Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

సెల్ఫీ

సెల్ఫీ

1 min
339


అమూల్యా! నువ్వు నవ్వకే బాబు. నీ దెయ్యం పళ్ళు ఫోటోలో కనబడి ఫోటో తీరే మారిపోతోంది. 


అప్పుడే దిగిన ఫోటోలు చూస్తూ మీరా తన స్నేహితురాలు అమూల్య పళ్ళ పైన జోక్ చేసింది.థియేటర్ బయట సెల్ఫీ దిగి ఇద్దరూ లోపలికి వెళ్ళారు.


అమూల్య సినిమా చూస్తూ ఏదో ఆలోచిస్తోంది.

పన్ను మీద పన్నుంటే అదృష్టం అంటారు అందరూ. కానీ అలా పైరెండు పళ్ళకూ వచ్చినప్పుడు పర్లేదనుకున్నా, క్రింది పళ్లకు పైనే రెండు పళ్ళు రావడంతో డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళక తప్పలేదు.


రెండు సార్లు పన్ను పీకించడమూ, అవి పీకిన చోటే మళ్లీ రావడమూ జరిగింది. 

ఇక తన వల్ల కాదని అమూల్య సర్దుకుపోయింది కానీ తన నవ్వు మీద ఎవరైనా జోక్ చేస్తే మాత్రం నచ్చదు.


కొంత మంది అచ్చుం Twilight సినిమాలో vampires కి ఉన్నట్టే ఉన్నాయి నీ పళ్ళు అంటారు. ఇంకొంత మంది కలిసి ఫోటో దిగేటప్పుడు నవ్వకు అని అంటారు.


ఇంటికి వచ్చి తన ఫోటోలన్నీ చూసుకుంది అమూల్య. ఎక్కడా తను ఫ్రీగా నవ్వట్లేదు. దాదాపు అన్నీ అంతే.


కాసేపు టీవీ చూసి పడుకుంది అమూల్య.

ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే సూర్యుడు రావాలా వద్దా అన్నట్టు తన కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు. పిచుకలు కొన్ని బాల్కనీలోకి వచ్చి సొద్ద మొక్కల కంకుల్ని పొడుచుకుని తింటున్నాయి. 


అమూల్య చేతి పైన ఒక పిచ్చుక వచ్చి వాలింది. రోజూ సొద్దలు వేయడంతో అవి అమూల్యకు బాగా అలవాటయిపోయాయి.


అమూల్యకు సెల్ఫీ దిగాలనిపించింది. తనతో. తన నవ్వును జడ్జ్ చెయ్యని తనతో. పిచ్చుక ఎగిరింది. అమూల్య నవ్వుతూ సెల్ఫీ క్లిక్ చేసింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract