SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"ప్రేమ లేఖ - 4"

"ప్రేమ లేఖ - 4"

7 mins
291



గమనిక: ముందు భాగాలు చదవకుండా ఈ భాగం చదివితే ఏమీ అర్ధం కాదు. దయచేసి ముందు వాటిని చదివి ఆ తర్వాత ఇక్కడికి రండి.

"ప్రేమ లేఖ - 3" కి

కొనసాగింపు...

"ప్రేమ లేఖ - 4"

కీర్తన వాళ్ల ఫ్యామిలీ ఊరి నుండి వచ్చారు అని తెలియడంతో...

ఆ రోజు ఉదయాన్నే పని ముగించుకుని కీర్తన ఇంటికి బయలుదేరింది కావ్య ఆ పాపను తీసుకుని.

కావ్యకి ఇంట్లో ఎవరూ కనిపించకపోయే సరికి...

"కీర్తన...

కీర్తన... " అంటూ బయట నుండి పిలుస్తున్న కావ్య పిలుపును వినిపించుకుని, ఒకావిడ ఆ ఇంటి లోపల నుండి వచ్చారు.

"వస్తూనే ఏవరమ్మా నువ్వు..?

ఎవరు కావాలి నీకు..?" అంటూ కావ్యను ప్రశ్నించింది ఆవిడ.

"అది...

నాపేరు కావ్య..!

మేము ఈ వీధి చివర విశ్వేశ్వర రావు గారింటికి అద్దెకు వచ్చాము. ఈ మధ్యే మా నాన్న గారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయనో ప్రభుత్వ ఉద్యోగి." అంటూ తనని తాను కావ్య, ఆవిడకి పరిచయం చేసుకుంటుండగా..

"అయ్యో ..!

లోపలికి రామ్మా..!

అక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను" అంటూ కావ్య చెప్తుండగానే తనని లోపలికి తీసుకెళ్ళింది ఆవిడ.

ఇంట్లో కి వెళ్లిన కావ్యకి ఎక్కడ చూసినా కీర్తన మాత్రం కనిపించడం లేదు.

లోపలికి తీసుకెళ్లిన ఆవిడను

"మీరెవరు..?

కీర్తన..!" అంటూ అడుగుతుంటే,

అయ్యో.!

చెప్పడం మర్చిపోయాను.

నేను వాళ్ళమ్మనమ్మా !

తను ఊరి నుండి ఇంకా రాలేదు. ఇంకొన్ని రోజులు అక్కడే ఉండోస్తానని చెప్పి ఉండిపోయింది.

ఉండమ్మ కాఫీ పట్టుకొస్తాను" అంటూ చెప్తూ లోపలికి వెళ్ళింది కీర్తన వాళ్లమ్మ గారు.

"అదేం వద్దు ఆంటీ..!" అని కావ్య చెప్పే లోపే ఆవిడ కిచెన్ లోకి వెళ్లిపోయింది.

ఆవిడ... కీర్తన లేదని చెప్పడంతో కావ్య లో మళ్ళీ నిరాశ, నిస్పృహ నిండుకున్నాయి.

అంతలోనే, ఆ కాఫీ పట్టుకుని వచ్చింది కీర్తన వాళ్ళమ్మగారు.

ఆ కాఫీ తీసుకుంటూనే, తన వంక చూస్తూ కీర్తన ఎప్పుడోస్తుంది ఆంటీ! అని అడిగింది కావ్య.

"తను రావడానికి టైం పట్టొచ్చమ్మా..!

తనకి ఏమైనా చెప్పాలా..?

నీకు తను ఎలా పరిచయం అమ్మా..!" అంటూ కీర్తన గురించి చెప్తూనే తనకున్న సందేహాన్ని బయట పెట్టింది ఆవిడ.

"అది..

నాకు తనకీ అసలు పరిచయం లేదు..!

కానీ, ఇంతకుముందు మేముంటున్న ఇంట్లో అధ్దెకుండే...

లేఖ గురించి తెలుసుకుందామని,

కీర్తన, లేఖ మంచి స్నేహితులని తెలిసింది. లేఖకి ఎవరి దగ్గర నుండో లెటర్స్ వస్తున్నాయి.

వాటి గురించి...,

లేఖ గురించి తనకేమైన తెలుసేమోనని!" అంటూ కావ్య ఆ కాఫీ తాగుతూ బదులిస్తుంటే,

అకస్మాత్తుగా కోపోద్రిక్తురాలైన కీర్తన తల్లి, ఒక్కసారి కావ్య తాగుతున్న కాఫీ కప్పును అమర్యాదగా తన వద్ద నుండి లాక్కుని,

"లే...లే..

పైకి లేవే..!"

అంటూ కావ్య మీద విరుకుపడింది.

"అదేంటి ఆంటీ!

ఏమైంది ..!" అని పైకి లేస్తూ కావ్య ఆవిడని అడిగే లోపు..

"పో...

పోవే..!

ముందు ఇంట్లోంచి బయటకు పో...!

అసలు అలాంటి దాని గురించి అడిగిన నిన్ను, లోపలకి రానివ్వడమే నేను చేసిన తప్పు!

ఆ గుమ్మం దగ్గరే నిన్ను నిలబెట్టి అడిగి ఉంటే, ఇక్కడి వరకూ వచ్చేది కాదు ఇదంతా..!

నువ్వు ఆ ఇంట్లో దిగినట్టు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది... నువ్వు కూడా దాని లాంటి దానివే అని,

తప్పుడు పనులు మీరు చేసేది కాక, ఏ పాపం తెలియని మా పిల్లల్నెందుకు లాగుతారే అందులోకి,

పది మందితో తిరిగి, అమాయకుల జీవితాలతో ఆడుకునే దాని గురించి అడగడానికి వచ్చావా..!

ఇంకోసారి ఈ ఛాయలకి వచ్చావో...!

నీకీ మర్యాద కూడా ఉండదు" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి కావ్య ను బయటకి తోసేసింది ఆవిడ.

దాంతో కావ్యకి అక్కడేం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు.

అక్కడి నుండి వచ్చేస్తూ...

"అసలు లేఖ పేరు ఎత్తగానే, కీర్తన వాళ్ల అమ్మగారి ప్రవర్తనలో ఆ మార్పు ఎందుకు?

ఆవిడ మాటలను బట్టి చూస్తుంటే

తను ఏదైనా చేయరాని తప్పులు చేసిందా?

దానివల్లే వాళ్ళు (అదే లేఖ కుటుంబం) ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చిందా..?

అందుకే , తన గురించి చుట్టుపక్కల ఎవర్ని అడిగినా సమాధానం దాటవేశారు.

కీర్తన చుట్టాల ఇంటిలో తల దాచుకోవడానికి కారణం కూడా లేఖనేమో..?

అందుకే కీర్తన వాళ్ళమ్మ గారు లేఖ ఊసు ఎత్తగానే అంత కోపగించుకున్నారు.

అసలు లేఖ ఏం చేసింది..?

ఎవర్ని మోసం చేసింది..?

ఎంతమంది జీవితాలతో ఆడుకుంది..?

మరి, తననీ పిచ్చిగా ప్రేమిస్తూ...

తననే ఆరాధ్యంగా భావిస్తున్న ప్రేమ్ ప్రేమ పరిస్థితి ఏంటి?

అసలు లేఖ ఇలాంటిది అని తెలిస్తే తను ఏమైపోతాడు..?

లేఖ... లేఖ రాయకపోతే ప్రాణాలు తీసుకునే వరకూ వెల్లాడంటే, ఇదంతా తెలిస్తే అతను కనీసం ప్రాణాలతో అయినా ఉంటాడా..?" లాంటి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది కావ్య.

కేవలం అమ్మాయిలే స్వచ్చమైన ప్రేమను కలిగి, అబ్బాయిలతో అలాంటి ప్రేమ దొరకదనుకున్న కావ్యకి, ఈ ఘటనతో అదంతా రివర్స్ అయినట్టు అనిపిస్తుంది.

ప్రేమ్ లాంటి స్వచ్ఛంగా ప్రేమించే అబ్బాయిలు,

లేఖ లాంటి మోసం చేసే అమ్మాయిలు చుట్టూ ఉన్న సమాజంలో...

తను ఉన్న ఈ సమాజంలో లేకపోలేదని తనకి అర్థమైంది.

లేఖను అంత గాఢంగా ప్రేమించిన ప్రేమ్ ప్రేమను బ్రతికించలేకపోయినా... కనీసం తన ప్రాణాలైనా బ్రతికించాలనుకుంది కావ్య.

అందుకే,

                             ❤️@@@@@❤️

"

ప్రియమైన

ప్రేమ్ గారికి,

ఈ లేఖ నాకోసం రాసిన మీ ప్రేమ్ లేఖలకి స్పందిస్తూ రాయునది. గత కొన్ని రోజులుగా మీరు పంపుతున్న లేఖలు నాకు అందుతున్నవి. కానీ, కొంచెం అనారోగ్యం కారణంగా మీ లేఖలకు నేను బదులివ్వకపోయాను. అంతేకానీ, మీరు అనుకున్నట్టు ఎలాంటి కారణాలు కాదు. దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దు.

మీ కావ్యాల కౌగిల్లలో నా మనసును భద్రపరిచిన మిమల్ని ఎప్పటికీ మోసం కానీ, మీ మనసు నొచ్చుకునే పనులు కానీ ఎన్నటికీ తల పెట్టబోనని మీకు ప్రమాణం చేస్తున్నాను. ఒకవేళ అలాంటి పనులే చెయ్యాల్సి వస్తే, అప్పుడు ఈ లేఖ మీకిక లేనట్టే లెక్క.

మరొక్క మాట..!

మీ గురించి వేరెవరో కాదు, ఇప్పటివరకు మిమ్మల్ని ఇంతగా నమ్మి, మిమ్మల్ని మరింతగా ప్రేమించిన నా మనసే ఎదురుతిరిగి మీ గురించి చెడుగా చెప్పే ప్రయత్నం చేసినా దాన్ని కూడా లెక్క చేయనటువంటి ప్రేమ మీ పై గలది.

అందుకే, అడ్డు కట్ట వేస్తున్న మీ మది మాటు దాగిన ప్రశ్నల ప్రవాహానికి నా సమాధానపు వివరణతో...

అందుకో సఖుడా నా ఈ కమ్మని కావ్యాన్ని..

"నీ కవితల తోటలో

విరబూసిన ఓ పారిజాత పుష్పాన్నైతే,

నీ ఆశల లోకంలో

వికసించిన ఓ వేకువ కిరణాన్నైతే,

నీ ఊహల పల్లకిలో

మోస్తుంది నా ఊసుల జ్ఞాపకాలే అయితే,

నీ రాత్రుల కనులలో

కంటుంది నా రూపపు కలలే అయితే,

నా అందం నా అక్షరాలలో అందడం లేదా?

నా అకృతం నా పదాలలో కనిపించడం లేదా?

నా శబ్ధం నా వాక్యాలలో వినిపించడం లేదా?

నా కరుణ నా కవిత్వంలో దొరకడం లేదా?

నా రాక కోసం నీ కనులు రెండూ ఎదురుచూస్తే,

నా పిలుపు కోసం నీ చెవులు రెండూ అలుముకుంటే,

నా పేరును స్మరిస్తూ నీ పెదవులు రెండూ అలసిపోతే,

నా కౌగలికి పరితపిస్తూ నీ కరములు రెండూ సాగిలపడితే.

నదిలాంటి నీ మనసు ప్రవాహంలో

రాయి లాంటి నా జ్ఞాపకాలను విసిరేసి,

అది సృష్టించిన ప్రేమపు అలల అలజడిని

ఆస్వాదించనంటూ నేనలా వదిలేసి వెళ్తానని నెవ్వెలా అనుకున్నవ్?

కోవెలలో హారతిలా వెలుగొందిన నా స్వచ్ఛ ప్రేమ భావం

ఆఖరి చితి మంటై నీ ఆశలను దహించివేయడం కాదు..

ఆకరి చితి మంట వరకూ అది తోడుంటుంది.

నాకై నిరంతరం పరితపిస్తున్న నీ పిచ్చి మనసు పాపం

వేదనల నీటి అలలై నా ఆశయాలను హరించివేయడం కాదు..

నా ఆశయాలకు ఆయువు పోసింది.

నిర్మలమైన నా యద లోగిళ్ళలో...

సృష్టించిన నీ అనుభూతుల ఆశలను,

హృదయ స్పందనలనే తీగలతో మ్రోగిస్తునే ఉన్నావ్ కదా నేస్తమా ?

బంధమనే ఓ చక్కటి గానాన్ని నాకై ఆలపిస్తూనే ఉన్నావు కదా సఖుడా?

స్వచ్చమైన నా మది పుస్తకంలో...

అమర్చిన నీ ఆలోచనల అక్షరాలను,

మనసు భావమనే కలముతో లిఖిస్తూ ? 

ప్రేమతో నీ ఈ అద్బుత కావ్యాన్ని నాకందింస్తుంటే నేనది అనుక్షణం అందుకుంటూనే ఉన్నాను కదా ప్రియుడా ?

                   ********************

"యడబాటనే కుంగుబాటు బాధిస్తుంటే,

నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటానంటూ దాన్ని నీ దరికి రానియకు..

పొరపాటనే భంగపాటు బంధిస్తుంటే,

పొరపాట్లకు, భంగపాట్లకు మన ప్రేమలో చొట్టెక్కడంటూ దాన్ని నీ చెంతకు చెరనేయకు...

కనుపాపకి కునుకు దూరమై కలవరపెడుతుంటే,

నే నీ పక్కనే ఉంటూ లాలిపాడుతున్నాననుకుని ఆ కలవరాన్ని కనుమరుగు చెయ్యి...

కంటికి కన్నీళ్లు కరువై కలచివేస్తుంటే,

కలలోనే కాదు, ఇలలో కూడా నీకెప్పటికి దూరమవనంటూ ఆ కలచివేతను తుంచివేయి...

ఎరుగని నా రూపును క్షణక్షణం భ్రమిస్తూన్నట్టు..

నీ అక్షరాలలో అది కనబడుతుంది.

వినపడని నా పిలుపును అనుక్షణం జపిస్తున్నట్టు..

నీ పదాలలో అది వినపడుతుంది.

దరిచేరని నా తలపును తక్షణం తపిస్తున్నట్టు..

నీ వాక్యాల ద్వారా అది చేరుతుంది.

చేరువవని నా వలపులో ప్రతి క్షణం నిద్రిస్తున్నట్టు..

నీ కావ్యాలు నన్ను మెల్కోపుతున్నాయి.

చెలియా అనే నీ ఆవేదన,

అర్థం చేసుకోగలను!

సఖియా అనే నీ అభ్యర్థన,

ఆలకించగలను!

ప్రణయమా అనే నీ ఆలోచన,

ఆదరించగలను!

ప్రియతమ అనే నీ ఆదరణ,

ఆశించగలను!

మనసులో మాటువేసిన మధుర భావం!

ఎల్లప్పుడూ చెరిగిపోనిది.

వాక్యాలుగా పెనవేసిన ప్రతి పదం!!

ఎప్పటికీ చెరపలేనిది.

నా దరికి చేర్చే ఈ కన్నీటి కావ్యం!

ఎల్లప్పుడూ తోడుండేది.

నా దరికి చేరే నీ చిరకాల స్నేహం!!

ఎన్నటికీ వీగలేనిది.

నేను నీ తోడుండగా..

నా యద లోగిళ్ళలో విశ్రాంతికై,

ఒంటరిగా సంచరిస్తున్న ఓ బాటసారివా!

నేను నీ జతుండగా

నా జత కౌగిళ్లలో బందీకై,

ఓపికతో పరితపిస్తున్నావా "నా ప్రేమ్ పిపాసి!"

                        ******************

ఓ ఇష్ట ప్రియుడా...!

"నడిరేయి చీకువాలు ఆవహించిన నీ అంతరంగమున,

ఉషోదయపు భానుడి కిరణాలు నా పలకరింపు సరిగమలన్నావ్!

పొద్దస్తమాను కార్యకర్మములతో అలసిన నీ దేహామున,

రాతిరికి సేదతీర్చు జాబిలి కౌముది నా ఊసుల లాలిపాటన్నావ్!

ఒంటరిపాటు ఘిరాయించి ఏకాకిలా మిగిలున్న నీ మనువున,

ఆనగానుంటూ దన్నుగా నిలిచింది నా మరువరాని చెలిమన్నావ్!

ఒకే తలంపుతో ప్రయాణం సాగించిన మన గమనమున,

ఇచ్చిపుచ్చుకున్న కానుకలు మనకున్న అభిప్రాయాలు మాత్రమేనన్నావ్!

పరలింగపు పరిమళాలు దరిచెరని నీ నాసికా రంధ్రమున,

గంధముల సువాసనలను వెదజల్లింది నా నెయ్యమన్నావ్!

పరనెయ్యపు అభిరుచులు ఎరుగని నీ జిహ్వ నరమున,

మాధుర్యపు కమ్మదనాలను పంచింది నా ప్రణయమన్నావ్!

నా ఆకారము అభిదర్శించినది,

నే పంపిన సందేశపు అక్షరాలలోనేనన్నావ్!

నా కంఠస్వరమును ఆలకించినది,

ఆ అక్షరాలతో పేర్చిన పదాలలోనేనన్నావ్!

నా ఊహలలో విహరించినది,

ఆ పదాలతో కూర్చిన వాక్యాలలోనేనన్నావ్!

ఈనాటి నీ అక్షరాలలో ఆయువు నింపినది, పదాలకు ప్రాణం పోసినది,

వాక్యాలకు వారధి కట్టినది, కవనాలకు మెరుగులు దిద్ధినది, రచనలకు నాంది పలికినది ఆనాటి నా సహకార సావాసమేనన్నావ్!

మన ఈ ప్రయాణంలో అసత్యాలు నాకు నచ్చవని...

నా ముందర మాత్రమే కాదు, నా వెనుక కూడా ప్రతి క్షణం సత్యముగానే మెలిగానన్నావు.

అది వేరే చెప్పాలా నేస్తం..!

కానీ, ఎవరో ఏదో అన్నంత మాత్రానా,

అన్నాళ్ళ నీపై విశ్వాసం తెంచుకుంటానని నువ్వెలా అనుకున్నావ్?

మెప్పులు, గొప్పలు నాకు పడవని,

వాటిని నా దరికి కూడా చేర్చనీయలేదు

అది నాకు కూడా తెలుసు కదా నేస్తం..!

కానీ, మరెవరో నా శ్రవణమునేదో చేర్చినంత మాత్రానా

మన స్నేహబంధం సన్నగిల్లినదని నువ్వెలా అనుకుంటావు?

ఆనాడు నా పాలిట రక్షణగా భావించిన నీ కరములే,

ఈనాడు కబంధ హస్తాలుగా నెననుకొని దూరమవుతానా!

నేను విడివడిన(నువ్వలా అనుకోవడం) తదుపరి కలిగిన వేదనను,

ఆనాటి నుండి అనుక్షణం

నువు అనుభవిస్తున్న ఆ ఆవేదనను నాకు తెలపాలనున్నా...

మన మధ్యనున్న కొన్ని దుష్టశక్తులు ఆడుతున్న నాటకాలు,

ఎరిగి నువు, ఎరుగక నేను బలవుతూ..

నీ వాణిని నాకు వినిపించలేకున్నా..

ఇదిగో నీ రచనల ద్వారా నేను దానిని వింటున్నా...

నా దుస్థితినీ నీకు చూపించలేకున్నా...

ఇదిగో వాటిలో అర్థాల ద్వారా అది చూస్తున్న...

ఇదేమెరుగని నేను సైతం,

నిన్నాపార్థం చేసుకుంటూ, నీకు మరింతగా దూరమవుతూ

నాకై తన్మయత్వంతో వేచివున్న నీ కనుల కొనల వెంబడి

కొలను గాంచి కన్నీటి సంద్రాన్ని సృష్టించుట నాకు తగుదు!

మనమధ్య అవాకులు చవాకులు సర్వసాధారణమేనన్నావ్!

ఈ మాత్రానికే నిన్ను జీవితాంతం దూరం పెట్టానని అనుకున్నావా?

ఎందుకో తెలీదు, తట్టుకోలేనన్నావ్ ఈ విరహ వేదనని!

తప్పని తెలిసినా, ఆపుకోలేనన్నావ్ నా మదిలో భావనని!!

ఇష్టంలేని నను ఏదోలా పొందుతావనుకొలేదే!

కష్టపెట్టి నను ఇంకేదోలా సాధిస్తావనుకోలేదే!!

కనికట్టుజేసీ నను మరేదోలా నిలుపుకుంటావనుకొలేదే!!!

ఇదంతా నాకు వివరించడానికి, అసలు నీపై నేను ఋణాత్మక ధోరణిని ఏర్పరుచుకొగలనా?

మళ్ళీ లేనిదాన్ని తొలగించడం ఒకటి!

హుమ్.. ఇక నీ ప్రేమ సంగతి నేనేరిగిన తర్వాత కూడా

ఇక దేవుడెందుకు మధ్యలో...

మన చెలిమి బంధం మరలా చిగురించడానికి అది అసలు వాడిపోతెనే కదా...!

నువ్వలా ఆశతో, ఒకింత అత్యాశతో ఎదురుచూడడానికి,

నీ ఆలోచనకు పదునుపెట్టి, నీ కలానికి పనిపట్టి

ఆవేదనతో ఉప్పొంగుతున్న నీ ఆలోచనలను ఓ కవనంలా నా ముందర నిలపాలని నీ ఈ చిన్ని ప్రయత్నం

నా దరికెప్పుడూ చేరుతూనే ఉంది."

- ప్రేమ్ తో

         లేఖ

నా ఈ ప్రేమ లేఖ ✍️✍️✍️

   

                       ********************

అంటూ కావ్య, ప్రేమ్ లెటర్స్ కి ప్రతిస్పందిస్తూ లేఖలా ప్రేమ్ కి లేఖ రాసింది. ప్రేమ్ ని మళ్ళీ మోసం చేయడానికి కాదు, ప్రేమ్ ప్రాణాలు నిలబెట్టడానికి...

మరి ప్రేమ్ ఈ లేఖలతో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా...?

లేఖ ఏమైనట్టు, కీర్తన ద్వారా కావ్యకి ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయా...?

కావ్యకి ఇవి కొత్త చిక్కులు తెచ్చిపెడతాయా...?

ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా,

లేఖ ఇలా చేసిన సంగతి తెలిస్తే ప్రేమ్ తట్టుకోగలడా...?

ప్రేమ్ ప్రేమ ప్రయాణం ఎటువైపు...?

తర్వాతి బాగం

"ప్రేమ లేఖ - 5" లో చూద్దాం.

కావ్య సహాయంతో ప్రేమ్, లేఖల మధ్య ఈ "ప్రేమ లేఖ" మరిన్ని కమ్మటి కావ్యాలతో ఇంకా కొనసాగబోతుంది.

అంతవరకూ ...

పాఠకులందరూ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract