Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఒంటరి ఆత్మ

ఒంటరి ఆత్మ

1 min
263


ఏవండీ! మన టీవీలో దెయ్యం ఉందండీ అని తాపీగా చెప్పింది మృదుల. 


ఇడ్లీని చట్నీలో తడిపి నోట్లో పెట్టుకోబోతున్న శేఖర్ ఒక్క నిమిషం ఆగి ఆమె వైపు చూశాడు.


ఈ 21 వ శతాబ్దంలో కూడా ఏంటిది మృదూ! అని చక్కగా ఇడ్లీలు తిని ఆఫీసుకు వెళ్ళిపోయాడు.


మధ్యాహ్నం మూడు గంటల సమయం..


అత్త కాపురంలో కోడలి కుంపటి సీరియల్ మొదలయ్యింది.. సరిగ్గా ఈ సీరియల్ చూసేటప్పుడు నిన్న టీవీ వెనగ్గా ఎవరో నడిచినట్లు కనిపించింది. 


మృదుల సీరియల్ చూస్తూ ఉంది. షిఫాన్ చీర కట్టుకున్న ఒకావిడ టీవీ వెనుక నుంచి వస్తూ ఉంది.


మృదుల రిమోట్ తో టీవీ ఆఫ్ చేసింది. ఎవ్వరూ కనిపించలేదు. ఇదిగో నువ్వు ఎవరైనా సరే, నేను సీరియల్ చూసేటప్పుడు డిస్ట్రబ్ చేస్తే ఒప్పుకోను. మర్యాదగా వచ్చి పక్కన సోఫాలో కూర్చో . కలిసి సీరియల్ చూద్దాం.. కాసేపు అందులోని క్యారెక్టర్ల తాట తీద్దాం అంది మృదుల.


మెల్లిగా ఆ షిఫాన్ చీర కట్టుకున్న మనిషి మృదుల పక్కనే కూర్చుంది.


ఒక ఒంటరి ఆత్మకు సీరియల్ చూపించిన తృప్తితో మృదుల ఆ రోజు రాత్రికి కూడా ఇడ్లీయే చేసింది..


Rate this content
Log in

Similar telugu story from Abstract