Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సూరీడు..కొత్తగా..

సూరీడు..కొత్తగా..

1 min
323


ఇంకెప్పుడు తెలవారుతుంది..కుసుమ ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది. పొద్దు పొడిచే వేళలో చాలా పనుంది. పశువులకు మేత పెట్టి పాలు పితకాలి.


పాలకేంద్రం దగ్గర ఇవాళ డబ్బులు ఇస్తారు. అవి తీసుకుని సరుకులు తెచ్చుకోవాలి. స్కూలుకు పిల్లాణ్ణి తీసుకుని వెళ్లే ఆటో అతను డబ్బులు ఇవ్వకపోయినా నెల నుంచీ ఓపిగ్గా ఉన్నాడు. పాపం. అతడికి కష్టంగా ఉన్నా కనికరించే మనసూ ఉంది.


నిద్రపోతున్న కొడుకుకు మరోసారి ప్రేమతో దిష్టి తీసింది.సూర్యుడి వెలుగు రేఖలు తాకగానే కుసుమ ఆనందంగా పాల కేంద్రానికి బయలుదేరింది. ఖాళీగా ఉన్న ఆమె నుదురు మీద పడ్డ సూర్యకిరణాలు ఆత్మ విశ్వాసపు అంకురాలుగా అనిపించాయి.


వనజకు తెల్లవారుతుందంటే చాలు. బతుకు మీద విరక్తి వస్తుంది. సూర్యుడి కిరణాలు తాకగానే ఇక ఈ ఇంట్లో ఉండకూడదు అని ఆరోజు నిర్ణయం తీసుకుంది.


తను నెల తప్పి రెండు నెలలైనా భర్త ప్రవర్తన మారలేదు. రాత్రంతా ఆ తుప్పార్స్ గుంపును వేసుకుని మందు తాగి దొర్లడం. ముందు సరే. ఇప్పుడు భార్య గర్భవతి కదా. ఇంటి దగ్గర ఒక్కతే ఎలా ఉందో అనే స్పృహ లేదా మనిషికి.


ఇక చాలు. బిడ్డకు తండ్రి తాగుబోతు అని పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంది. తొలి వేకువ కిరణాలు తాకగానే వనజ మెల్లిగా రోడ్డు వైపు నడిచింది. అక్కడి నుంచి బస్సెక్కి సొంత ఊరికి వెళ్ళాలి. 


ఆమె నుదుటన దిద్దిన కుంకుమ సూర్యుని కిరణాల తాకిడికి కొత్తగా మెరుస్తోంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract