Dinakar Reddy

Comedy Drama

3  

Dinakar Reddy

Comedy Drama

రూమ్మేటు - అర్ధ మొగుడు

రూమ్మేటు - అర్ధ మొగుడు

2 mins
260


సుధా! ఏమిటే ఆఫీసులో తూగుతున్నావ్. బాస్ చూస్తే అని నన్ను హెచ్చరించింది పద్మ.


ఏమని చెప్పమంటావే నా బాధ అని పాత తెలుగు సినిమా హీరోయిన్ లాగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చాను.


సర్లే. పని కానివ్వు. మనం లంచ్ టైం లో మాట్లాడుకుందాం అని పద్మ తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయింది. 


లంచ్ పూర్తి చేసి నేనూ పద్మా ఆఫీసు వెనుక వైపున ఉన్న రోడ్డు మీదకు వచ్చాం. నడుస్తూ మాట్లాడుకుంటున్నాం.


లంచ్ అయిన తరువాత ఇలా పది నిమిషాలు తిరిగి భుక్తాయాసం తీర్చుకోవడానికి రావడం మా ఆఫీసులో అందరికీ అలవాటే.


ఇంతకీ ఏమైందే. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా. మన బాస్ గానీ కల్లోకి రావట్లేదు కదా అని కన్ను కొట్టింది పద్మ. 


నా మొహం. అసలే నిద్ర సరిపోక నేనేడుస్తుంటే నువ్వు మళ్లీ బాసు కలా అంటూ నేను విసుక్కున్నాను.


నా రూమ్మేట్ శ్రీజ తెలుసు కదా. దానికి ఈ మధ్య నిశ్చితార్థం జరిగింది అన్నాను నేను.


మంచి విషయమే కదే. అబ్బాయి బాగుంటాడా అని అడిగింది పద్మ.


హా. హెన్రీ కావిల్ లా ఉంటాడట. వెళ్ళి చూసిరా అని చిరాకు పడ్డాను నేను.


అయినా దానికి నిశ్చితార్థం జరిగితే నీకేమిటే అని తన సందేహం అడిగింది పద్మ.


శ్రీజ రాత్రి రెండు వరకూ ఫోను మాట్లాడుతుంది. నేను చెవుల్లో దూది పెట్టుకుని పడుకున్నా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. అదేమో బయటికి వెళ్ళి మాట్లాడమని చెబితే బయట చలి, దోమలు అంటుంది.


అందుకే ఆఫీసులో తూగుతున్నాను. అర్ధంఅయ్యిందా అన్నాన్నేను. 


సరే. సరే. కోప్పడకు. ఒక వయసు వచ్చినంత వరకూ కొన్ని ఫీలింగ్స్ మనం ఎవరికీ చెప్పకుండా ఒంటరితనంలో దాచుకుంటాం. మనతో జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తి దొరికాక నిశ్చితార్థం కూడా అయ్యాక ఇక మనం వారి నుండి దూరంగా ఉండే ఒక్కో నిమిషం కూడా ఏదో ఆత్రుత కలుగుతుంది. అవతలి వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. అలవాట్లు అభిరుచులూ అంటూ మనసు వాళ్ళ ఆలోచనల్లో మునిగిపోతుంది అని పద్మ చెబుతూ నడుస్తోంది.

నిజమే అన్నాను నేను కూడా.

మొత్తానికి నీ రూమ్మేట్ నీకు అర్ధ మొగుడు లా

తయారయ్యింది అన్న మాట అని నవ్వింది.

నువ్వు శ్రీజ ను ఏమీ అనలేవు. వీలుంటే మరో రూంలో పడుకునే ఏర్పాటు చూడు. లేకుంటే రాత్రిళ్ళు తొందరగా నిద్దురపో. 

రేపు నీకు నిశ్చితార్థం జరిగాక నువ్వు మాత్రం నీ టామ్ క్రూయిజ్ తో మాట్లాడవా ఏంటి అని చెబుతూ నావైపు కళ్ళెగరేసింది పద్మ.


నా మొహం అనుకున్నాను నేను.



Rate this content
Log in

Similar telugu story from Comedy