Dinakar Reddy

Abstract Drama

4.5  

Dinakar Reddy

Abstract Drama

లాక్డౌన్ లీవు

లాక్డౌన్ లీవు

1 min
266


సార్! రెండు రోజులు లీవు ఇవ్వండి సార్. అమ్మకు కరోనా సింప్టమ్స్ ఉన్నాయి. నేను దగ్గరుండి చూసుకోవాలి. 

విధేయ బేలగా అడిగింది.


ఆనంద్ ఏదో వ్రాస్తూ ఆగాడు. వెళ్లిపోండి. అందరూ వెళ్లిపోండి. కోవిడ్ లాక్ డౌన్ అని చెప్పినప్పటినుంచీ సీనియర్ డాక్టర్స్ రావడం తగ్గించేసారు. ఇక నర్సులు కూడా ఒక్కొకరూ ఇలా కారణాలు చెప్పి వెళ్లిపోతే నేను హాస్పిటల్ ఎలా నడపాలి అని చిరాకుపడ్డాడు.


విధేయ లోలోపలే బాధపడి అక్కడ నుంచి వచ్చేసింది. లెక్కలేనంత మంది రోగులు. వారిలో కోవిడ్ బారిన పడిన వాళ్ళని వేరే వార్డులో ఉంచి అక్కడికీ ఇక్కడికీ తిరగడం నర్సులకు పెద్ద పరీక్ష.


ఎక్కడ మామూలు రోగులకు తమవల్ల కోవిడ్ వ్యాప్తి చెందుతుందేమో అనే అనుమానం ఒక వైపు. కళ్ళ ముందే ప్రాణం విడుస్తున్న రోగులను చూస్తూ ఇంత రిస్క్ తీసుకుని ఈ డ్యూటీ చెయ్యాలా అనే మీమాంస మరో వైపు.

నర్సులు, ఆస్పత్రి ఉద్యోగులు, డాక్టర్లు అందరూ ఈ భయాల్ని అనుభవిస్తున్నారు.


మీరేమీ భయపడకండి. తొందర్లో వ్యాక్సిన్ వచ్చేస్తుంది. మీరు క్షేమంగా ఇంటికి వెళతారు అని విధేయ ఒక పెద్దావిడతో చెబుతోంది.


ఆనంద్ అటు వైపుగా వెళుతూ బాధ్యతగా తన కర్తవ్యం నిర్వర్తిస్తున్న విధేయను చూసాడు. తను చూపించిన విసుగు బాధపెట్టాలని చేసింది కాదు. అది పని ఒత్తిడి. తన ప్రవర్తనకు సిగ్గుపడి జరిగిన విషయాన్ని సరిచేయాలనుకున్నాడు.


మధ్యాహ్నం క్యాంటీన్లో విధేయ భోజనం చేస్తూ ఉంది. ఆనంద్ అక్కడికి వచ్చాడు. 


రేపు ఉదయం మందులు తెచ్చే బండి ఒకటి మీ ఊరి మీదుగానే వస్తోంది అన్నాడు ఆనంద్.

విధేయ లేచి నిలబడింది.


మీ అమ్మగారిని అందులో ఇక్కడికి రమ్మని చెప్పు. ఇక్కడ తనని చూసుకోవడం పర్లేదు కదా అనడిగాడు అతను.


సార్. చాలా థాంక్స్ సార్ అంటూ విధేయ కృతజ్ఞతలు తెలిపింది. 

ఆనంద్ ముఖంలో ఏ భావమూ కనిపించనివ్వకుండా బయటికి వెళ్ళాడు.


రద్దీగా ఉన్న ఆసుపత్రి ప్రాంగణం చూస్తూ నిర్లిప్తంగా నవ్వాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract