SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"మూగ మనసులు - 2"

"మూగ మనసులు - 2"

3 mins
370


మూగ మనసులు-1 కి

కొనసాగింపు ...

మూగ మనసులు-2

అదే రోజు, అంటే ఫిబ్రవరి 14, 2016

తన నోట్ బుక్ కోసం సంతోష్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు రఘు అనే తన స్నేహితుడు.

కానీ తను ఇంటివద్ద లేడని తెలిసి, కాల్ చేస్తాడు. తను అందుబాటులో లేడని, కాల్ వెయిటింగ్ వస్తుంది. దీనితో ఏం చెయ్యాలో అర్ధం కాక సతీష్ కుటుంబం తో ఉన్న చనువు కొద్దీ తానే స్వయంగా సతీస్ బెడ్ రూం లోకి వెళ్ళి బుక్ కోసం వెతుకుతాడు..

ఇంతలో కిటికీలో నుండి వీచే గాలికి టేబుల్ పై ఉన్న వేరొక బుక్ తెరుచుకుంటుంది..

అప్రయత్నంగా రఘు చూపు అటువైపు పడింది..

చూస్తుంటే అదొక డైరీలా వుంది..

ఆ తెరుచుకున్న పేజీ నీ చూస్తుంటే.. అది అప్పుడే రాసినట్టు గా వుంది. ఇంకా సిరా కూడా ఆరినట్టు లేదు.

అందులో ప్రేమ కి సంబంధించి సతీష్ రాసుకున్న కొన్ని పదాలు చూసి ఆశ్చర్యపోతూ... ఆ పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకుని చదవసాగాడు రఘు!.

ఎంతో భావోద్వేగంతో కూడిన ఆ వాక్యాలు చదువుతుంటే రఘుకి తెలియకుండానే తన కళ్ళు చెమ్మగిల్లాయి..

ఇంతలో "పుస్తకం దొరికిందా... రఘు!!" అనే సతీష్ వాళ్ళమ్మ గారి వాయిస్ విని,

(తడిచిన తన కనులను తుడుచుకుంటూ...)

"హా.. దొరికింది ఆంటీ!" అని బదులు ఇచ్చి, తన చేతిలో ఉన్న ఆ డైరీ మూసి, తనతో పాటే ఆ డైరీని వెంటబెట్టుకుని అక్కడ నుండి హడావిడిగా వెళ్ళిపోయాడు రఘు.

ఇక ఇంటికి వెళ్ళిన రఘు, ఆ డైరీ మొదటి పేజీ నుండి చదవడం ప్రారంభించసాగాడు.

                       ************

ఫిబ్రవరి 14, 2014 వాలంటైన్స్ డే...

ఈ రోజు ప్రేమికుల రోజు కావడం వల్ల నా స్నేహితులంతా వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని ఇంప్రెస్స్ చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు...

అసలు ఈ రోజంటేనే వాళ్ళకి ఓ ప్రత్యేకం....

నాకు మాత్రం ఈ రోజంతా బోర్ కొడుతూనే వుంది.

ఎవరిని కలుద్దామన్నా, అంతా బిజీ బిజీ ...

ఎవరికి కాల్ చేసినా నో రెస్పాన్స్...

ఎప్పుడూ ఫ్రెండ్స్ ని వెంట పెట్టుకుని తిరిగే నేను, ఈరోజు పక్కన మనిషి లేకపోయే సరికి బాగా విసుగు పుట్టింది.

చూస్తుండగానే చీకటి పడింది..

ఇక ఈ రోజు శుక్రవారం కావడంతో కొంచెం ప్రశాంతత కోసం ఇంటి దగ్గర్లో వున్న గుడికి వెళ్ళాను.

లోపల బాగా రద్దీ గా ఉండడంతో గుడి బయట వరుసలో దైవ దర్శనం కోసం వేచివున్నాను.

ఇంతలోనే కరెంట్ కూడా పోవడంతో విసుగుతో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ..

పూజ ఆగిపోవడంతో ఒక్కసారిగా ఆ గుడి ప్రాంగణంలో నిశబ్దం అలుముకుంది..

ఆ నిశబ్ధంలో.. ఎవరోవో! కాళ్ళ పట్టీల నుండి వచ్చే మువ్వల అలికిడి నా గుండెల్లో అలజడి రేపి చూపును అటు వైపు తిప్పింది.

బయట నుండి వీస్తున్న చల్లటి గాలికి ఆరిపోబోతున్న దీపానికి తన చేయి రక్షణగా నిలిచింది.

"తెల్లటి ఆకాశంలో నల్లటి చంద్రుడు వలె వున్న ఆమె అరచేతిలో గల పుట్టుమచ్చ..

రాతి బండలపై నుండి జాలువారుతున్న నీటిధారల వలె వున్న ఆమె నల్లటి కురులు "

ఆ దీపపు వెలుగు లో నా కంటిని కనువిందు చేశాయి.

"ఆకుపచ్చని పరికిణీ లో , గోల్డెన్ సీక్వెన్స్ బోర్డర్ ని జత చేసిన పింక్ కలర్ ఓణీ ఆ పిల్ల గాలికి అటు ఇటు ఊగుతూ హొయలొలుకుతుంది."

తన పాదాల కదలికల నిలుపుదలతో

అప్పటివరకు ఆమె నున్నటి పాదాలపై అలికిడి చేసిన మువ్వలు కాస్తా, ఒక్కసారిగా ఆగిపోయి నిశ్చల శిల్పాలుగా మారిపోయాయి.

మరొకవైపు,

మబ్బులు చందమామను దాచినట్లుగా పైనుండి పడుతున్న ఆ పూల దండలు, తెరలా అల్లుకుని ఆమె రూపాన్ని నా కంటికి చేరకుండా దాచేస్తున్నాయి.

ఇంతలో కరెంట్ రావడం, ఫ్యాన్ గాలికి ఆ తెర ఒక్కసారిగా తెగి అడ్డుతొలగడం తో

ఆమెను చూడాలనుకున్న నాకు...

"స్పందన.. ఎక్కడున్నావ్??"

అంటూ వచ్చిన పిలుపుకి

ప్రతిస్పందన గా ...

"వస్తున్నా..??

అంటూ రెప్ప పాటు కాలంలో వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయింది.

ఆమెను వెనక నుండి తదేకంగా అలానే చూస్తున్న నాకు

ఆరడుగుల పట్టుచీరలను ధరించిన సాంప్రదాయ మగువల మధ్యలో,

ఆ పరికిణీ ఓణీలో తను మాత్రం సాంప్రదాయానికే సంస్కారం తెలిపే పదహారణాల అచ్చతెలుగు ఆడపిల్లలా అనిపించింది.

నా కనులకు కనిపించింది.

అమ్మాయిలు, అబ్బాయిలని తేడా లేకుండా ఈ రోజందరూ వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ పబ్లు, పార్కులని తిరుగుతుంటే, తను మాత్రం అసలు అవేం పట్టనట్టు గుడికి రావడం చూస్తుంటే... ఈ కాలపు కపటి ప్రేమల జోలికి పోనీ స్వచ్ఛమైన పెంపకంలో పెరిగిన అమ్మాయేమోననిపించింది.

పైగా తన కట్టు బొట్టులలో పైకి పరిమళించే ఆ పద్ధతి, నడవడిక నన్ను మరింత ముగ్ధుడిని చేశాయి.

మన వూరిలో ఇలాంటి అమ్మాయిలు ఇంకా వున్నారా..?? అని నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఆశ్చర్యపోయాను !!!

ఆ అమ్మాయి కనిపించినట్లే కనిపించి అంతలోనే అదృశ్యమవడంతో పూజ పూర్తికాగానే తిన్నగా ఇంటికి వచ్చేసాను..

ఎందుకో తెలిదు ...  

అసలు ఈ కాలపు అమ్మాయిలంటేనే అపారమైన అసహ్యం పెంచుకున్న నాకు, ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చిన్న అణువంత గౌరవం మదిలో నాటుకుంది.

బహుశా ఇన్నాళ్లుగా నా ఊహల్లో ఒకమ్మాయంటే ఎలాంటి లక్షణాలుండాలని కోరుకున్నానో.. !! అలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయి మొదటిసారి ఎదురుపడడం వల్ల కాబోలు..

కాదు..! కాదు...!! ఎదురుపడేంత లోపే అదృశ్యమవడం వల్ల కాబోలు...

నా మనసు ఆ గుడి ప్రాంగణంలోనే ఆగిపోయింది.

                     

                              ***************

వీడెంటి...

"అసలు ఎప్పుడూ అమ్మాయంటేనే ఇష్టపడేవాడు కాదు!

పైగా అమ్మాయిల గురించి మేమరమైన మాట్లాడితే తిట్టేవాడు, కస్సుబుస్సలాడేవాడు !

అలాంటిది వీడేంటి!!

ఈ డైరీ ఏంటి!!

అందులో ఒక అమ్మాయి గురించి రాయడమేంటి!!,

ఇదంతా ఇంత క్లోజ్ గా ఉండే నాకు కూడా ఎప్పుడూ చెప్పలేదే,"

ఇలా ఎన్నో సందేహాలతో ఆశ్చర్యపోతూ, వాటిని నివృత్తి చేసుకోవడానికి తర్వాత పేజీని తిప్పాడు రఘు"

ఆ తిప్పిన పేజీలో విషయం గురించి మీరూ తెలుసుకోవాలంటే "మూగమనసులు - 3" చదవాల్సిందే

To be continued.... in part 3

                              **********

రచన:

సత్య పవన్✍️



Rate this content
Log in

Similar telugu story from Classics