఖాంతమవుతుంది.

ఇంతటితో ఈ "స్వప్నిక I A S (ఓ వేశ్య కథ)" అనే కథ సమాప్తం.

రచయితగా నా విశ్లేషణ:

ఈ కథ పూర్తిగా కల్పితమే అయినా, ఒక చిన్న వాస్తవిక సంఘటన ద్వారా నేను ఈ కథను సృష్టించడం జరిగింది.

అదేంటంటే, ఒకసారి ఒక చోట బస్ కోసం వెయిట్ చేస్తూ నిల్చున్న నా వద్దకు ఒక నడి వయసు గల అమ్మాయి (ముసుగుతో మొహం కప్పివుంది) వచ్చి డబ్బులిస్తే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటూ నా వెంబడ పడింది. దానికి నేను తనని తిట్టిన తిట్లు తిట్టకుండా తిడితే (పైన కథలో పోలీసులు దూషించినట్టు దూషిస్తే),

పాపం బాధ పడిందనుకుంటా...

తను ఆ పని చేయడానికి వెనకున్న గల కారణాలను, తన ఆవేదనని వివరించి, అక్కడ నుండి వెళ్ళిపోయింది. నిజమెంటో తెలుసుకోకుండా తనని అలా దూషించినందుకు నాలో నేనే మధన పడ్డాను.

ఆ మనోవేదనపు ఆలోచనలు నుండి పుట్టిందే నా ఈ కథ. తను చెప్పిన వాటిలో కేవలం కొంత బాగం(చివరి భాగం ముందు నుండి) మాత్రమే నిజమున్నా...

సమాజంలో వేశ్యలకసలు స్థానమే ఎలానో ఉండదు కాబట్టి, ఆమె గోడు విన్న నేను ఆరోజు నేను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా నా కథలో వాళ్లకు ఓ సముచిత స్థానం కల్పించడం జరిగింది. IAS, IPS(డీజీపీ), పోలీసులు, లాయర్లు, డాక్టర్లు లు అన్నీ నేను సృష్టించిన పాత్రలే.

తనని పరాయి మగాడు ముట్టుకోవాడానికి ప్రయత్నిస్తేనే ఒప్పుకోని ఆడపిల్ల, తన ఒళ్ళు అమ్ముకునే స్థితికి దిగజారిందంటే, తన కడుపెంత కాలుంటే ఆ పని చేసుంటుంది.

అయినా... వ్యాపార వేత్తలలా సొమ్ము చేసుకుని వాళ్లేమి ఆస్తులు కూడబెట్టుకోవట్లేదు కదా!,

వాళ్ళు తమ కడుపు నింపుకోవడానికో, లేక తమవారి కడుపు నింపుకోడానికో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేస్తున్నారు. అలాంటి వారిపై ఇంత వివక్షేందుకు?

మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఆ విటులు, ఇంట్లో భార్య ఇచ్చే పడక సుఖం సరిపడక ఒళ్ళు కొవ్వెక్కి, లేక డబ్బుతో ఏదైనా చేయొచ్చని మదమెక్కి వెళ్తున్నారా?

స్వప్నిక చెప్పినట్టు పది మంది పక్కలో పడుకున్నందుకు ఒక ఆడదాన్ని వేశ్యంటున్నారే, మరి పది మంది పక్కలో పడుకున్న దాని పక్కన పడుకున్న వాడికి ఏం పేరు పెట్టాలి..? ఈ సమాజం.

అసలు స్వప్నిక జీవితం అలా అవ్వడానికి కారకులెవరు?

లాంటి ప్రశ్నలకు నా పాఠకులుగా మీరే సమాధానం ఇవ్వాలి.

అందరూ ఇలాంటి వారే ఉంటారని కాదు, నిజానిజాలు తెలుసుకోకుండా ఒకర్ని తప్పుపట్టడం తప్పని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఒక జెండర్ నో, కొన్ని వృత్తులనో కించపరచడం, కొందరిని తక్కువ చేస్తూ, తప్పు పట్టడం కూడా నా ఉద్దేశం కాదు.

సమాజపు తోటలో కలిసిపోయిన కొన్ని కలుపు మొక్కల గురించి తెలియ చెప్పాలనే ఈ కథ యొక్క మరొక ముఖ్య ఉద్దేశం.

అందరి వేశ్య జీవితాలు స్వప్నిక లాంటివి అని కాదు కానీ, కొందరైనా ఉంటారు కదా... వాళ్ళకోసం ఈ కథ.

అందరు మగవాళ్ళు చెడ్డవారని కూడా కాదు. నిజానికి అంతటి దీనస్థితిలోనున్న స్వప్నికని చేరదీసి, అంతటి దాన్ని చేసిన ఆ డీజీపీ ఆఫీసర్ కూడా మగాడేనని మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మన ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవరాలోధాలు లక్ష్యాన్ని చేరే దారిలో నిత్యం మనం ఎదుర్కొంటూనే ఉంటాం. వాటన్నంటిని దాటుకుంటూ స్వప్నిక లాంటి అమ్మాయిని స్పూర్తిగా తీసుకుని మనమందరం ముందుకు సాగాలని చెప్పే నా ఈ చిన్న ప్రయత్నమే...

"స్వప్నిక I A S (ఓ వేశ్య కథ)"

అలాంటి స్వప్నికలందరికీ నా ఈ కథ అంకితం.

అమ్మాయిల పట్ల కర్కశంగా వ్యవహరించే మూర్ఖులందరికీ ఇదొక గుణపాఠం.

ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా... ఓ సామాజిక స్పృహతో నెలకొల్పిన ఈ కథను ఆదరిస్తారని ఆశిస్తూ...

ఏమైనా తప్పులుంటే మన్నించగలరు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️


 



Rate this content
Log in

Similar telugu story from Tragedy