SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"ప్రేమ లేఖ - 6"

"ప్రేమ లేఖ - 6"

7 mins
392


"ప్రేమ లేఖ - 5" కి

కొనసాగింపు....

"ప్రేమ లేఖ - 6"

అలా ప్రేమ్ కి లేఖను చేరవేసిన కావ్య, తన రిప్లై కోసం ఎదురుచూస్తుంది. ఆ మరుసటి రోజు సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్తున్న కావ్య దగ్గరికి, అప్పుడే సరిగ్గా ఇంచు మించు ఆ కావ్య వయసున్న ఒక యువతి తనని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది.

తనతో పాటే ఆ రోజు కీర్తన వాళ్ల ఇంటికి కావ్యను తీసుకెళ్లిన ఆ చిన్న పాప...

ఆ యువతి వెనుకనుండి వస్తూ....

"ఇదిగో అక్కా...

ఈవిడే కావ్య అక్క.!" అంటూ

కావ్య వంక చూస్తూ...

"అక్కా ఆరోజు మీరు అడిగారే, కీర్తన అక్క!

ఇదిగో తినే" అంటూ వాళ్ళిద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేసింది.

ఇంతలో కీర్తన..

"హల్లో...

నమస్తే అండి !.

నేనే కీర్తన,

కావ్య అంటే మీరేనా ..!"

అంటూ తనని తాను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టింది కీర్తన.

కీర్తనను అలా ఒక్కసారిగా చూసిన కావ్య...

ఒక పక్క ఆశ్చర్యంతో...,

మరొక పక్క ఇంతకాలం తన మదిలో మోస్తున్న ప్రశ్నలకు జవాబు దొరుకుతుందనే ఆనందంతో...

ఉలుకు పలుకు లేకుండా తనని అలానే చూస్తూ నిశ్చలంగా ఉండిపోయింది.

దాంతో కావ్యను గట్టిగా అదిమింది కీర్తన...

తేరుకున్న కావ్య...

"హల్లో..

ఐ యాం కావ్య..

నైస్ టు మీట్ యూ..!" అంటూ కావ్య కూడా కీర్తనకి తనని తాను పరిచయం చేసుకుంది.

కీర్తనతో చర్చించాల్సిన ప్రేమ్ , లేఖ ప్రేమ విషయం కొంచెం సెన్సిటివ్ మాటర్ కాబట్టి, అక్కడి నుండి ఆ రోజు పిల్లలందరినీ పంపించేసింది కావ్య.

అప్పటికే వాళ్ళిద్దరికీ పైకి కాఫీ పంపించింది కావ్య వాళ్ళమ్మ గారు.

అలా కాఫీ తాగుతూ...

కీర్తన మాట్లాడడం మొదలు పెట్టింది.

"సారీ కావ్య...!

అమ్మ ఆరోజు మీ విషయంలో అలా ప్రవర్తించి ఉండకుండా ఉండాల్సింది. నేను ఆ రోజు ఇంట్లో లేకపోవడం వల్ల వచ్చింది అదంతా....

ఇదిగో ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన ఆ పాప ఇదంతా చెప్పింది. అలా చేసినందుకు అమ్మని తిడదామనుకున్నా...

కానీ, మళ్ళీ ఇదంతా ఓ పెద్ద సమస్య అయ్యి...

నన్ను ఇక్కడికి పంపదని, తనని ఇంకేం అనలేకపోయాను.

ఇప్పుడు కూడా తనకి తెలియకుండానే వచ్చాను.

ఏం అనుకోకు..

I'm really very very sorry కావ్య గారు." అంటూ ఆ రోజు కావ్య కి జరిగిన అవమానానికి క్షమాపణలు కోరుతూ సంజాయిషీ ఇచ్చుకుంది కావ్య... కీర్తనకి.

"అది సర్లే కానీ,

ఆవిడ అలా అనడంలో అసలు తప్పే లేదు.

నిజానికి తప్పంతా నీ స్నేహితురాలిది.

అదే లేఖ ది.

తను అలాంటిది మీ అమ్మగారు ఊహించి ఉండరు, పైగా నువ్వు తనలాంటి ఒకమ్మాయితో స్నేహం చేస్తున్నావని ఆవిడ భయం. ఆవిడ మాత్రం ఏం చేస్తుందిలే, నా లాంటి ఒక ఈడొచ్చిన ఆడపిల్లకి తల్లి లాంటిది కదా. తన జాగ్రత్త తనది.

ఇకపోతే లేఖ...

అసలు తను మనిషేనా..!

ఒక మనిషి(ప్రేమ్) జీవితంతో అలా ఆడుకోవడానికి తనకి అసలు సిగ్గు లేదు.

అవతలి వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ నీ ఇంత దారుణంగా ఆడుకునే ఆడపిల్లలు ఉంటారని తనని చూశాకే తెలిసింది.

ఇప్పటివరకూ అబ్బాయిలే అమ్మాయిలను వాడుకుని, వాళ్ల వాళ్ళ అవసరాలు తీర్చుకుని మొహం చాటేస్తారని విన్నాను. అనుకున్నాను. కానీ, మొట్టమొదటి సారి లేఖ లాంటి అమ్మాయిని చూసాకా అమ్మాయిలలో కూడా అలాంటి వారు ఉంటారని అర్థమైంది.

ఛీ.. ఛీ...

నాకూ ఒక అమ్మాయిని అని చెప్పుకోవడానికే సిగ్గుగా అనిపిస్తుంది." అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా కావ్య, లేఖని కీర్తన ముందు తిడుతుంటే,

"అది కాదు ...

ఒక్కసారి నేను చెప్పేది విను..."

అంటూ దానికి అడ్డుపడింది కీర్తన

"అసలు ఎక్కడ ఉందో చెప్పు తను..

తన ఇంట్లో పేరెంట్స్ కి తను ఇలాంటిదని చెప్పి వాళ్ళతో మాట్లాడతా...

లేఖ కాదంటే, ఆ అబ్బాయి అక్కడ ఏదైనా అఘాయిత్యం చేసుకునే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు తన ఇంత మోసం చేసిందని, మరింతగా దారుణానికి ఒడిగట్టిందని తెలిస్తే ఆ ప్రేమ్ పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించిందా తను.!" అంటూ మళ్ళీ లేఖపై విరుచుకుపడుతుంది కావ్య.

కావ్య మాటలకు తట్టుకోలేని కీర్తన...

తనతో పాటు తెచ్చిన తన చేతిలోనున్న లెటర్ తీసి కావ్య కి ఇస్తుంది.

(దానిని చదవమన్నట్టుగా..)

కానీ, అసలే అప్పటికే కోపంలో ఉన్న కావ్య...

ఆ లెటర్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తుంది.

"నాకు ఇవన్నీ అనవసరం, వాళ్ల చేరవేసుకున్న ఇలాంటి లెటర్స్ చాలానే చదివాను. నాకిప్పుడు తను ఎక్కడుందో కావాలి.

అసలు లేఖ ని అంతగా ప్రేమించిన ప్రేమ్ ని, తను ఎందుకు అలా మోసం చేయాలనుకుందో నాకు తెలియాలి. ఎవరికి కారణం చెప్పకపోయినా తనని అంతలా ప్రేమించిన ప్రేమ్ కి అయినా సంజాయిషీ ఇచ్చుకోవాలిగా.

ఏం ఇంట్లో తెలిసి, వాళ్ళు వీళ్ళ ప్రేమను కాదన్నారా?

లేక ఇంకెవరినైనా తను తగులుకుందా..?

ఇలా ఎంత మంది జీవితాలు నాశనం చేస్తుంది తను !"

అంటూ ఆవేశంతో తన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కావ్యను..

ఇక అదుపు చేయడం కీర్తన వల్ల కావడం లేదు.

"ఇక చాళ్లే..!

ఆపుతావా..!" అంటూ తనపై చెయ్యి చేసుకోబోయింది కీర్తన!

ఒకసారిగా కీర్తనలో అంత కోపం చూసిన కావ్య తిట్లే కాదు, తన నోటి వెంబడి తూటాల్లా పేలుతున్న మాటలు కూడా ఆగిపోయాయి.

కీర్తన కోపం... దాని వెనకనున్న బాధ...

సరిగా అప్పుడే కీర్తన కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళని చూస్తుంటే కావ్యకి అర్ధమవుతుంది.

"అసలు లేఖ గురించి నీకేం తెలుసని,

నువ్వింతలా తనని దూషిస్తూ మాట్లాడుతున్నావ్.

అసలు తను ఎలాంటి అమ్మాయో...!

ఇక్కడే కాదు, మా కాలేజ్ లో ఎవరిని అడిగినా చెప్తారు.

ఏదో.. ఎవరో.. ఎక్కడో... చేసిన తప్పుకి తను ఏం చేయలేక, నిస్సహాయతగా తనకి తానుగా శిక్షను విధించుకుంది పాపం ఆ పిచ్చిది. అందుకే, చివరికి ఈ లోకం దృష్టిలో ఒక అపరాధిగా మిగిలిపోయి ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు, మాకేవరికి అందనంత దూరాలకు వెళ్లిపోయింది.

ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

ఇదిగో ఇదే తను చివరగా రాసిన లెటర్.

కనీసం ఇదైనా చదివితే తను ప్రేమ్ నీ ఎంతగా ప్రేమించిందో...

ప్రేమ్ కి కాకపోయినా నీకైనా తెలుస్తుంది." అంటూ ఒక పక్క తన కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ లెటర్ ఇస్తుంది కీర్తన కావ్యకి.

లేఖ ఇక లేదన్న విషయం తెలుసుకున్న కావ్య కళ్ళు కూడా తనకి తెలియకుండానే చెమర్చాయి.

అలా ఆ చమర్చిన కళ్లతోనే కీర్తన దగ్గర నుండి ఆ లెటర్ తీసుకుంది కావ్య.

అలా ఆ లెటర్ తీసుకుని దాన్ని చదవడం ప్రారంభించింది కావ్య.

                           ❤️@@@@@❤️

ప్రియమైన ప్రేమ్ కు,

నీవచ్చట కుసలమేనని నా మనసు తలుస్తుంది. నా మీదున్న అభిప్రాయంతో కూడిన నీ ప్రేమను నాకు వ్యక్తపరచడం, దానిని నేను అంగీకరించినప్పటికీ...

ఎందుకో అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు.

అప్పటికి ఈ విషయం దైర్యం చేసి నాన్నకు చెప్పాను.

చిన్నప్పటి నుండి నేనేంటో ఆయనికి తెలుసు. నాపైన అపారమైన నమ్మకం. అందుకే, ఆయన మారు మాట్లాడకుండా మన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఒప్పుకున్నప్పటికి...

నన్ను పెంచిన తల్లి మాత్రం దానికి అంగీకరించలేదు.

బహుశా నన్ను కన్న నా కన్నతల్లి ఉండి ఉంటే,

నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుని ఉండేది కాబోలు...

ఎంతైనా సవతి తల్లి కదా..!

పైగా నేనంటే ఆవిడకి చిన్నప్పటి నుండి అసలెందుకో మరి గిట్టదు. ఇక ఆవిడ మాటకు నాన్న కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి.

పైగా విషయాన్ని పెద్దది చేస్తూ... చుట్టు పక్కలంతా నన్ను అల్లరి చేసింది. ఇప్పటివరకూ నేను కాపాడుకున్న నా గౌరవాన్ని క్షణాల్లో తుంచేసింది.

దాంతో ఇప్పటివరకూ నాతో స్నేహంగా మెలిగిన స్నేహితులు దూరమయ్యారు. చనువుగా మెలిగిన చుట్టుపక్కల వాళ్ళు అసహ్యించుకుంటున్నారు. ఆఖరికి నా చుట్టూ తిరిగి నాతో చదువు చెప్పించుకుంటున్న ట్యూషన్ పిల్లలు దూరం అయ్యారు.

ఆకరికి నా స్నేహితులలో మన విషయం తెలిసిన, అత్యంత సన్నిహితంగా ఉండే నా ఒక్కగానొక్క స్నేహితురాలు కీర్తనను కూడా వాళ్ళమ్మ దూరం పెట్టింది. నేను మంచిదాన్ని కానని, నాతో స్నేహాన్ని మానుకోమని హెచ్చరించిందంట.

ఆ విషయం తను చెప్పకపోయినా...

బయట వాళ్ల వల్ల తెలిసింది అది. నాన్న కూడా బయట మునుపటిలా తిరగలేకపోతున్నారు.

చుట్టూ జరుగుతున్నది చూస్తుంటే నేనేం తప్పు చేశానా అనిపిస్తుంది. ఇంట్లో ఎదిరించి లేచిపోలేదే. వారించి వాల్లకిష్టం లేకుండా నీతో కలిసి పారిపోలేదే. అయినా ఎందుకో నన్ను ఈ సమాజం వెలివేసినట్టు అనిపిస్తుంది.

ఈ వేదనతో ఈ ప్రపంచంలో నాకు ఉండాలనిపించడం లేదు. అందుకే, ఈ క్షణం ఎవరికి ఏమి కానీ నేను, ఎవరికి అందనంత దూరం వెల్లిపోధామని నిశ్చయించుకున్నాను.

చివరిసారిగా నిన్ను ఒక్కసారి కలవాలని , నా బాధంత నేరుగా నీతో చెప్పుకోవాలని ఉంది.

కానీ, ఇప్పటికీ ఏ తప్పు చేయకుండానే నా మీద ఓ చెడ్డ ముద్ర వేసిన ఈ సమాజం, అప్పుడు ఇంకెన్ని ఆడిపోసుకుంటుందోనని భయం నాకు.

నా గురించి నాకు తెలిసు కాబట్టి, నాకేం అది పట్టకపోయినా... ఇక్కడ ఉండి అన్ని భరించాల్సింది మాత్రం నాన్న. ఈ వయసులో ఇవ్వన్నీ తట్టుకునే శక్తి ఆయనకి లేదు. రేపు ఆయనికి జరగరానిది జరిగితే నేను కూడా నీతో సంతోషంగా ఉండలేను.

అలా ఆని చెయ్యని తప్పుకు ప్రతిక్షణం భయపడుతూ బ్రతకలేను. నీలా ఇంత గొప్పగా ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకుని అసలు ఉండలేను. ఆ గొప్ప ప్రేమను పొందే అదృష్టం కూడా నాకు లేదనిపిస్తుంది. అందుకే నా తనువు చాలిస్తున్నాను. ఇంతకాలం నీ మనసు పంచుకుని ఇప్పుడు నిన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నాను అని దిగులు పెట్టుకోకు...

మన ఈ పరిచయం, మన ప్రేమ ఓ కలలాంటిదనుకుని

ముందుకు సాగిపో..!

నాకన్నా నిన్ను మరింత ఎక్కువగాగా ప్రేమించే అమ్మాయి దొరుకుతుందని ఆశిస్తున్నాను.

నా చివరి ఊపిరి వరకూ నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ లేఖ...

భావోద్వేగాలతో నిండిన మనసుతో రాస్తున్న నా ఈ చివరి లేఖ !

ఉంటాను...

ఇక సెలవు..!

       

                               ❤️@@@@@❤️

ఆ లెటర్ చదవడం పూర్తి చేసిన కావ్య...

బరువెక్కిన హృదయంతో కీర్తన వంక చూడగా...

"నిజమేమిటో తెలుసుకోకుండా అకారణంగా ఎవరిని నిందించకూడదు.

మొదటి తన ప్రేమను బయటపెట్టింది ప్రేమ్ యే అయినా...

నిజానికి లేఖ ప్రేమ్ నీ అంతకంటే ఎక్కువగానే ప్రేమించింది. కానీ, మన చుట్టూ ఉన్న కట్టుబాట్లకు, సమాజపు సంకుచిత ఆలోచనలకు తన ప్రేమను బయట పెట్టలేకపోయింది. ఎంతైనా ఆడపిల్ల కదా ...!

అదొక నీచపు ముద్రయ్యింది ఈ రోజుల్లో....

ప్రతిదానికీ ఆడపిల్లను తగ్గి ఉండాలి, తలొగ్గి ఉండాలి అనడం.

అబ్బాయిలకి మాత్రమేనా ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి ఉండేవి?

వాళ్ళు మాత్రమేనా ప్రేమ విఫలమైతే బాధపడేది?

ఈ సమాజానికి అంత భయపడి తన ప్రేమను దాచుకుని, చివరికి నిజాయితీగా ఇంట్లో ధైర్యంగా చెప్పినా కూడా ...

తనేదో తప్పు చేసినట్లు, తప్పుడు పనులు చేసినట్లు చూసింది ఇదే సమాజం. ఆకరికి ఆ సవతి తల్లి తన పంతాన్నే గెలిపించుకుంది.

ప్రతి విషయం నాతో పంచుకునే ఆ పిచ్చిది.. చివరికి ఈ విషయం నా దగ్గర కూడా దాచి, నాకు శాశ్వతంగా దూరమయ్యింది.

తను చనిపోయిందనే బాధ కూడా ఎవరికి లేదు. పైగా తప్పు చేసింది కాబట్టి సరైన శిక్ష అనుభవించందంటూ ఆ సవతి తల్లి, ఈ సమాజం మరిన్ని నిందలు మోపింది తనమీద. ఒక పిరికి దానిలా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందే కానీ బ్రతికివుంటే వాళ్లకు చెంప ఛెళ్లుమనిపించేలా జావాబుండేది.

ఈ లెటర్ మరియు లేఖ గురించి, ప్రేమ్ కి తెలిస్తే తను ఏమైపోతాడో నన్న భయం.

అందుకే, ప్రేమ్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియక లేఖ గురించి రాసే తన లేఖలకు బదులివ్వలేకపోయాను.

ఇక లేఖ ఆకస్మిక మరణాన్ని తన తండ్రి జీర్ణించుకోలేక మానసికంగా కృంగిపోయాడు. ఆయన్ని ఇక్కడ నుండి ఎక్కడికో తీసుకెళ్ళి పోయింది ఆ మహాతల్లి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలీదు వాళ్ళు." అంటూ జరిగిన దాన్నంత వివరించింది కీర్తన కావ్యకు... లేఖ గురించి, లేఖ ఫ్యామిలీ గురించి జరిగిన సంఘటనలను.

అప్పటికే కీర్తనకు, తను ప్రేమ్ కి లేఖ పేరుతో పంపిన లేఖల గురించి కూడా చెప్పింది కావ్య.

ఇదంతా తెలిసి ఇంకా తనని ఇలా మోసగిస్తే , లేని లేఖ పై ప్రేమ్ మరింత ప్రేమను పెంచుకుని తను కూడా లేకుండా పోతాడని భావించారు వాళ్ళిద్దరూ. అందుకే, ప్రేమ్ ని కలిసి విషయం చెప్పడానికి మరొక లెటర్ రాయడానికి సిద్ధపడతారు వాళ్ళిద్దరూ.

కిందకి వెళ్లబోతుంటే, అదంతా మెట్ల పై నుండి కావ్య అమ్మ గమనించడం తెలుస్తుంది వాళ్ళకి.

కానీ, ఆవిడ మాత్రం అదంతా అర్థం చేసుకుని వాళ్లు చేసిన, చేయబోయే పనికి మద్దతు తెలుపుతుంది.

ప్రేమ్ కి లేఖ లేదన్న విషయాన్ని వాళ్లెలా తెలియపరుస్తారు...?

లేఖ ఇక లేదని తెలిసి ప్రేమ్ దానిని తట్టుకోగలడా..?

ప్రేమ్ , లేఖల మధ్య రాయబారం నడుపుతున్న

ఈ "ప్రేమ లేఖ" కథ చివరికి ఎటువైపు..?

చూద్దాం తర్వాతి బాగం

"ప్రేమ లేఖ - 7" లో చూద్దాం.

కావ్యకి కీర్తన కూడా తోడవబోతుండడంతో ప్రేమ్, లేఖల మధ్య ఈ "ప్రేమ లేఖ" ఎలా మలుపు తిరగబోతుందో చూద్దాం.

అంతవరకూ ...

పాఠకులందరూ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract