Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కుటుంబం అన్నాక..

కుటుంబం అన్నాక..

1 min
368


కుటుంబం అన్నాక సర్దుకుపోవాలి రుక్మిణమ్మ అంటూ ఉంది.


అంటే ఇప్పుడు నేను తమిళ్ సీరియల్లో హీరోయిన్లా పగలు పని చేస్తూ, రాత్రి ఇడ్లీలు తింటూ ధర్మం, దయ ఇలాంటి డైలాగులు చెప్పాలా? అంది శ్రావ్య.


నీ మొహం. నేనేమైనా నా కోసం చేయమన్నానా? నీ మొగుడు, నీ సంసారం కోసం ఉద్యోగం చేసుకో. అల్లుడు గారు చెప్పేది కూడా అందరి కోసం కాదటే అని రైస్ కుక్కర్ ఆన్ చేసింది రుక్మిణమ్మ.


అమ్మా. నేను జాబ్ చేస్తే జీతం ఎవ్వరికీ ఇవ్వను. ఆయనకైతే అసలివ్వను. నా జీతం నన్నే ఖర్చు పెట్టుకోనిస్తే నే నేను ఉద్యోగానికి వెళతాను అంది శ్రావ్య.


అంటే ఇల్లూ, వాకిలీ పట్టించుకోకుండా ఉంటావా అందామె.


అమ్మా.. నేను ఇంటిని పట్టించుకోను అని చెప్పడం లేదు. పట్టించుకుంటాను. కానీ ఖర్చు నేనే పెడతాను. మీ అల్లుడి గారికి డబ్బులు ఇవ్వను. దేని మీద ఎంత ఖర్చు పెట్టాలో నాకే బాగా తెల్సు అంటున్నాను.


ఏంటో నీ వ్యవహారం. సర్లే సాయంత్రం వెళ్ళేటప్పుడు అల్లుడి గారికి ఇష్టమైన స్వీట్ చేసిస్తాను. తీసికెళ్ళి ఇవ్వు అంది రుక్మిణమ్మ. 


అంతేలే. కూతురి కోసం ఉప్మా చేయమన్నా చేయవు. అల్లుడికి స్పెషల్ స్వీట్లు. కాల మహిమ అంది శ్రావ్య.


పోన్లేవే.అలగకు. నీ జీతంలో కొంత నాకు కూడా ఇస్తున్నావని చెప్తాలే అందామె.


ఎంత త్యాగశీలివమ్మా అంటూ పాటందుకుంది శ్రావ్య.



Rate this content
Log in

Similar telugu story from Abstract