madhu kavyam

Comedy Drama Romance

4  

madhu kavyam

Comedy Drama Romance

ప్రేమా.. నువ్వెక్కడ ..?

ప్రేమా.. నువ్వెక్కడ ..?

3 mins
424


ఒక నిండు పున్నమి రోజు రాత్రి మేడ మీద మంచం పై పడుకొని ఆకాశం వైపు చూస్తూ తనకి కాబోయే భర్త గురించి ఆలొచిస్తుంది. ఒక అమ్మాయి. ఇంతకు ముందే బోజనాలు వేళ అమ్మ నాన్న తన పెళ్ళి గురించి మాట్లాడుతూ తనని అడిగారు.అప్పుడు సిగ్గు తో అక్కడ నుంచి మేడ మీదకు వచ్చింది అప్పుడు నుంచి ఆలోచిస్తుంది.తనకి అసలు ఎలాంటి వాడు కావాలి.అప్పుడు తనకి కాలేజీ లో ఒక అతను ప్రేమిస్తున్నాను అని వెంట పడ్డాడు.అతనితో మా అమ్మ నాన్న చూపించిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పింది. కానీ ఇప్పుడు అసలు తనకి ఎలాంటి వాడు కావాలో తెలియటంలేదు.అలాగే ఆలోచిస్తూ పడుకుండిపోయింది.

       •••

కిటికీలోంచి సూర్య కిరణాలు మొహం మీద పడుతుంది.. దుప్పటి నీ లాక్కొని పడుకున్నాడు

అంతలో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి.ఉలిక్కిపడి నిద్ర లేచాడు. అబ్బా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాడు.పక్క పోర్షన్ లో ఉండే వెంకట్రావు అతని భార్య అలివేలు గొడవ పడుతున్నారు.రోజు వాళ్ళు అంతే గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ గొడవ రవి కి అలవాటైపోయింది.ఆవలిస్తూ గోడకు ఆనుకొని నించున్నాడు. ఏమిటి గురూ మళ్ళీ రామాయణం మొదలయిందా.అంటూ పక్కకి వచ్చి నిల్చున్నాడు వీరబాబు.వీరబాబు పై పోర్షన్లో ఉంటున్నాడు. ఆ ఎప్పుడో మొదలైంది గొడవ అంటూ పక్కకి చేరాడు రాము.సరేగాని ఈరోజు ఎందుకు గొడవ పడుతున్నారూ.. అదా వెంకట్రావు టిఫిన్ లోకి చట్నీ చేయమన్నడట.పిన్నిగారు చేయలేదు అదే గొడవ. ఓస్ అంతేనా టిఫిన్ చేయడమే ఎక్కువ మళ్ళీ అందులో చట్నీ కూడానా.మా ఆవిడ అయితే తను పెట్టింది మనం తినటం తప్ప మరో మాట మాట్లాడమా ఆరోజు నుంచి ఇంకా ఇంట్లో టిఫిన్ నే ఉండదు.అని వాపోయాడు వీరబాబు.సరేలే ఎప్పుడు ఉండే గొడవేగా పోతా అని రాము వెళ్ళిపోయాడు. రవి కూడా లోపలికి వచ్చాడు.వస్తూనే అమ్మరాసిన ఉత్తరం తీసుకున్నాడు. మామూలుగా అమ్మ నుంచి ఎప్పుడు ఉత్తరం వచ్చినా వెంటనే చదువుతాడు.కానీ రాత్రి ఆఫీస్ నుంచి రావడం ఆలస్యం కావడంతో ఉత్తరం చదవలేదు. ఉత్తరం తీసుకుని కిటికీ దగ్గరకు వచ్చి ఉత్తరాన్ని చదువుతున్నాడు. ప్రియమైన రవి కి మీ అమ్మ ఆశీర్వదించి రాయినది. బాబు రవి ఎలా ఉన్నావు. వేళకి తిను.ఆరోగ్యం జాగ్రత్త . నువ్వు పంపిన డబ్బు అందింది. ఎప్పుడూ చెప్పే మాటే కథా అని అనుకోకుండా నా మాట విని పెళ్ళి చేసుకో రా నాయనా. ఏ విషయం ఉత్తరం రాయి. ఉంటాను 

                        మీ అమ్మ


రవి ఉత్తరం చదివి పక్కనపెట్టి అమ్మ చెప్పిన మాటలు ఆలోచిస్తున్నాడు. అంతలో గడియారం టంగ్ టంగ్ మంది. టైం చూస్తే 8గంటలు అయ్యింది. త్వర త్వరగా తయారై ఆఫీస్ కి బయలుదేరాడు. ఆఫీస్ కి వెళుతూ దారిలో మల్లయ్య టిఫెన్ కొట్టు దగ్గరకి వెళ్ళాడు.మామూలుగా అయితే అంత రష్ గా ఉండదు. ఆవేళ ఎందుకో చాలా రష్ గా ఉంది. రవి వెళ్లి అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వైటర్ వచ్చి ఆర్డర్ అడిగాడు.రవి ప్లేట్ ఇడ్లీ ఒక టీ చెప్పాడు. వైటర్ వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు.వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు.అమ్మ నాన్న ఒక బాబు .వారిని చూస్తే తన బాల్యం గుర్తుకొచ్చింది.తను కూడా అలాగే అమ్మ నాన్న తో చాలా సంతోషంగా ఉండేవాడు.కానీ తనకి 10సంవత్సరాల అప్పుడు నాన్న చనిపోయారు.అప్పట్నించీ అమ్మే కష్టపడి తనని పెంచింది. ఈ ప్రపంచంలో తనకి అమ్మ. అమ్మ కి తను.. అంతే . తనకి అమ్మ అంటే ఎంతో ప్రేమ. అలాంటి అమ్మ ఏమడిగింది.తనని త్వరగా పెళ్ళి చేసుకో మంది..కానీ తను ఎందుకు పెళ్ళి చేసుకో లేదో అమ్మకు తెలుసు . అయినా పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఇలా తన ఆలోచనలతో ఉన్నాడు. అంతలో వెయిటర్ టిఫిన్ తీసుకొని వచ్చాడు.ఆలోచన నుంచి తేరుకొని గబ గబ టిఫిన్ తిని బిల్ కట్టేసి.అక్కడ నుండి బయట పడ్డాడు. ఆఫీస్ కి వెళ్ళేటప్పటికి సరిగ్గా 9గంటలు అయింది.

              •••••


ఇదిగో కవితా ఎంత సేపే తయారవటం త్వరగా తెములూ. అవతల గుడి దగ్గర అందరు వచ్చేసే ఉంటారు.అబ్బబా ఏమిటే నువ్వు నీ హడావిడి నూ.. అమ్మయి రాను అని ముందే చెప్పింది కదా.

అయినా ఎందుకే అంత బలవంతం చేస్తావు. పదా మనం వెళ్తే సరిపోతుంది.అంటున్నాడు వర్మ..బార్య లక్ష్మి కాంతం తో . అబ్బా అది కాదండీ మా అన్నయ్య .అమ్మయి నీ తప్పకుండా తీసుకురా అని అన్నారు. ఎందుకంటే...ఆ!ఎందుకంటే చెప్పు.. అరే ముందు చెప్పేది వినకుండా..మీరు.

ఏమిటే నువ్వు చెప్పేది ..మీ అన్నయ్య చెప్పేది.

నా కూతుర్ని పెళ్లి కోసం అలా అందరికీ చూపించనవసరం లేదు. సంతలో గొడ్డు నీ చూపించినట్టు. దాని కోసం యువరాజు వస్తాడే. ఏమనుకుంటున్నవో.ఆ.! ఆ.!వస్తాడు ఇలా ఎవ్వరికీ చూపించకుండా ఇంటి లోనే పెట్టుకుంటే

యువరాజు ఎంకర్మ .. మహారాజే వస్తాడు.

అయినా నాకు ఎందుకు ఎంచేసుకుంటారో మీ ఇష్టం.. మీ కూతురి ఇష్టం. మద్యన నాకు ఎందుకు వచ్చింది..అని లక్ష్మి కాంతం వెళ్లి కారు లో కూర్చుంది.


Rate this content
Log in

More telugu story from madhu kavyam

Similar telugu story from Comedy