శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

పాఠం

పాఠం

1 min
335


             పాఠం

            శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

             

   1985 వ సంవత్సరం...!

   చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటారే అంత అందమైనది ఆ అమ్మాయి. పెద్ద సంబంధాలకు పోయే తాహతు వారికెలాగూ గనుక... కనీసం ఓ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే గుమస్థాకైనా ఇచ్చి పెళ్లిచేయాలని ఆమె తల్లిదండ్రుల ఆశ. చివారికలాంటి సంబంధం దొరికింది.


  మాకు అమ్మాయి నచ్చిందండీ. ఇక వరకట్నంగా ఏమివ్వదల్చుకున్నారో చెప్తే...అంటూ పళ్లికిలించాడు పిల్లవాడి తండ్రి.


  అమ్మాయి పేరున యాభైవేలున్నాయి బ్యాంకులో. కాదూ కూడదంటే ఇంకో ఐదు వేలు వరకూ సర్దగలను అన్నాడు పిల్ల తండ్రి.


  లాభం లేదు. లక్షకు ఒక పైసా కూడా తగ్గం అంటూ లేచి తమవాళ్ళందర్నీ లేపి తీసుకెళ్లిపోయాడు పిల్లాడి తండ్రి.


  1986 వ సంవత్సరం...!

  ఓ ఆఫీసులో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు వరుడు. అతనికైనా లక్ష రూపాయలే కావాలట. ఆ సంబంధమూ తప్పిపోయింది.


  1987 వచ్చింది...!

  నిరాశతో ఇంటికొచ్చిన భర్త ముఖం చూసి కాయా పండా అనైనా అడగలేకపోయింది పిల్ల తండ్రి.


  భార్య ముఖంలోని ఆతృతని గమనించి..."ఈ ప్యూన్ గా చేసే ఈ ఉద్యోగస్థుడికి కూడా లక్ష రూపాయలే కావాలటే. లోగడ చూసిన గుమస్థాకి ఇంకా పెళ్లికాలేదని తెలిసి...అటునుంచి అటే వెళ్ళాను. ఏ పాట్లో పడి ఆ లక్షా ఇచ్చుకుంటానని చెప్పాను. వాళ్ళకిప్పుడు లక్షన్నర కావాలట. వస్తువుల ధరలు పెరిగాయనో...రూపాయి విలువ తరిగిందనో అన్నారు" అంటూ చెప్తూనే అలసటగా కుర్చీలో కూలబడ్డారు ఆతండ్రి.


  ఆ సంభాషణంతా పక్కగదిలోంచి వింది అమ్మాయి. 

  నాకు కావాలనుకున్న సంబంధం ఎలాగూ చేయలేరు. అలాంటప్పుడు నాకు ఏ సంబంధమైనా ఒక్కటే. కానీ...రెండేళ్ల క్రితం గుమస్థాకి బదులు రికార్డు అసిస్టెంట్ నే చూసినా ఈ తెగువ అప్పుడే చూపి...ఆ గుమస్తా సంబంధం ఖాయపర్చినా ఇప్పుడు ఈ ప్యూన్ చేతకూడా కాదనిపించుకునే ఖర్మ నాకు పట్టేది కాదు..అనుకుంది అమ్మాయి. 


  అలా అనుకున్న నాలుగో నాడు తల్లితండ్రులతో తాననుకున్న విషయం చెప్పేయాలనుకుంది.


   "చూడండి నాన్నా...నన్ను జీవితాంతం పోషించేవాడు కోసం మీరు కాళ్లు నొప్పులోచ్చేలా తిరగాల్సినపని మానేయండి. చిన్నదో పెద్దదో ఉద్యోగం వెతుక్కుంటాను. లేదంటే అప్పడాలో ఆవ పచ్చళ్ళో పెట్టుకుని నా పొట్ట నేను పోషించుకకోగలను. నాకు తగినవాడు దొరికినప్పుడే పెళ్లాడతాను. లేదంటే ఇలాగే ఉండిపోతాను" అంటూ కూతురు చెప్పిన మాటల్ని ఆమె తల్లీతండ్రీ వీస్తుపోయివిన్నారే గానీ...ఆమె మాటల్ని తిరస్కరించనూ లేదు...అలాగని హర్షించనూ లేదు. ఆలోచిస్తూ ఉండిపోయారు...!!*


          ***      ***     ***

   


   


   


   


Rate this content
Log in

Similar telugu story from Inspirational