SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4.5  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"శ్రీ కృష్ణ మహాభారతం - 52"

"శ్రీ కృష్ణ మహాభారతం - 52"

4 mins
405


"శ్రీ కృష్ణ మహా భారతం - 51" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 52"

అలా కృష్ణుడిని చూసిన రుక్మిణీ సంతోషంతో పరవశించిపోతుంది. తను పతిగా భావించే ఆ కృష్ణుడికి దగ్గరగా వచ్చి, ఆయన్ని నేరుగా చూడలేక, సిగ్గుపడుతూ తన తల దించుకుని అప్పటివరకూ తన మదిలో పేరుకున్న వేదనంతా సంతోషంగా మారుతుంది.

ఆ సంతోషంతో కార్చే ఆనంద భాష్పాలు కృష్ణుడు యొక్క హృదయ గదులను తాకుతాయి.

శ్రీ కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వుతో రుక్మిణీ యొక్క మోముని తాకుతూ ఆమెను ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాడు.

రుక్మిణీ యొక్క ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.

అలా రుక్మిణీ కృష్ణులు ఆ పార్వతీ దేవి సమక్షంలో ఒక్కటవుతారు.

ఇక మరొకవైపు రుగ్ముడి సమక్షంలో విదర్భ సైనికులతో అర్జునుడికి ఘోర యుద్ధం జరుగుతుంది. ఎటువైపు అర్జునుడు ఒక్కడే పోరాడుతూ ఉంటాడు. రుగ్ముడు కొన్ని వేలమంది సైనికులను అర్జునుడి మీదకు పంపుతాడు. ఒక్కసారిగా ఆ సైనికులంతా అర్జునుడి మీదకు రావడంతో అర్జునుడు తన వద్దనున్న అస్త్రాలు అన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని వద్ద అంతా సమయం లేదు.

సరిగ్గా అప్పుడే ఒక నాగలి వచ్చి, ఆ విదర్భ సైనికులందరిని ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తుంది.

" అది సంధించింది ఎవరా ?" అని అర్జునుడి అతని వైపు చూడగా...

మిగిలిన విదర్భ సైనికులతో యుద్ధం చేస్తూ వాళ్లందరినీ మట్టుబెడుతూ అర్జునుడికి సాయం చేస్తాడు.

ఆ వీరుడు ఎవరో కాదు బలరాముడు

శ్రీ మహావిష్ణువు ఆ ఆదిశేషుని అవతారం.

త్రేతా యుగపు లక్ష్మణుని అంశ.

ద్వాపరయుగంలో ఈ శ్రీ కృష్ణ పరమాత్ముడి అన్నగా జన్మించాడు.

అలా యుద్ధంలో శైనికులందరిని మట్టుపెడతారు.

అప్పుడే అటువైపుగా అశ్వరధం పై శ్రీ కృష్ణుడు రుక్మిణీ నీ తీసుకుని వెళ్తూ రుగ్ముడు కంట పడతాడు.

అసలే రుక్మిణీ కృష్ణుడి తో వెళ్ళిపోతుంది అన్న కోపంలో ఉన్న రుగ్ముడు మరింత కోపంతో వాళ్ళని వెనుకనుండి తరుముకుంటూ వెళ్తుంటాడు.

రుగ్ముడి వల్ల కృష్ణుడికి రుక్మిణికి ఆపద పొంచి ఉందని గ్రహించి అర్జునుడు కూడా ఋగ్ముడుని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే,

"ఆగు అర్జునా ..!

ఋగ్ముడు తన ఖర్మని తానే అనుభవించని, అతని అంతం అతనే కొనితెచ్చుకుంటున్నాడు. అతని పాపానికి శిక్ష తప్పదు. వదిలేయ్...!" అని బలరాముడు అర్జునుడికి సర్ది చెప్తాడు.

దాంతో అర్జునుడు అక్కడితో ఆగిపోతాడు

కృష్ణుడిని వెంబడిస్తున్న ఋగ్ముడు కోపంతో...

"కృష్ణా ఆగు...!

ఆగు కృష్ణా...!

ఆగి నాతో యుద్ధం చెయ్యి..!" అంటూ వెనుకనుండి అరుస్తూ ఉంటాడు.

"రండి ఋగ్మి బావా...!

మీతో యుద్ధం నేను ఎలా చేయగలను,

వచ్చి నా ప్రణామములు స్వీకరించండి..!" అంటూ

కృష్ణుడు రుగ్ముడి మాట వినకుండా తన రథాన్ని ముందుకు పోనిస్తూ ఉంటాడు.

మరింత కోపంలో ఉన్న ఋగ్ముడు...

"ఓయీ కృష్ణా...!

రుక్మిణికి ఇప్పటికే శిశుపాలుడితో వివాహం నిశ్చయం అయింది.

ఇలా వేరొకరి సొత్తును దొంగచాటుగా అపహరించుకొని తీసుకు వెళ్లడానికి నీకు సిగ్గుగా లేదు..?" అంటూ కృష్ణుడిని నానా మాటలు అంటూ దుర్భాషలాడుతూ ఉంటాడు. అప్పటివరకూ శాంతంగా ఉన్న కృష్ణుడికి ఋగ్ముడి మాటతో కోపం కట్టలు తెంచుకుంటోంది.

తన రథాన్ని పక్కకి నిలిపి ఋగ్ముడికి ఎదురుగా నిలుస్తాడు.

కృష్ణుడు ఋగ్మితో ...

"శ్రీ లక్ష్మి సంపదను దానం చేస్తుంది. అంతేకాని శ్రీ లక్ష్మినే సంపదగా భావిస్తే ఎలా ?

అలానే ప్రతి స్త్రీ లక్ష్మీదేవి స్వరూపమే !" అంటూ హితబోధ చేస్తాడు.

కోపంలో ఉన్న ఋగ్మికి అవేమీ పట్టవు...

"కృష్ణా నీ ఒట్టి మాటలు కట్టి పెట్టీ శస్త్రాన్ని అందుకో..!

రా..!

నాతో యుద్ధం చెయ్యి..!" అంటూ కృష్ణుడిని రెచ్చగొడితాడు.

దానికి కృష్ణుడు...

"నాతో యుద్ధం చేసి నా చేతిలో పరాజితుడివి కావాలనుకోకు రుగ్మి..!

తిరిగి వెళ్ళు..!" అంటూ ఋగ్ముడిని హెచ్చరిస్తూనే

"అలాగే విదర్భ మహారాజుకి తమ పుత్రిక రుక్మిణీ, ఈ కృష్ణుల ప్రణామములు అందించు !" అంటూ ఋగ్ముడిని కోరతాడు కృష్ణుడు.

ఇక కృష్ణుడితో ఎంత వాదించినా ఉపయోగం లేదని ఋగ్ముడు తన సోదరి రుక్మిణితో...

"రుక్మిణీ...!

నువ్వు తక్షణమే వచ్చి నా రథం ఎక్కు...!

నీ సోదరుడిగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అంటూ బెదిరిస్తాడు.

దానికి రుక్మిణీ...

"నేను ఇప్పుడు కృష్ణుడితో ఉన్నాను. అతనే నా పతి. నా గమ్యం ద్వారక మాత్రమే. నేను మీతో రాలేను. నన్ను క్షమించండి." అంటూ ఋగ్మిని వేడుకుంటుంది.

దానికి రుగ్ముడు...

"నువ్వు రాకపోతే, నీ మృతదేహాన్ని అయినా సరే నేను విదర్భకి తీసుకుని వెళ్తాను." అంటూ హెచ్చరిస్తాడు.

ఆ మాటకి కృష్ణుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ, తన కోపాన్ని అనుచుకుని ఉంటాడు కృష్ణుడు.

అదే మాటకి బాధతో రుక్మిణీ...

"సోదరా ఋగ్మి...

నేను ఇప్పుడు శ్రీకృష్ణుని చరణాల చెంత ఉన్నాను.

మీరే కాదు...

ఇప్పుడు నన్ను ఆ యమధర్మరాజు వచ్చిన నా ప్రాణాలను తీసుకుని వెళ్ళలేడు.

కాబట్టి, మీరు మీ కోపాన్ని తగ్గించుకుని, మీ మనసుని శాంతింప చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి" అంటూ వేడుకుంటుంది.

దానికి ఋగ్మీ కోపంతో...

"నువ్వు ఏ గొల్లవాడి కోసమైతే మమ్మల్ని అందరినీ కాదనుకుని వచ్చేసావో, ఆ గొల్లవాడు నీతో జీవితాంతం ఉండడు. నీకు ఈ గొల్లవాడికి వియోగం తప్పదు.

గుర్తుపెట్టుకో రుక్మిణీ నీకు ఈ గొల్లవాడికి వియోగం తప్పదు." అంటూ రుక్మిణిని శపిస్తాడు .

ఆ మాటకి రుక్మిణీ చాలా బాధ పడుతుంది.

దాంతో కృష్ణునికి చాలా కోపం వస్తుంది. వెంటనే తన చేతుల్లోకి సుదర్శన చక్రం తీసుకుని...

"ఋగ్మి..!

నీ తోడబుట్టింది అని కూడా కనికరం లేకుండా రుక్మిణిని చాలా దుర్భాషలాడావు. అందుకు నీకు సిగ్గుగా లేదు. అందుకే, దానికి నీకు మరణ శిక్ష విధిస్తున్నాను. " అంటూ ఆ సుదర్శన చక్రాన్ని ఋగ్మి మీదకు సందిస్తాడు.

దాన్ని ఎదుర్కోవడానికి రుగ్మీ కూడా శస్త్రాన్ని సందిచే క్రమంలో తన విల్లుని ఎక్కు పెట్టగా...

ఆ సుదర్శన చక్రం ధాటిగా అది రెండు ముక్కలుగా విడిపోయి ఋగ్మి కంఠం వైపు సమీపిస్తోంది అతను శిరస్సుని ఖండించడానికి.

ఇంతలో రుక్మిణి...

"మాధవా..!

ఎంత కాదనుకున్నా అతను నా సోదరుడు...

దయచేసి అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టండి" అని కృష్ణుడిని వేడుకుంటుంది.

దానికి కృష్ణుడు...

" అతను చేసిన తప్పుకు శిక్ష తప్పదు..!" అని అంటాడు.

ఇక ఆ సుదర్శన చక్రం శక్తి ధాటిగా రుగ్మి కిందపడి శిరస్సు పై ఉన్న కిరీటం తొలగిపోతుంది. ఇక కృష్ణుడి ఆజ్ఞతో ఆ సుదర్శన చక్రం ఋగ్మి యొక్క సగం జుట్టుని తొలగించి, అతన్ని శిరస్సుని అరగుండుగా చేసి, అతన్ని ప్రాణాలతో వదిలేస్తుంది.

ఇక ఆ సుదర్శన చక్రం తీసుకుని కృష్ణుడు మరియు రుక్మిణీ తిరుగు ప్రయాణం అవుతారు.

దారి మధ్యలో వారికి అర్జునుడు ఎదురవగా...

"తమరి తక్షణ కర్తవ్యం ఏమిటి బావా ?" అని కృష్ణుడిని అడుగుతాడు.

దానికి కృష్ణుడు...

"మా ద్వారకలో మాధవిపురం అనే పట్టణం ఉంది.

అక్కడ నాకు రుక్మిణికి వివాహం చేయదలచి ఒక మండపాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. తక్షణం అక్కడికే మా ప్రయాణం. అక్కడే మా వివాహం జరుగుతుంది.

ఇక ఆ తర్వాత భారత వర్షంలో ధర్మ సంస్థాపన..!

అధర్మం చేసేవారి నాశనం..

మరియు సమస్త ఆర్యవర్త ప్రజలను సుఖంగా ఉంచడం.

ఇదే నా తక్షణ కర్తవ్యమ్ .

ఇది చాలదా?" అని అంటాడు.

దానికి అర్జునుడు గట్టిగా నవ్వుతూ...

"అంటే ఇదంతా మీ వివాహంతోనే సిద్దిస్తుందా మాధవా?" అని అడుగుతాడు

అప్పుడు మాధవుడు ఇలా అంటాడు...

"నా వివాహంతో సిద్దించకున్నా...

నీ వివాహంతో సిద్దించవచ్చును కదా పార్ధా..!

నీ అంతరంగంలో సంసిద్ధత ఉంటే చాలు.

నీవు సంకల్పిస్తే కాల ప్రవాహాన్ని మార్చగలవు." అని అంటాడు

కృష్ణుడి మాటల్లో ఆంతర్యం అర్జునుడికి అర్ధమయ్యి అర్ధమవనట్టుగా వుంటుంది.

చదువుతున్న పాఠకులకు కూడా అలానే ఉంది కదూ..!

ఆ కృష్ణుడు మాటల్లో పరమార్థం తర్వాతి భాగాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 53"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract