Shaik Sameera

Thriller


3.4  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins 204 5 mins 204

           ఎపిసోడ్ -11

వంశ్ రాజ్ ని క్లోత్ తీసుకొని రమ్మని పంపిస్తాడు .రాజ్ క్లోత్ తీసుకొస్తాడు వంశ్ ఆ క్లోత్ తీసుకొని రిథిమా ఫేస్ చూస్తూ వన్ ,two ,త్రీ అని కౌంట్ చేసి క్లోత్ ఓపెన్ చేస్తాడు క్లోత్ నుండి మేకులు కింద పడతాయి అది చూసి రిథిమా షాక్ అవుతుంది .రిథిమా మనసులో ఎవరు మేకులు పెట్టారు ఎవరు నన్ను సేవ్ చేసారు అనుకుంటూ టెన్షన్ పడుతుంది .కబీర్ రిథిమా డేంజర్ లో ఉందని V R మాన్షన్ కి రిథిమా ని సేవ్ చేయడానికి వస్తాడు అప్పుడు వంశ్ రిథిమా మాట్లాడుకోవడం చూసి విండో నుండి ఒక డివైస్ పెట్టి వాళ్ళు మాట్లాడుకోవడం విని రెడ్ క్లోత్ లో మేకులు పెట్టేస్తాడు వంశ్ కి రిథిమా మీద అనుమానం రాకూడదని .ఆర్యన్ క్లోత్ లో మేకులు ఉండటం చూసి తను ఏదో ట్రాప్ చేస్తుంది తనని నమ్మొద్దు అంటాడు .వంశ్ రిథిమాని చూసి మేకులు పెట్టి క్లోత్ కి ఒక్క ముడి వేయొచ్చు కదా మూడు ముడులు ఎందుకు వేశావు అని అడుగుతాడు .రిథిమా టెన్షన్ పడుతూ ఏదో చెప్పేలోపు కబీర్ మాన్షన్ కరెంట్ వైర్ కట్ చేసేస్తాడు కరెంట్ పోతుంది .వంశ్ కరెంట్ పోవడం తో ఏమైందో రాజ్ ని చెక్ చేయమంటాడు .రిథిమా చీకటిలో పక్కకి వెళ్లి రిలాక్స్ అవుతుంది .

కబీర్ ఎలక్ట్రీషియన్ గా కిట్ పట్టుకొని ఎవరికీ అనుమానం రాకుండా మాన్షన్ లోకి వెళ్తాడు .రిథిమా టెన్షన్ పడుతూ కబీర్ కి చెప్పాలని ల్యాండ్ లైన్ నుండి కాల్ చేస్తుంది .కబీర్ మొబైల్ రింగ్ టోన్ వినిపిస్తుంది రిథిమాకి కబీర్ మాన్షన్ కి వచ్చాడేమో అని వెతుకుతూ ఉంటుంది .వంశ్ ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరగలేదు ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు .రిథిమాని చూసి కబీర్ తన చేయి పట్టుకొని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు .రిథిమా కబీర్ అని తెలియక ఎవరు నువ్వు అని అరవబోతే తన నోటికి తన చేయి అడ్డం పెట్టి రిథిమా నేను కబీర్ ని అని మీసం తీసేస్తాడు .కబీర్ రిథిమాని చూసి హాగ్ చేసుకుంటుంది .రిథిమా కబీర్ ని హాగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది.అప్పుడు కబీర్ రిథిమా ప్లీజ్ రిలాక్స్ నేను నీతో ఉన్నాను భయపడకు అంటాడు .ఎవరో వచ్చినట్టు సౌండ్ రావడంతో కబీర్ రిథిమాని రూంలోనే ఉండమని చెప్పి తను బయటికి వెళ్తాడు వంశ్ పిన్ని తమ్ముడు మేఘ్ కనిపిస్తాడు కబీర్ కి .ఎవరు నువ్వు అని మేఘ్ కబీర్ ని అడుగుతాడు నేను ఎలక్ట్రీషియన్ అని చెబుతాడు మరి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు పవర్ బోర్డు వెతుకుతున్నాను అంటాడు .కింద ఉంది పవర్ బోర్డు అని దారి చూపిస్తాడు మేఘ్ కబీర్ కి .

రాజ్ పవర్ బోర్డు దగ్గరికి వెళ్లి ఎవరో వైర్ కట్ చేసి ఉండటం చూస్తాడు .రాజ్ రెడ్ క్లోత్ తీసుకొని రావడానికి వెళ్ళినపుడు కబీర్ వచ్చిన బైక్ చూస్తాడు ఎవరో వచ్చారని అర్థం అవుతుంది .మేఘ్ వంశ్ దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉండటం చూసి ఏమైంది అని అడుగుతాడు వంశ్ ఈరోజుల్లో electricians ఎంత ఫాస్ట్ అయిపోయారు మన ఇంట్లో కరెంట్ పోయిన 10mins కే ఒక ఎలక్ట్రీషియన్ ని పంపించారు చెక్ చేయమని అని చెప్పి వెళ్ళిపోతాడు .అప్పుడే రాజ్ కూడా వంశ్ దగ్గరికి వచ్చి ఎవరో unknown పర్సన్ ఇంట్లోకి వచ్చాడని కావాలని వైర్ కట్ చేసారని పవర్ కేబుల్ చెబుతాడు .అందుకు వంశ్ రాజ్ తో మొత్తం మాన్షన్ లాక్ డౌన్ చేయమని అలాగే సెక్యూరిటీ ని మాన్షన్ మొత్తాన్ని చెక్ చేయమంటాడు పవర్ కేబుల్ కనెక్ట్ చేయమంటాడు త్వరగా రాజ్ వంశ్ చెప్పినట్టు చేయడానికి వెళ్ళిపోతాడు .

రిథిమాని కబీర్ మాన్షన్ లో ఇంకో ప్లేసుకి తీసుకెళ్తాడు .రిథిమా కబీర్ తో వంశ్ చాలా డేంజరస్ కానీ తన ఫ్యామిలీ తో మాత్రం ప్రేమగా ఉంటాడు ముఖ్యంగా సియా తో చాలా ప్రేమగా ఉంటాడు .తన ఫ్యామిలీ కోసం వంశ్ ఏదైనా చేస్తాడు అని చెబుతుంది .కబీర్ క్లోత్ లో మేకులు ఎవరు పెట్టారు చెప్పు అని అడుగుతుంది .అందుకు కబీర్ నేనే పెట్టాను నువ్వు డేంజర్ లో ఉన్నవని వచ్చాను అప్పుడు వంశ్ నువ్వు ఆర్యన్ మాట్లాడుకోవడం చూసి మీ మాటలన్నీ ఒక డివైస్ ద్వారా విన్నాను అందుకే క్లోత్లో మేకులు పెట్టాను అని చెబుతాడు .అందుకు రిథిమా కబీర్ నువ్వు రాకపోతే వంశ్ నన్ను చంపేసేవాడూ అని భయపడుతుంది .రిథిమా ప్లీజ్ అలా అనకు నీకు నేను ఏం కానివ్వను .ఇక్కడ నుండి నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను నా మిషన్ కోసం నిన్ను డేంజర్ లో పడేయలేను ఇక్కడితో నా మిషన్ ఆపేస్తున్నా నాతో పాటు వచ్చేయ్ అని రిథిమా చేయి పట్టుకొని తీసుకెళ్తాడు .

వంశ్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ వుంటే ఇషాని వస్తుంది తన దగ్గరికి అన్నయ్య నీతో మాట్లాడాలి అంటుంది .వంశ్ ఇప్పుడు కాదు నేను టెన్షన్ లో ఉన్నాను అని వెళ్ళిపోబోతుంటే ఇషాని రిథిమా గురించి చెప్పాలి అంటుంది .వంశ్ ఆగి రిథిమా గురించా ఏంటో చెప్పమంటాడు .ఆ రిథిమాni ఇంటి నుండి పంపించేయి ఇన్ని తప్పులు చేసిన తనని ఎందుకు excuse చేసి ఇంకా ఇక్కడ ఉండనిస్తున్నారు అని అడుగుతుంది వంశ్ ని ఇషాని .అందుకు వంశ్ ఆలోచిస్తే నీకే తెలుస్తుంది అంటాడు .ఇషాని సియా కోసమా తనకంటే బెటర్ ఫీజియోథెరపిస్ట్ దొరుకుతారు మనకి తనని పంపించేయండి మీ చెల్లెలిలాగా అడుగుతున్నా చేయరా నాకోసం అని అడుగుతుంది ఇషాని .సియా కూడా నా చెల్లెలే తనకోసం రిథిమా ఇక్కడ ఉండాలి అని వంశ్ చెబుతాడు .అందుకు ఇషాని ఎప్పుడు మీరు నన్ను తక్కువగానే చూస్తారు ఎందుకు అని అడుగుతుంది .వంశ్ అందుకు నేను తక్కువగా చూడట్లా నువ్వు చేసే పనుల వల్లనే నువ్వు తక్కువ అయిపోతున్నావు అని వెళ్ళిపోతాడు వంశ్ .

రిథిమా కబీర్ చేయిని వదిలి కబీర్ నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటాను అంటుంది .కబీర్ షాక్ అవుతాడు .

రిథిమా -ప్లీజ్ కబీర్ నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు సేఫ్ గా ఇక్కడనుంచి అదే ముఖ్యం ఇప్పుడు .నేను నీతో వచ్చేస్తే నీ మిషన్ ఇక్కడితో ఆగిపోతుంది .

కబీర్ -రిథిమా వద్దు ప్లీజ్ నా మిషన్ కన్నా నువ్వే ముఖ్యం నాకు. నీ ప్రాణాలను ప్రమాదంలో పడేసి నా మిషన్ ని కంప్లీట్ చేయలేను 

రిథిమా -కబీర్ కొంచెం నేను భయపడ్డాను నిజమే కానీ నిన్ను చూసాక నాకు ధైర్యం వచ్చింది నేను మేనేజ్ చేస్తాను .నేను మాత్రమే నీ మిషన్ కి ఉన్న చివరి అవకాశం అని తెలిసి నేను నీతో వచ్చేస్తే వంశ్ దగ్గరికి నువ్వు మళ్ళీ చేరుకోవడం కష్టమైపోతుంది .నేను ఇక్కడే ఉంది వంశ్ కి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని సంపాదిస్తాను నాకు నమ్మకం ఉంది చేయగలనని నువ్వు వెళ్ళు జాగ్రత్త గా అంటుంది .

కబీర్ -రిథిమా నువ్వు ఇక్కడే ఉండటం సేఫ్ కాదు 

రిథిమా -నా సేఫ్టీ కన్నా కబీర్ ముందు నువ్వు ఇక్కడ నుండి సేఫ్ గా వెళ్లడం ముఖ్యం నేను మేనేజ్ చేసుకోగలను అని చెబుతుంది .అప్పుడే వంశ్ రిథిమా అని పిలుస్తాడు కబీర్ రిథిమా వెనక్కి వెళ్లి దాక్కుంటాడు .

వంశ్ రిథిమా దగ్గరికి వచ్చేసరికి కరెంట్ వస్తుంది కబీర్ ని వంశ్ ఎక్కడ చూస్తాడో అని టెన్షన్ పడుతూ వుంటే వంశ్ రిథిమా వెనక్కి వెళ్లి చూస్తాడు అక్కడ ఎవరు ఉండరు .ఇక్కడ ఏం చేస్తున్నావు అని రిథిమాని అడుగుతాడు వంశ్ .ఇంతలో ఇషాని రాజ్ మీద అరవడం వినపడి కిందకి వెళ్తారు రిథిమా ,వంశ్ .ఇషాని రాజ్ నీలాంటి నౌకరు చెప్పే మాటలు నేను వినాలా అంటుంది .వంశ్ వచ్చి ఏమైంది ఇషాని అని అడిగితే .ఏమైందో మీ నౌకరు ని అడగండి అంటుంది .వంశ్ అందుకు నీకు ఎన్ని సార్లు చెప్పాలి రాజ్ నౌకరు కాదు నా బాడీ గార్డ్ అంటాడు .రాజ్ ఏమైంది అంటాడు వంశ్ .రాజ్ బాస్ unknown person పట్టుకోడానికి గేట్స్ క్లోజ్ చేస్తూ వుంటే ఇషాని బయటికి వెళ్లడం చూసి ఆపాను అంటాడు .వంశ్ ఇషాని ఈ టైములో బయటికి ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు .అందుకు ఇషాని కోపంతో తన హ్యాండ్ బ్యాగ్ కింద పడేసి నన్ను ఆపిన రాజ్ ని అడగటం మానేసి నన్ను అడుగుతారు ఏంటి రాజ్ లిమిట్స్ cross చేస్తున్నాడు అంటుంది .వంశ్ ఇషాని బ్యాగ్ నుండి కేబుల్ కట్టర్ కిందపడటం చూస్తాడు .వంశ్ ఇషాని ఈ కట్టర్ నీ బ్యాగ్ లో ఉందేంటి ఈ లాక్ డౌన్ లో టైమ్ లో బయటికి వెళ్తున్నావా లేకపోతే ఎవరినైనా కాపాడటానికి ట్రై చేస్తున్నావా అని అడుగుతాడు .అందుకు ఇషాని అన్నయ్య మీరు ఇపుడు ఇంట్లో వాళ్ళని కూడా అనుమానించడం స్టార్ట్ చేసారా అంటుంది .మీరు ఎవరినైనా అనుమానించాలంటే రిథిమాని అనుమానించండి అంటుంది .Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller