Venkata Rama Seshu Nandagiri

Comedy

4  

Venkata Rama Seshu Nandagiri

Comedy

పాపం భర్త

పాపం భర్త

1 min
427


పెళ్ళైనకొత్తలో----

భార్య : టైంఅయిపోతోంది. వంటైంది. టిఫిన్ చేస్తున్నాను. మనిద్దరికీ లంచ్ బాక్స్ లు సర్దిపెట్టండి. 

భర్త : నాకలాంటివి తెలియవు. చెప్పకు. కొంచెం ముందుగా లేచి తెమలచ్చు కదా. 

భార్య : . ఇదుగో బాక్స్ , టిఫిన్. .(కోపంగా టేబుల్ మీదపెట్టి వంటింట్లోకి వెళ్లిపోయింది)

భర్త  బాక్స్ తీసుకొని వెళ్లిపోయాడు.

బేబీ పుట్టినతర్వాత----

భర్త : దేవీ పాపేడుస్తోంది. నువ్వు పాపని చూసుకో. నాబాక్స్ సంగతి నేను చూసుకుంటానులే.

భార్య : అంతా రెడీ. బాక్స్ మాత్రం మీరు సర్దుకుంటారుగా.

భర్త : నేచూసుకుంటానన్నానుగా.

ఇద్దరుపిల్లల తర్వాత----

భర్త : దేవీ వంటపని చూసుకో. పిల్లల్ని తయారుచేసి పాపని స్కూల్ బస్ఎక్కించి వస్తాను.

భార్య : సరే. ఈలోపు . మన లంచ్ బాక్స్ లు రెడీగా పెడతాను.

భర్త : నేనొచ్చి సర్దుతాలే. నువ్వు రెడీ అవు.

(అదండీ విషయం. భర్తగారిలో ఆరోగ్యకరమైన మార్పు అవునంటారా! కాదంటారా!!


Rate this content
Log in

Similar telugu story from Comedy