SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"శ్రీ కృష్ణ మహా భారతం - 43"

"శ్రీ కృష్ణ మహా భారతం - 43"

5 mins
251


"శ్రీ కృష్ణ మహా భారతం - 42" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 43"

దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణ ఇలా వారి నూరుగురు సోదరులను ద్రుపదుడు తన భటుల సహాయంతో ఆ చక్ర వ్యూహం మధ్యలోనే బంధించారు.

ద్రుపదుడు దుర్యోధనుడిని చూస్తూ...

"ఏం కురు రాకుమరా...!

మీ గురువు ద్రోణాచార్యుడు చక్ర వ్యూహంలోకి రావడమే తప్ప, ఇందులో నుండి మీకు ఎలా బయటపడాలో, చక్రవ్యూహ చేధన మీకు నేర్పించలేదా..?

హ.. హా.. హ్హహ్హ...

ఎందుకంటే ఇది ద్రుపదుడు చక్ర వ్యూహం.."

అంటూ విరగబడి నవ్వుతూ

"మిమ్మల్ని శిరోముండనం చేయించి, గాడిద పై ఊరేగిస్తాను. మిమ్మల్ని విడిపించడానికి మీ పితామహులు భీష్ముడు వచ్చేదాకా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.

అతడు రావాలి, నా పుత్రిక శిఖండి చేతిలో అంతమవ్వాలి.

ఇదే నా పితృదేవుల ప్రతీకారం. దాన్ని ఈనాడు నా పుత్రిక శిఖండి ద్వారా తీర్చుకోబోతున్నాను. హ.. హా.. హ్హహ్హ..." అంటూ మళ్ళీ పగల నవ్వుతాడు.

అక్కడున్న ఆ రాకుమారులకు ద్రుపదుడు చెప్పేది ఏం అర్థం కాక, అంతా వెర్రి మొహాలు వేసుకుని అతడి వైపు చూస్తారు. దుర్యోధనుడితో సహా...

"భటులారా..!

ఈ నూటైదుగురు రాకుమారులను శిరోముండనం చేయించండి" అని ద్రుపదుడు తన సైన్యానికి ఆదేశిస్తాడు.

ఇంతలో ఒక సైనికుడు వచ్చి,

"మహారాజా..!

ఇక్కడ ఉన్నది నూటైదుగురు కాదు, నూరుగురు మాత్రమే" అని చెప్తాడు.

"ఏమిటీ..!

మనకందిన గూడాచార్యం ప్రకారం నూటైదుగురు మనపై దండెత్త డానికి రావాలి కదా...!

నూరుగురు ఉండడం ఏమిటి,

మిగిలిన ఆ ఐదుగురు ఎక్కడా..?" అని ద్రుపదుడు అని అంటుండగా...

ఒక బాణం నేరుగా, చాలా వేగాంగా దూసుకువచ్చి అతడి కళ్లముందు నేలపై బలంగా గుచ్చుకుంటుంది.

దాన్ని చూసి కొంచెం భయం, ఆశ్చర్యం కలిగింది ద్రుపదునునికి.

ఆ బాణాన్ని సంధించింది అర్జునుడు.

దూరం నుండి కౌరవులు బంధింపబడడం గమనించిన పాండు కుమారులు ఇక యుద్ధంలో తమ ప్రాతినిధ్యాన్ని మొదలు పెడతారు.

తమ తమ గుర్రపు వాహనాలు తీసుకుని ద్రుపదుడి చక్ర వ్యూహం వైపు చాలా వేగంగా ముందుకు కదులుతుంటారు.

"అర్జునా..!

చక్రవ్యూహ చేధన నీకు బాగా తెలుసు కనుక, ముందు నువ్వు వెళ్ళు, మాకు మార్గ నిర్దేశం చెయ్యి, నీ వెంబడి మేము వస్తాం..!" అని యుధిష్ఠిరుడు అంటాడు.

"తమరి ఆజ్ఞ..!" అంటూ అర్జునుడు ముందు తను పోతూ, మిగిలిన తన సోదరులకు మార్గ నిర్దేశం చేస్తాడు.

చక్ర వ్యూహం సమీపిస్తున్న తరుణంలో..

అర్జునుడు యుధిష్ఠిరుడుతో...

"జ్యేష్ట బ్రాత...

మనం ప్రవేశించాల్సింది పశ్చిమ దిశ నుండి."

అని అంటూ...

"సోదరా భీమా..!, నకుల , సహదేవ..!!

ఎక్కడ ద్వారం కనిపిస్తే, అక్కడ దాని గుండా ప్రవేశించకండి.

నన్ను మాత్రమే అనుసరించండి" అంటూ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి సూచనలు ఇస్తాడు అర్జునుడు.

చక్రవ్యూహం చేదించడం లో ఇదే అర్జునుడికి మరియు దుర్యోధనుడికి ఉన్న తేడా..

ఇక చక్ర వ్యూహానికి వారు బాగా దగ్గరకి సమీపిస్తున్న వేళ,

భీముడు లోపలికి వెళ్లడానికి దారి లేదని గమనిస్తాడు.

అర్జునుడితో భీముడు

"సోదరా అర్జునా...!

సైనికులంతా చక్ర వ్యూహం ముఖద్వారం దగ్గర ఒక కోటలా నిలుచుని ఉన్నారు. లోపలకి ప్రవేశించడానికి మార్గం లేదు" అని అంటాడు.

దాంతో అర్జునుడు

తన గాండీవాన్ని ఉపయోగించి,

ఒకే ఒక్క బాణంతో మొదటి వలయపు ముఖద్వారం వద్ద ఉన్న భటులను తుడిచిపెట్టేస్తాడు. దాంతో పాండు కుమారులు చాలా సునాయాసంగా లోపలికి వెళతారు.

కానీ, ఒక్కొక్క వలయం చేరుతున్న కొలది ఒక్కొక్కరిని ఒక్కొక్క వలయంలో బందిస్తారు ఆ ద్రుపదుడు సైన్యం ఆ చక్ర వ్యూహంలో...

అంటే, మొదటి వలయంలో ఐదుగురిలో ఆఖరిగా వచ్చిన వాడిని, ఆ తర్వాత వలయంలో మిగిలిన నలుగురిలో ఆఖరివాడిని, అలా చివరకు అర్జునుడు. అచ్చం దుర్యోధనుని సోదరులను బంధించినట్టుగానే,

కానీ, పాండు కుమారులు కౌర కుమారులంత తెలివితక్కువ వారు కాదు, అంతటి బలహీనులు కాదు.

భీముడు తన బాహుబలం తో ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గదను నేలపై బలంగా గట్టిగా కొట్టగా దాని దెబ్బకు భూమికంపించి అతడిని మూసేసి ఉన్న సైనికుల కింద ఒక గొయ్యి ఏర్పడడం, వారంతా అందులో పడిపోవడం జరుగుతుంది.

ఇక నకులుడు తన అశ్వ విన్యాసాన్ని ఉపయోగించి, తన దగ్గరకు వస్తున్న సైనికుల ఆశ్వాలను మాయ చేసి, తర్వాత వలయాలను చేధిస్తాడు.

సహదేవులు తన ఖడ్గ విద్యను ఉపయోగించి మిగిలిన వలయాలను చేదించుకుంటూ ఉంటాడు.

యుధిష్ఠిరుడు తన పై ఆ శత్రు సైన్యం వలలతో చేస్తున్నా దాడిని ప్రతిగటిస్తూ మిగిలిన వలయాలను చేదిస్తాడు.

ఇక అర్జునుడు తన ధణుర్భాన విద్యను ఉపయోగించి చక్ర వ్యూహంలో మిగిలిన వలయాలను చేదిస్తాడు.

చివరికి వీరంతా కలిసి చక్ర వ్యూహ మధ్యస్తానికి అంటే కౌరవులు బందించ బడి ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఉన్న సైనికులతో పోరాడుతూనే,

ఇంతలో యుధిష్ఠిరుడు సహదేవుడిని వెళ్లి కౌర కుమారులను విదిపించమని ఆదేశిస్తాడు.

దానికి సహదేవుడు "ఇప్పుడు వాళ్ళని వినిపించడం అవసరం అంటారా సోదరా..!" అని అంటే,

యుధిష్ఠిరుడు...

"వాళ్ళు కూడా మన సోదరులే సహదేవ..

వాళ్ళు బంధింప బడితే చూస్తూ వదిలేయడం మన రాజ్యానికి అప్రతిష్ట తీసుకువస్తుంది" అని అంటాడు.

దాంతో సహదేవుడు దుర్యోధనుడినీ విడిపిస్తాడు.

యుధిష్ఠిరుడు దుర్యోధనుని వద్దకు వచ్చి,

"దుర్యోధన నువ్వు మిగిలిన మన రాకుమారులను విడిపించు" అని చెప్తే,

"నాకు నీ సలహాలు ఏమీ అవసరం లేదు.

మీ సహాయం కూడా మాకు అవసరం లేదు.

మీరు కాకపోతే, మమ్మల్ని మా తండ్రి గారు వచ్చి విడిపిస్తారు.

ఇంకొక్క విషయం ఏమంటే,

మన అని సంభోధించకు ...

మేము కౌర కుమారులం, మీరు పాండు కుమారులు...

మీరు మేము ఒక్కటి కాదు.

మేము చేదించలేక పోయిన ఈ చక్ర వ్యూహాన్ని మీరు ఐదుగురు చేదించగలమనే నమ్మకం మీకుందా..?" అని గర్వంతో అస్సలు సహాయం పొందిన కృతజ్ఞత లేకుండా చాలా కటినంగా మాట్లాడతాడు దుర్యోధనుడు.

ఇదే యుధిష్ఠిరుడి కలుపుగొలుతనపు సహృదయానికి, దుర్యోధనుడికి దురాశతో నిండిన స్వార్థపూరిత మనసుకి ఉన్న తేడా...!

మరో వైపు అర్జునుడు ఆ చక్ర వ్యూహాన్ని చేధించుకుంటూ దాని మరోవైపు చేరుకుంటాడు.

అక్కడే ద్రుపదుడు ఉంటాడు.

అర్జునుడు చక్ర వ్యూహాన్ని చేధించుకుంటూ రావడం చూసి బిత్తరపోతాడు ద్రుపదుడు. అర్జునుడి దైర్యం, పరాక్రమం చూసి భయంతో వణికిపోతాడు. ఇక భయంతో తన చుట్టూ ఒక అగ్ని వలయాన్ని రక్షణ కవచంగా ఏర్పరచుకుంటాడు.

కానీ, అర్జునుడు దాన్ని కూడా తన ధనుర్భాణ విద్యతో ఛేదించి, అదే దణుర్భాణాలను ఉపయోగించి, గజ వాహనంపై ఉన్న దృపదుడిని నేలపై పడేలా చేస్తాడు.

పిదప అతడి ఛాతీ పై అర్జునుడు తన పాదాలను మోపి,

"మీ పరాజయాన్ని ఒప్పుకోండి మహారాజా..!" అని అంటాడు.

దానికి ద్రుపదుడు...

"నేనే నిజమైన ద్రుపదుడు అని నువ్వు అనుకుంటున్నావా..!" అంటూ అనగా అర్జునుడు ఆశ్చర్యంతో అతడిని చూస్తాడు.

ఇంతలో తన వెనుక వైపు నుండి,

"నేను కూడా ద్రుపదుడిని కావొచ్చు గా" అని ఇంకో గజ వాహనంపై అచ్చం దృపదుడిని పోలిన మరొక వ్యక్తి,

అర్జునుడు అటు వైపు తిరిగే లోపు..

తన చుట్టూ పక్కల అచ్చం అలానే ఇంకో ముగ్గురు దృపదులు కూడా ప్రత్యక్షమయ్యి

"నేను కూడా ద్రుపదుడిని కావొచ్చు గా" అని వారు...

ఇలా నాలుగు దిక్కులా ఇంకో నలుగురు ద్రుపదులు ప్రత్యక్షమయ్యి అర్జునుడిని సందిగ్ధంలో పెడతారు.

ఇదే సరైన అదునుగా భావించిన కింద ఉన్న ద్రుపదుడు, తన పక్కనే కింద పడున్న ఖడ్గంతో అర్జునుడి ఉదరం పై దాడి చేయబోతాడు.

కానీ, అది పొరపాటున నడుము కి కట్టుకున్న ఓ చిన్న సంచికి తగిలి, అది తెగి కిందపడుతుంది.

కింద పడిన ఆ సంచి నుండి ఐదు నాణేలు బయటకు పడతాయి. అవే కృష్ణుడు సుభద్ర తో పంపిన బహుమతి.

వాటిని చూసిన అర్జునుడికి ఈ ఐదుగురు దృపదులకి, ఆ ఐదు నాణాలకి ఏదో సంబంధం ఉండి ఉంటుంది. అందుకే కృష్ణుడు నాకు ఇవి పంపించాడు అని భావిస్తాడు.

వాటిని, ఆ ఐదుగురు దృపదులను క్షుణ్ణంగా పరిశీలించగా...

అందులో ఒక నాణెంలో చిన్న కళ్ళు సరిగా మధ్యలో మిగిలిన వాటికి కొంచెం తేడాగా ఉంటాయి.

అలాగే తన చుట్టూ ఉన్న ద్రుపదులను పరిశీలించగా అందులో నలుగురు ఒక ద్రుపదుని వైపు చూస్తారు. ఆ ఒక్కడు మాత్రం అర్జునుడు వైపు చూస్తాడు. దీంతో తనవైపు చూస్తున్న వాడే అసలైన ద్రుపదుడు అని అర్జునుడు నిశ్చయించుకుని,

తన దనుర్భాలను ఉపయోగించి, ఆ నలుగురు నకిలీ దృపధులను అంతమొందించి, అసలైన దృపదుడిని బంధిస్తాడు.

"ఇప్పటికైనా మీరు పరాజితులైనట్టు ఒప్పుకోండి మహారాజా...!" అని అర్జునుడు అంటూ అతడిని తన గురువు ద్రోణుడి వద్దకు తీసుకుని పోతాడు.

పాండవులు సాధించిన ఈ విజయం వారికే దక్కుతుందా ?

లేక, కౌర కుమారులు తమ దురాక్రమణతో తమదిగా ఈ విజయాన్ని చెప్పుకుంటారా ?

శిఖండి ప్రతీకారం ఎప్పుడూ నెరవేరుతుంది ?

అర్జునుడి గురుదక్షిణ ద్రోణుడు అంతరంగం ఏమిటి ?

లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 44"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract