Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

రక్షకులెవరో..

రక్షకులెవరో..

1 min
272


మాలతీ! నువ్వెళ్లి ఆ రైటర్ దగ్గర ఉన్న పెండింగ్ ఫైల్స్ చూడు. SHO ఇచ్చిన ఆర్డరు విని ఫైల్స్ అన్నీ తీసి చూడసాగింది.


కాసేపటి తరువాత మాలతి ఒక ఫైల్ పట్టుకుని SHO దగ్గరికి వెళ్ళింది.


సార్! కిందటి నెల ఇషిక అనే మైనర్ బాలిక ఇచ్చిన కంప్లయింట్ పేపర్ ఇందులో లేదు అంది.


అవునా! ఏమని? అని అడిగాడు SHO.


వాళ్ళ స్కూల్ బయట కొంత మంది వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఆ అమ్మాయి వెనుక భాగాన్ని తడుముతున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పింది. నేనే వ్రాసాను సార్. నాకు బాగా గుర్తు అంది.


చూడు మాలతీ! ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కేసు నమోదు చేయడం ఇష్టం లేదని నాకు చెప్పారు. ఆ సంగతి వదిలేయ్. ఆ అమ్మాయిని వేరే స్కూల్లో చేరుస్తారట అన్నాడు SHO.


కానీ సార్. సమస్య అలానే ఉండొచ్చు కదా. మమ్మల్ని ఆ రూట్లో అబ్జర్వ్ చేయమంటారా అని అడిగింది.


వద్దని చెప్పాక వదిలేయాలి. అసలక్కడ ఏమీ జరగలేదు కదా. ఏదో రేప్ జరిగినట్టు చెబుతున్నావ్. ఒక కానిస్టేబుల్ ఎలా ఉండాలో ముందు నేర్చుకో.

చూస్తుంటే ఆ వయసులో నిన్నూ ఎవడో బాగా టచ్ చేసినట్టున్నాడు అని నవ్వాడు.


మాలతి ఆ మాటలు విని కొద్దిగా కుచించుకుపోయింది. మిగతా వాళ్ళ నవ్వులు కూడా విని ఇక లాభం లేదని ఆ ఫైల్ తీసుకుని షెల్ఫ్ లో పెట్టడానికి వెళ్ళింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract