నగర జీవనం
నగర జీవనం


అయినా సంపాదించలేనప్పుడు సిటీకెందుకు రావడం? ఆమె విసుక్కుంది.
నువ్వు వెళదాం అంటేనే కదా వచ్చింది అని మెల్లిగా గొణిగాడతను. సంపాదించే సత్తా ఉందని కోతలు కోసావ్ కదా..అందుకే సరే అన్నాను.
నువ్వు నెల రోజులూ పని చేసి సంపాదించే డబ్బులు ఇంటద్దెకు, సరుకులకే సరిపోతున్నాయి. ఒక సంపాదనతో ఈ సిటీలో గడవాలంటే కష్టం. అందుకే నేనూ పని చేస్తాను అందామె.
ఏం పని వచ్చు నీకు అన్నాడతను. వంట వచ్చు. అంతకు ముందు జిరాక్స్ షాప
ులో పని చేశాను.
పక్క వీధి లేడీస్ హాస్టల్ బయట వంట మనిషి కావాలని బోర్డు పెట్టారు. మెల్లిగా మనమే ఒక జిరాక్స్ షాపు పెట్టుకుందాం అందామె.
ఎలాగూ కాలేజీ దగ్గరే ఉంది కాబట్టి ఆ కాలేజీ పిల్లలు జిరాక్స్ కోసం వస్తారు. షాపు బాగా జరిగితే నువ్వు షాపులో కూర్చో. నేను వంట పని చూసుకుని ఖాళీ ఉన్నప్పుడు షాపుకి వస్తాను అని తన ఐడియాలన్నీ చెప్పిందామె.
సరే. సరే. ముందు కాస్త డబ్బులు కనబడనీ. వెళ్లి హాస్టల్లో పనికి మాట్లాడదాం పద అన్నాడతను.