Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

క్యాష్ అలర్జీ

క్యాష్ అలర్జీ

1 min
51


ఎప్పుడూ డబ్బు మొత్తం నీ చుట్టూ ఉంటుంది.

   నీకేంట్రా బ్యాంకులో క్యాషియర్ వి. డబ్బులు లెక్క పెడుతూ జీతం సంపాదిస్తావ్ అన్నాడు నా స్నేహితుడు గిరి.

   డబ్బులు లెక్క పెట్టడం కూడా రిస్కు ఉన్న పనేరా బాబూ.

   ఏమిటో సెలవివ్వండి సారు అన్నాడు గిరి వ్యంగ్యంగా.

   శుభ్రంగా లేని కరెన్సీ నోట్లను లెక్క పెట్టే వారు అలర్జీల బారిన పడే అవకాశం ఉంది.

   ఎంత కౌంటింగ్ మెషీన్లు ఉన్నా మేం చేత్తో చాలా సార్లు క్యాష్ లెక్క పెడుతుంటామురా రోజూ.

   కౌంటింగ్ మెషీన్లు వాడుతున్నా నోట్ల నుండి వచ్చే దుమ్ము ఇంకా బ్యాక్టీరియాను ఆపలేం కదా.

     ఇప్పుడు చెప్పు రిస్క్ ఉందా లేదా.

గిరి సైలెంట్ అయిపోయాడు నా ఆర్గుమెంట్ ని ఒప్పుకుంటూ.

   అందుకేరా అనేది నోట్ల మీద వ్రాయకండి అని.

మొన్న పెద్ద నోట్లు రద్దయినప్పుడు చుక్కలు కనిపించాయి బ్యాంకు వాళ్ళకి డబ్బులు లెక్కపెడుతూ

అంటూ నా వాదన పూర్తి చేశాను.


Rate this content
Log in

Similar telugu story from Drama