Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

స్వాతంత్య్రం

స్వాతంత్య్రం

1 min
324


మేడమ్! ఆ టెక్స్ట్ బుక్లో భారతదేశ స్వాతంత్ర్య పోరాటం గురించి మరిన్ని తప్పులు గుర్తించాను. వాటిని కూడా విద్యా శాఖ కార్యాలయానికి పంపండి అని ఓ లెటర్ ఇచ్చాడు భూషణ్.


శిరీష అది తీసుకుని ఫైల్ చేసింది. 


మాస్టారూ! ఎందుకింత శ్రమపడుతున్నారు? ఇప్పటివరకూ ఇరవై ఆరు సార్లు లెటర్ పంపారు. వాళ్ళ నుంచి జవాబు లేదు. ఈ ఏడు టెక్స్ట్ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చే టైం కూడా అయింది. మీరు మాత్రం ఇంకా దేశ స్వాతంత్ర్య పోరాటం గురించి తప్పులు ఉన్నాయని, ఇంకా కొన్ని మార్పులు చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు అంది శిరీష.


లేదమ్మా. విసుగు రావట్లేదు. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరూ చెప్పకపోతే చరిత్రకు చెదలు పడుతుంది. వాస్తవాల చరిత్ర తెలుసుకోకపోతే జాతి భవిష్యత్తుకు ఎప్పుడైనా ప్రమాదమే అంటూ కళ్ళజోడు సరిచేసుకుని బయటికి వెళ్ళిపోయారు భూషణ్ మాస్టారు.


Rate this content
Log in

Similar telugu story from Abstract