Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పరీక్ష వ్రాయాలి!

పరీక్ష వ్రాయాలి!

1 min
230


కవిత, లలిత ఇద్దరూ కవల పిల్లలు. చూడ్డానికి ఒకేలా ఉండే ఈ సోదరీమణుల్లో కవిత చదువులో ఫస్టు. లలిత ఆటల్లో ఫస్టు.


కవిత పదో క్లాసు పూర్తి చేసి ఇంటర్మీడియెట్ లో చేరింది. లలిత అప్పటికే పదో తరగతి పరీక్ష రెండు సార్లు తప్పింది.


లలిత బాగా బ్రతిమిలాడడంతో ఈసారి కవిత ఆమె బదులు పరీక్ష వ్రాసేందుకు ఒప్పుకుంది.


అన్ని పరీక్షలూ బాగా వ్రాసింది. ఎవ్వరూ తను లలిత కాదని గుర్తు పట్టలేదు. ఆఖర్లో సోషల్ పరీక్ష రోజు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చింది. 


కవిత అలానే భయపడుతూ కూర్చుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ గా వచ్చింది ఎవరో కాదు. కవిత ఇంటర్మీడియెట్ కాలేజీ లెక్చరర్.. అతడికి కవిత చేతి వ్రాత గుర్తే. తెలుగులో కూడా కర్సివ్ రైటింగ్ అందంగా వ్రాయగలదు కవిత.


ఆ పేపర్ చూసి నీ పేరు ఏంటి అని అడిగాడు ఆ లెక్చరర్.


కవితకి కళ్ళు తిరిగి పడిపోవడం వరకే గుర్తుంది.. కళ్ళు తెరిచి చూస్తే పక్కన లలిత పుస్తకం పట్టుకుని చదువుతూ ఉంది.


నిన్ను డీబార్ చేయలేదా అని అడిగింది కవిత. 


అసలే చదవలేక నేనేడుస్తుంటే మధ్యలో అపశకునాలు కూస్తావేం అని విసుక్కుంది లలిత..


హమ్మయ్య .. ఇదంతా కలన్న మాట అని కవిత ఊపిరి పీల్చుకుంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract