Dr.R.N.SHEELA KUMAR

Tragedy

4  

Dr.R.N.SHEELA KUMAR

Tragedy

ప్రేయసి

ప్రేయసి

1 min
140


అది ఓ అందమైన సాయంత్రం. రవి జానూ కోసం ఎదురుచూస్తూ బీచ్ మన్ను లో కూర్చున్నాడు. చమటలు పట్టి జానూ అక్కడకు వచ్చింది. జానూ ని చూసి బెదిరిపడి ఏమయ్యింది జానూ ఇంత చమటలు పట్టేసాయి నీకు అని అడిగాడి రవి. వెంటనే నీకేంటి బాబు ఆఫీస నుండి లెటయ్యింది అని ఇంట్లో చెప్పేస్తావు. నేను ఇంటి నుండి బయలుదేరేలోపు ఓ 200ప్రశ్నలు వేస్తుంది మా అమ్మ అని మొదలుపెట్టింది జానూ. వెంటనే రవి సరే ఆ బ్యాంకు జాబ్ ఏమయ్యింది అని అడిగాడు. ఆ వచ్చే వారం నుండి రమ్మన్నారు రవి ఇక మన కష్టాలు గట్టేక్కినట్లే. నువ్వు రేపు నాన్నతో వచ్చి మాట్టాడు అంది జానూ.

మరుసటి రోజు రవి చాలా సంతోషంగా జానూ ఇంటికి బయలు దేరాడు. కానీ అక్కడ జానూ ని అలా చూస్తాడని అనుకోలేదు జానూ వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ తో చనిపోయారు పాపం జానూ ఆ ఇంటికి పెద్దమ్మాయి తన తరవాత ఓ చెల్లి తమ్ముడు, చెల్లి కాలేజీ ఫైనల్ ఇయర్ తమ్ముడు రాజా ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్. ఇప్పుడున్న పరిస్థితులలో పెళ్లి మాటలు మానేసి ప్రేయసిగానే మిగిలి భాద్యత లతో జీవనాన్ని కొనసాగిస్తుంది జానూ. వయసు పైబడుతుంది బాధ్యతలు తీరలేదు కనుక రవిని వేరే పెళ్లి చేసుకోమని చెప్పింది.

జానూ చెల్లి రమా రవి ఇంటికి వస్తూ పోవటం తో మనసు పడి అక్కతో విషయం చెప్పింది. వెంటనే రవిని ఒప్పించి రమా రవి ల కళ్యాణం చేసింది త్యాగాశీలి జానూ. ఆఖరు వరకు ప్రేయసిగానే మిగిలిపోయింది.


Rate this content
Log in

Similar telugu story from Tragedy