SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4.0  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"శ్రీ కృష్ణ మహా భారతం - 51"

"శ్రీ కృష్ణ మహా భారతం - 51"

5 mins
131


"శ్రీ కృష్ణ మహా భారతం - 50" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 51"

అలా శ్రీ కృష్ణుడు స్త్రీ వేషంలో ఉన్న అర్జునుడిని రుక్మిణీ మందిరానికి రహస్యంగా వెళ్లి ఆమెను పార్వతి పరమేశ్వరుల మందిరానికి తీసుకురమ్మని తాను అక్కడే వారి ఇద్దరి కోసం వేచి చూస్తూ ఉంటానని అతన్ని పంపిస్తాడు.

అలా రుక్మిణీ మందిరంలో మారువేషంలో రహస్యంగా వెళ్తున్న అర్జుడిని ఆ మందిరం దగ్గర కాపలాగానున్న భటులు...

"ఆగు..!

ఎవరు నువ్వు..!!" అంటూ అర్జునుడిని అడ్డగిస్తారు.

అప్పుడు ఆ స్త్రీ వేషంలో ఉన్న అర్జునుడు తన స్వరం కూడా స్త్రీ స్వరంలోకి మార్చి,

"నేను దాసిని" అని బదులు ఇస్తాడు.

"దాసివా ...?

నేను నిన్ను ఎప్పుడూ ఇక్కడ చూడలేదే..?" అని ప్రశ్నిస్తాడు అక్కడున్న ఓ భటుడు.

దానికి అర్జునుడు...

"అంటే మీరు మీ కర్తవ్యం మరిచి, దాసులను చూస్తూ ఉంటారా ?" అంటూ తెలివిగా అడుగుతాడు అర్జునుడు.

"ఇక ఆపు నీ అధికప్రసంగం...

తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా?

ఏది ఏమైనా సరే నిన్ను యువరాణి మందిరంలోకి పంపించడం కుదరదు" అంటూ మారు వేషంలో ఉన్న అర్జునుడి పై కోప్పడతాడు ఆ భటుడు.

"సరే..!

నన్ను దుర్వాస మహర్షి వారు పంపించారు.

ఇదిగో ఈ ప్రసాదం యువరాణి వారికి అందిస్తే, ఆమెకు సేది యువరాజు శిశుపాలుడితో తప్పక కళ్యాణం అవుతుందని చెప్పారు." అంటూ తనతో పారి తీసుకొచ్చిన ఆ ప్రసాదం చూపిస్తూ అర్జునుడు ఆ భటుడికి నచ్చచెప్తూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు.

అయినా సరే ఆ భటుడు మారువేషంలో ఉన్న అర్జునుడిని లోపలికి పంపడానికి ససేమిరా అంటాడు.

దాంతో అర్జునుడు...

"ఓ కాపాలదారు...

ఇప్పుడు నన్ను లోపలికి పంపకపోయావో...

నేనే ఈ ప్రసాదం స్వీకరిస్తాను...

అప్పుడు ఏమో నాకే సేధి యువరాజు తో వివాహం జరగొచ్చేమో ?

అప్పుడు యువరాజు రుగ్ముడు...

తన సోదరికి జరగాల్సిన వివాహం నీ వల్లే ఆగిపోయిందని నిన్ను తప్పక దండిస్తారు.

అది నీకు ఇష్టమేనా ?" అంటూ అతన్ని అర్జునుడు భయపెడతాడు.

దానికి ఆ భటుడు భయపడి మారువేషంలో ఉన్న అర్జునుడిని లోపలికి అనుమతిస్తాడు.

అలా లోపలికి వచ్చిన అర్జునుడు జాగ్రత్తగా రుక్మిణీ మందిరానికి చేరుకుంటాడు.

అక్కడే రుక్మిణీ సోదరుడు ఋగ్ముడు రుక్మిణీతో శిశుపాలుడితో తన పెళ్లి విషయమై చాలా తీవ్రంగా చర్చ

జరుపుతూ ఉంటాడు.

దానికి రుక్మిణీ నిరాకరిస్తూ ఉంటుంది.

"చూడు రుక్మిణీ..!

నువ్వు సేథీ యువరాజు శిశుపాలుడితో వివాహానికి నిరాకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?" అని ఋగ్ముడు అడిగితే,

దానికి...

"ఏం జరుగుతుంది శిశుపాలుడి మనసు దుఃఖిస్తుంది.

అందుకే అతనితో వివాహం వద్దు అంటున్నాను." అని బదులు ఇస్తుంది రుక్మిణీ.

"అంతే కాదు

సేథీ రాజ్యంతో విదర్భ కు వైరం వస్తుంది.

మగధ సామ్రజ్య సామ్రాట్ జరాసందుల వారి కోపానికి కారణం అవుతుంది.

మన పితృ దేవులకి అవమానం జరుగుతుంది" అంటూ కోపంగా ఆవేశంగా మాట్లాడుతాడు రుగ్ముడు.

"మీకు ఆ చింత అవసరం లేదు బ్రాతా..!

ఎందుకంటే మగధ సామ్రాజ్య ఆగ్రహానికి రక్షణగా నా భర్త శ్రీకృష్ణుడు ఉన్నాడు." అంటూ రుక్మిణీ చెప్తుంది.

అసలే కృష్ణుడు అంటే కోపంతో రగిలిపోతున్న ఋగ్నుడు...

"కృష్ణుడు...!

కృష్ణుడు...!

కృష్ణుడు...!

ఈ ప్రేలాపనలు ఆపవా నువ్వింకా..!" అని హెచ్చరిస్తాడు రుక్మిణిని

"చూసారా...!

మీరు మూడు సార్లు కృష్ణుడు నామస్మరణ చేశారు.

ఇక మీరు దైర్యంగా ఉండొచ్చు..!" అని రుక్మిణీ అంటుంది.

దానికి కోపంతో ఋగ్ముడు...

"ఇలా చాలించు రుక్మిణీ నీ వివాహం ఎప్పటికైనా సేథీ యువరాజు శిశుపాలుడుతోనే

గుర్తుంచుకో ..!"అని గట్టిగా అరుస్తాడు.

"సోదరా...!

ప్రవహించే నదికి అయితే ఆనకట్ట కట్టగలం కానీ,

వర్షించే మేఘానికి ఆనకట్ట కట్టలేము కదా...!

ఇప్పుడు నా మనసులో అంతా కృష్ణుడి నామస్మరణతో అమృత వర్షం కురుస్తుంది. దానిని ఆపడం ఎవరి తరం కాదు.

ఎప్పుడైతే కృష్ణుడిని ధ్యానించడం మొదలు పెట్టానో అప్పుడే అతడు నా భర్త అయిపోయాడు.

మీరు చూస్తూ ఉండండి...

నా కృష్ణుడే ఇక్కడికి వచ్చి మీ సమక్షంలోనే నన్ను తన భార్యగా ఇక్కడి నుండి తీసుకెళ్తాడు." అని రుక్మిణీ అంటుంది

"అది అసంభవం.

ఆ యాదవుడు ఇక్కడకి రావడం కాదు కదా..!

అసలు ఇక్కడ తను పాదం కూడా మోపలేడు.

ఒకవేళ ఇక్కడికి వస్తె తిరిగి ప్రాణాలతో వెళ్లడు."

అని ఋగ్ముడు రుక్మిణిని హెచ్చరిస్తాడు.

"ఒకసారి నలువైపులా గమనించి చూడండి బ్రాత..!

ఎటు చూసినా కృష్ణ మయం..!

అంతా కృష్ణుడే..!

సర్వం కృష్ణమయం...!

సర్వం కృష్ణమయం...!" అంటూ తన మనసులో ధ్యానిస్తూ ఉంటుంది నలువైపులా చూస్తుంది రుక్మిణీ.

అలా రుక్మిణి తో పాటు రుగ్ముడు,అర్జునుడు తన మందిరంలో ఎటు చూసినా అక్కడ కృష్ణుడు మురళి గానపు బొమ్మలు, నెమలి పించాలు, కృష్ణుడి ప్రతిమల తో ఆ మందిరం అంతా నిండిపోయి వుంటుంది.

మరొకపక్క రుక్మిణీ మాత్రం కృష్ణుడి నామస్మరణ చేస్తూనే ఉంటుంది.

దాంతో చిరాకు చెందిన ఋగ్నుడు కోపంతో రుక్మిణిని కిందకి నెట్టేసి,

"ఒక్క విషయం గుర్తుపెట్టుకో రుక్మిణీ...

నీ వివాహం మాత్రం శిశుపాలుడి తోనే జరుగుతుంది.

అప్పటివరకూ నువ్వు ఈ మందిరంలోనే బందీగా ఉంటావు.

సరిగ్గా ముహూర్తం సమయానికి మాత్రమే నీకు ఈ మందిరం నుండి విముక్తి లభిస్తుంది." అని రుగ్ముడు రుక్మిణిని హెచ్చరిస్తూ ఉంటాడు.

దానికి రుక్మిణి...

"ఎవరెన్ని చేసినా శ్రీ కృష్ణుడే నా భర్త..!" అని అంటుంది.

దాంతో రుగ్ముడు చేసేదేం లేక అక్కడి నుండి బయటకి వచ్చేస్తాడు...

అలా వస్తున్న అతనికి మారువేషంలో ఉన్న అర్జునుడు కనిపిస్తాడు.

వెంటనే,

"ఎవరు నువ్వు..?" అని మారువేషంలో ఉన్న అర్జునుడిని రుగ్ముడు ప్రశ్నిస్తాడు.

దానికి అర్జునుడు తడబడుతూ...

"దుర్వాస మహర్షి ప్రసాదం తీసుకొచ్చాను యువరాజ..!" అని చెప్తాడు.

అప్పటికే చాలా చిరాకులో ఉన్న ఋగ్ముడు...

"హా... వెళ్ళు...!

ఈ ప్రసాదం స్వీకరిస్తే నైనా తన మనసు మారుతుందేమో ..!" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఋగ్ముడు.

"మారవల్సినది తను కాదు...

మీరు యువరాజ !

ఎందుకంటే, కృష్ణుడు రాజ్యంలోకి కాదు, మీ సోదరి మనసులోకి వచ్చేశాడు" అంటూ తనలో తాను అనుకుంటూ, నవ్వుకుంటూ రుక్మిణీ దగ్గరకి వెళ్తాడు.

అలా వెళ్లిన అర్జునుడు ...

రుక్మిణీ కృష్ణుడు బొమ్మలు గీయడంలో నిమగ్నమై ఉండడం గమనించి,

"ఆ నెమలి పించం చాలా బాగుందే, నిజానికి అది శ్రీకృష్ణుడి కొప్పులో ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే అందంగా ఉంది" అంటూ ప్రసంసిస్తాడు అర్జునుడు.

దానికి రుక్మిణీ...

"ఎవరు నీవు ?

లోపలికి ఎవరు రానిచ్చారు?" అని సందేహంగా అడుగుతుంది.

"ఇప్పుడు నా గురించి మీరు తెలుసుకోవడం అనవసరం లెండి!

కానీ, మీరు మా బావ కృష్ణుడికి రాసిన లేఖలో ప్రస్తావించారు అతని కోసం తమరు పార్వతి మందిరంలో వేచి ఉంటానని,

కానీ ఇప్పటికీ ఇంకా ఇక్కడే ఉన్నారు" అని అర్జునుడు అనగానే,

రుక్మిణీ కి విషయం అర్థమవుతుంది అతడు కృష్ణుడు పంపిన అర్జునుడు అని. దాంతో మిక్కిలి సంతోషిస్తూ...

"కృష్ణుడు నా కోసం పార్వతి మందిరంలో వేచి చూస్తున్నాడా ?" అని అర్జునుడిని అడుగుతుంది రుక్మిణి.

దానికి అర్జునుడు...

"ఒకసారి వెళ్లి చూస్తేనే కదా తెలిసేది అతను అక్కడ మీ కోసం వేచి చూస్తున్నాడో లేదో తెలిసేది" అని అంటాడు

దాంతో ఇద్దరూ ఆ మందిరం నుండి బయలుదేరతారు.

కానీ, అప్పటికే అనుమానంతో ఉన్న ఋగ్ముడు, తిరిగి రుక్మిణీ మందిరం వైపు వస్తాడు.

సరిగ్గా అప్పుడే రుక్మిణీ, అర్జునుడు ఆ మందిరం నుండి బయటకి రావడం చూసిన రుగ్ముడు

అదే అనుమానంతో...

"ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరూ ?" అని వాళ్ళని ప్రశ్నిస్తాడు.

అప్పుడు అర్జునుడు...

"ఈ ప్రసాదం దుర్వాస మహర్షి వారు ఇచ్చి పంపించారు.

ఇది రాకుమారికి పార్వతి మందిరంలోనే ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించారు .

"అలా అయితే, ఇది అవసరం లేదు. రాకుమారి మందిరం నుండి బయటకి రావడం నిషిద్దం" అని హెచ్చరిస్తాడు ఋగ్ముడు.

దానికి అర్జునుడు...

"నాకు ఈ విషయం దుర్వాస మహర్షి వారు ముందే చెప్పారు.

రుక్మిణీ ఈ వివాహానికి నిరాకరిస్తుందని, ఈ ప్రసాదం తాను తీసుకోకపోతే ఎప్పటికీ తనకి శిశుపాలుడితో వివాహం జరగదు.

ఒకవేళ ప్రసాదం తీసుకున్నా అది పార్వతి మందిరంలోనే ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించారు." అని మెలిక పెడతాడు అర్జునుడు.

దానికి సంకోచంలో పడిన ఋగ్ముడు...

"సరే పార్వతి మందిరానికి తీసుకెళ్ళి అక్కడే తనకి ప్రసాదం ఇవ్వు..!

కానీ, ఒక షరతు...!

రుక్మిణితో పాటు నేను కూడా పార్వతి మందిరానికి వస్తాను" అంటూ రుగ్ముడు అర్జునుడిని, రుక్మిణినీ ఇరకాటంలో పెడతాడు.

దాంతో ఒక్కసారిగా అర్జునుడు, రుక్మిణీ ఆశ్చర్యపోతారు.

రుక్మిణీ మాత్రం...

"నేను ఇప్పుడు వెళ్లను .

ఇక్కడే నా మందిరంలోనే ఉంటాను" అంటూ నిరాకరిస్తుంది.

ఇక అర్జునుడు...

"ఇప్పుడు కనుక ప్రసాదం సేవించకపోతే

ఇక రాకుమారి మనసు ఎప్పటికీ మారదు" అంటూ అర్జునుడు ఋగ్ముడితో అంటాడు.

రుక్మిణీ మొండిగా నిరాకరిస్తుంటే,

ఋగ్ముడు ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా పార్వతీ మందిరానికి తీసుకుని వెళ్తాడు.

వారి వెనుకే అర్జునుడు కూడా వెళ్తాడు.

అలా వెళ్తుంటే మధ్యలో ఒక దోమ వచ్చి అర్జునుడి నాసిక భాగంలో ఇబ్బంది పెట్టడంతో అతడు ఒక్కసారిగా తుమ్ముతాడు. ఆ అదురికి తన వేషం(కొప్పు) ఊడిపోయి కిందపడుతుంది. దాంతో అతడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అనే విషయం బయటపడి, అతని పక్కన ఉన్న పరిచారకులు ఒక్కసారిగా భయపడి గట్టిగా అరుస్తారు.

ఆ అరుపులకి ముందు వెళ్తున్న రుగ్ముడు వెనుదిరిగి చూడగా అర్జునుడి నిజస్వరూపం తెలిసి అతన్ని బందించమని అక్కడున్న సైనికులను ఆదేశిస్తాడు.

ఇక అర్జునుడి చేసేదేం లేక,

అక్కడున్న పసుపు, కుంకుమలను చుట్టూ ఉన్న సైనికుల, ఋగ్ముడి కళ్ళలో కొట్టి రుక్మిణిని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు.

ఎదొరిచ్చిన సైనికులను తన బుద్ది, బలంతో ఎదిరిస్తూ రుక్మిణిని అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు.

మిగిలిన సైనికులు సైతం రాజాజ్ఞ తో అర్జునుడిని పట్టుకుని బంధించడానికి అతన్ని వెంబడిస్తూ ఉంటారు.

ఆ సైనికులు కొంత దూరం అర్జునుడుని వెంబడించి అతన్ని చుట్టుముట్టిన విదర్భ శైలులతో ఇక యుద్ధం తప్పదని అనుకున్న అర్జునుడు...

రుక్మిణిని పార్వతి మందిరానికి వెళ్ళమని, ఇక్కడ వీరి సంగతి నేను చూసుకుంటానని చెప్తాడు.

అలా పార్వతి మందిరానికి చేరుకున్న రుక్మిణీ అక్కడ చుట్టుపక్కల కృష్ణుడి కోసం వెతుకుతుంది. అతను మాత్రం ఎక్కడా కనిపించడు.

మనసులో నుండి పొంగుకొస్తున్న బాధతో పార్వతి దేవి విగ్రహం ముందు నిల్చుని నిట్టూరుస్తూ ఉంటుంది.

అప్పుడే

ఆ నెమలి పించదారుడు...

మురళి గానుడు....

ఆ శ్రీ మహావిష్ణువు అవతారి

శ్రీ కృష్ణ పరమాత్ముడు తన చేతిలో ఉన్న మురళి వాయిస్తూ అక్కడికి వచ్చి రుక్మిణికి దర్శనం ఇస్తాడు.

దాంతో రుక్మిణీ ఆనందానికి అవధుల్లేవు.

రుక్మిణీ, కృష్ణుడు ఒక్కటవ్వడంతో రుగ్ముడు తర్వాత ప్రణాళిక ఏమిటి ?

అర్జునుడి విదర్భ సైనికులతో యుద్ధం ఎలా చేస్తాడు ?

తనకు కాబోయే భార్యను తీసుకెళ్లిన శ్రీకృష్ణుడి తో శిశుపాలుడు ఎలా వైరం పెట్టుకుంటాడు ?

లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 52"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract