Dinakar Reddy

Abstract Drama

4.1  

Dinakar Reddy

Abstract Drama

నేనూ, బంటీ & సెలవు రోజు

నేనూ, బంటీ & సెలవు రోజు

1 min
256


నాన్నా రోహిత్! పక్కింటివాళ్ళ బంటీని రెండ్రోజులు చూస్కోరా. వాళ్ళు ఊరెళుతున్నారట అని అమ్మ అంది.


రోహిత్ స్కూల్ కి సెలవులు ఇచ్చారు మెన్నే. ఇంకేం బంటీని తీసుకుని వెళ్లి ఎంచక్కా పార్క్ లో ఆడుకోవచ్చు అనుకున్నాడు..


సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని బయట తిరక్కుండా కట్టిపడేసే శక్తి ఒక్క కోచింగ్ క్లాసులకు మాత్రమే ఉంది. రోహిత్ ఈసారికి కోచింగ్ క్లాసులకు పంపలేదు.


మరుసటి రోజు బంటీని తీసుకుని పార్క్ కి వెళ్ళాడు రోహిత్. బంటీ ముందు రోడ్డు మీద తిరిగుతూ ఉంటే రోహిత్ పక్కింటి వాళ్ళు ఇంటికి తెచ్చుకున్నారు.. బంటీ అని పేరు పెట్టారు.


వీధికుక్కలా ఉన్నప్పుడు వెతికితే గానీ దొరకని ఆహారం దానికి వేళకే దొరకసాగింది. కానీ దాని మనసులో ఎప్పుడూ ఏదో కంగారు. 


అందరూ పడుకున్నప్పుడు బంటీ కి ఎక్కువ ఆలోచనలు వచ్చేవి. వీధి కుక్కలా తిరుగుతూ ఉండడమే మంచిదని అనిపించేది. కానీ మళ్లీ ఆహారం సరిగ్గా దొరకదేమో అని భయం. రాత్రుళ్లు ఉరుములు వచ్చినప్పుడు ఒక్కటే ఉండడం భయం.. ప్రేమగా చూసే యజమానిని వదలాలంటే భయం..


ఈవేళ ఎందుకో బంటీకి వెళ్లిపోవాలనిపించింది. అయినా సమస్య ఎదురైతే మళ్లీ యజమాని ఇంటికి రావొచ్చు.. అసలు బయట ప్రపంచం ఎలా ఉందో చూడకపోతే ఎలా? 


బంటీ పార్క్ దాటి బయటకు వెళుతోంది..రోహిత్ దాన్ని ఆపలేదు.. అతడికి ఏం అర్థమయ్యిందో!


Rate this content
Log in

Similar telugu story from Abstract