SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"కథలో రాజకుమారి-7"

"కథలో రాజకుమారి-7"

5 mins
691


"కథలో రాజకుమారి-6" కి

కొనసాగింపు ..

"కథలో రాజకుమారి-7"

రోజులు గడుస్తున్నాయి. ఆఫర్ లెటర్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ల నిరీక్షణ ఫలించింది. ఇద్దరిని వీలైనంత తొందర్లో జాబ్ లోకి వచ్చి జాయిన్ అవ్వల్సిందిగా వాళ్ళు సెలెక్ట్ అయినా కంపనీ ల నుండి వాళ్ళిద్దరికీ ఆఫర్ లెటర్స్ వచ్చాయి.

కొన్ని రోజుల క్రితం వాళ్ల ముగ్గురి మధ్య జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఆ ఆఫర్ లెటర్ కి ఏం రిప్లై ఇవ్వాలో తెలియక పవన్. తనతో పాటే పవన్ కి వచ్చిన ఆఫర్ లెటర్ ని పవన్ ఆక్సెప్ట్ చేస్తే ఇక వీళ్ళ పెళ్లి విషయంలో వాళ్ల పెద్దవాళ్ళు ఏం ఆలోచించకుండా నిర్ణయం తీసేసుకుంటారనే ఆందోళన పల్లవిలో...

ఇద్దరూ ఆ ఆఫర్ లెటర్స్ గురించి ఇంట్లో చెప్పలేకపోయారు.

కొన్ని రోజుల తర్వాత పల్లవి వాళ్ళమ్మ గారికి వాళ్ల నాన్న (పల్లవి తాతయ్య) కాల్ చేసి

"అమ్మా... నా మనవడికి అదే నీ మేనల్లుడికి మంచి mnc కంపెనీలో జాబ్ వచ్చిందంట!

ఆ కంపనీ పేరు...

అదేనమ్మ నా మనవరాల(పల్లవి)కి కూడా అదే కంపెనీలో జాబ్ వచ్చినట్టు చెప్పాడు వీడు." అంటూ చెప్పాడు.

"ఎంత మంచి వార్త చెప్పారు నాన్న..

ఎందుకు పనికి రాడు, పనికి రాడని, వాడిని ఆడిపోసుకున్నారు కొంతమంది.. ఈ దెబ్బతో వాళ్ల అందరి నోళ్ళు మూయించాడు.." అంటూ పల్లవి తండ్రికి వినిపించేలా గట్టిగానే మాట్లాడింది పల్లవి తల్లి ఆ ఫోన్లో వాళ్ల నాన్నతో.

ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేస్తాను.

"నీ అన్నా వదినా, పల్లవి ని వాళ్ల కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. నాకు కూడా ఉందని నీకూ తెలుసు కదా అమ్మ!

అల్లుడి గారితో ఒకసారి మాట్లాడొచ్చు కదామ్మ!" అంటూ ఆయన అనడంతో...

అలా మెల్లగా ఫోన్ మాట్లాడుతూ బయటకి వెళ్లిపోయింది పల్లవి తల్లి.

"నాకు మాత్రం ఉండదా నాన్న..! నా పుట్టింటికే నా కూతురిని కోడలిగా పంపితే సుఖపడుతందని. కానీ, కూతురి విషయంలో అతనిదే పెత్తనమంటూ తనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయినా మొన్నటి వరకూ వాడికిచ్చి చేయమని అడగడానికి ఒక్క కారణం కూడా లేదు కాబట్టి నా దగ్గర మౌనంగా ఉండాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడీ కారణం చాలు నాన్న. మిగతాదంతా నేను చూసుకుంటాను" అంటూ ఫోన్ పెట్టీసి లోపలికి వచ్చింది పల్లవి తల్లి.

గదిలో టీవీ చూస్తున్న పల్లవి వాళ్ల నాన్న కి వినపడేటట్టు పల్లవి దగ్గరకి వచ్చి

"నీకెప్పుడో క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందన్నావ్..!, ఇంకా ఆఫర్ లెటర్ రాలేదా..?" అంటూ పల్లవిని ప్రశ్నించింది పల్లవి తల్లి.

పల్లవి సమాధానం చెప్పేలోపు ..

"ఇదిగో ఇప్పుడే తాతయ్య ఫోన్ చేశారు..

రవి బావ కి జాబ్ వచ్చిందట..

(అప్పటికే రవికి జాబ్ వచ్చిన సంగతి పల్లవికి రవి ద్వారానే తెలుసు, కానీ ఎలా వచ్చిందో తెలియదు. తనకేం తెలియనట్టు మౌనంగానే ఉంది.)

అదేదో నీకొచ్చిన కంపెనీలోనే అంట!

మరి అదే కంపెనీలో.. ఎప్పుడో జాబ్ వచ్చిందన్న నీకు, ఇప్పటి వరకూ ఇంకా ఆఫర్ లెటర్ రాకపోవడమేంటి?" అంటూ ప్రశ్నించింది పల్లవి తల్లి పల్లవి.

ఇదంతా వింటున్న పల్లవి తండ్రి కూడా పల్లవి వైపు ఆశ్చర్యంగా చూడడంతో...

వాళ్లిద్దరి వంక అలానే చూస్తూ..

"ఆఫర్ లెటర్ ఎప్పుడో వచ్చిందని, ఇంకా దాని మీద ఏం డెసిషన్ తీసుకోలేదని" అసలు విషయం వివరించింది పల్లవి.

"అంటే వచ్చిన విషయం కూడా మాకు చెప్పకుండా దాచావ్ అన్న మాట అంటూ కోప్పడింది" తల్లి

"కాసేపు నువ్వుండవే,

ఏమైందమ్మా?

ఈ జాబ్ చేయడం ఇష్టం లేదా ఏంటి?

లేక ఇంకేదైనా ట్రై చేస్తున్నావా?

బావతో పెళ్లి అన్నా కూడా జాబ్ చేస్తానని నన్ను ఒప్పించింది నువ్వే కదా!

మరిప్పుడు ఇలా..జాబ్ వచ్చిన విషయం మాకు కూడా చెప్పలేదు?" అంటూ అడిగాడు పల్లవి తండ్రి కూడా.

"అదేం లేదు నాన్న...!

ఆ జాబ్ చేయడం ఇష్టమే(తనకి జాబ్ వచ్చిన కంపెనీలోనే రవి కి కూడా జాబ్ వచ్చిందన్న సంతోషంతో తన మనసు మార్చుకుని) వెంటనే కాకుండా కొంచెం టైం తీసుకొని చెప్దామని అగాను" అంటూ కవర్ చేసింది.

"మరి బావ సంగతేంటి, వాడికి కూడా నీకొచ్చినప్పుడే వచ్చింది కదా? తనకి ఆఫర్ లెటర్ రాలేదా మరి?" అంటూ పవన్ గురించి పల్లవిని అడిగాడు ఆయన.

"ఏమో డాడీ.. నాకు తన గురించి తెలియదు" అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది పల్లవి.

"ఏముంది... వచ్చుండదు. మన పిల్లకి వచ్చి తనకి రాకపోతే వాళ్ల నాన్న తిడతాడని భయపడో లేక నా కూతురి మీద ఆశతోనో జాబ్ వచ్చినట్టు అబద్ధం చెప్పుంటాడు. నా కూతురి లాగా, నా మేనల్లుడి లాగా అందరికీ కష్టపడే తత్వం ఉండాలిగా. పొద్దున్న లేస్తే గాలి తిరుగుళ్ళు తిరిగేవాడికి ఉద్యోగం రావడమే కష్టం. హమ్ అలాంటోడికి నా కూతురిని ఇచ్చి దాని గొంతు కొయ్యాలని చూసారు, తను మీ కన్న కూతురని కూడా చూడకుండా..."

అంటూ రవి పై ఇష్టాన్ని, పవన్ పై అయిష్టాన్ని బయట పెట్టింది పల్లవి తల్లి.

"ఇక చాల్ల్ ఆపు నీ దెప్పు పొడుపు మాటలు. వాడిని అనే అర్హత నీకు లేదు. అసలేం జరిగిందో ఏంటో...?

ఏం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడకు.." అంటూ తన నోరు మూయించే ప్రయత్నం చేశాడు.

"నాకెందుకు అర్హత లేదు. వాడు మీ మేనల్లుడు అయితే మీకెక్కువ. నా మేనల్లుడు నాకెక్కువ. వాడేమైన దేవుడా ?

"అయినా అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడని రవి గురించి మీరెన్ని సార్లు నా దగ్గర అనలేదు. కానీ, నేనెప్పుడైనా ఎదురుతిరిగానా... ?

ఈ ఒక్కసారి, అది కూడా ఉన్న మాటే గా అన్నది. మీకు అంతలా పొడుచుకొచ్చిసేంది. ప్రయోజకుడు కాదు, ప్రయోజకుడు కాదు.. అంటూ మన పిల్లని రవికిచ్చి పెళ్లి చేసి నా పుట్టింటికి కోడలని చేయడానికి ఇష్టపడని మీరు... మరిప్పుడు ఏ ఉద్దేశ్యంతో పవన్ కిచ్చి చేద్దామనుకుంటున్నారు" అంటూ మొగుడితో వాదన మొదలు పెట్టింది పల్లవి తల్లి.

వీళ్ళ వాదన, ఒకరిపైఒకరి పై చేయితో మరింత తీవ్రతగా పెరిగింది. గట్టిగా ఒకరిపై ఒకరి అర్చుకునే వరకూ వెళ్లింది. వాళ్ల గొడవంతా ఇంటి పక్కనే ఉన్న పవన్, పవన్ వాళ్ల అమ్మనాన్నకు వినిపించి, ఏమైందొనన్న కంగారులో వీళ్లంతా అక్కడికి చేరుకున్నారు.

పల్లవి తల్లితండ్రుల గొడవల సంభాషణలో అసలు ఆ గొడవకి కారణం అర్థం చేసుకోగలిగారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు.

ఆ గొడవను సద్దుమణిగించి, అసలు నీకు ఆఫర్ లెటర్ ఎందుకు రాలేదని పవన్ ని ప్రశ్నించాడు పవన్ తండ్రి వాళ్ళందరి ముందే. అక్కడే పల్లవి కూడా ఉంది.

అది... అది... అంటూ తడబడుతూ నేల చూపులు చూస్తున్నాడు పవన్.

నేనడిగిందానికి సమాధానం చెప్పు! అంటూ గట్టిగా గదిమాడు పవన్ తండ్రి.

దాంతో బిత్తర పోయిన పవన్..

"అది .. అది.. జాబ్ వచ్చింది నాన్న గారు. కానీ, జాబ్ చేసే ఉద్దేశ్యం లేదు. ఏదైనా వ్యాపారం పెడదామని, నేనే దాన్ని రిజెక్ట్ చేశాను" అంటూ బడులిస్తాడు పవన్.

"ఇప్పుడే ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇలాంటి వాడికి నా కూతురిని ఇచ్చి కట్టబెడదాం అనుకుంటున్నారు. రేపు పెళ్ళైయ్యాక దాని జీవితం ఏంటో?"

అంటూ మధ్యలో కలుగజేసుకుంటుంది పల్లవి తల్లి.

"నువు కాసేపు నోరు మూస్తావా?" అంటూ దానికి అడ్డు పడతాడు పల్లవి తండ్రి.

"ఇప్పటివరకూ అలా మూసుకునుండే తప్పు చేశాను. ఇక ఇదే తప్పును పదే పదే చేయడం నాకిష్టం లేదు. అయినా నేనెందుకు నోరు మూయాలి. నేనన్న దాంట్లో తప్పేం ఉంది. ఉన్న మాటే గా అన్నాను" అంటూ రెట్టించింది పల్లవి తల్లి.

అప్పటికే కోపంతో ఊగిపోతున్న పవన్ తండ్రి ..

"వ్యాపారం గీపరం అంటూ ఇపుడు చెప్తున్నవా?

పైగా దాని కోసం, వచ్చిన గొప్ప అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకుంటావా?

ఇంత చేసి, మాకేం చెప్పకుండా ఇప్పుడు ఇంత గొడవ అయ్యాకా చెప్తావా?" అంటూ

అంటూ పవన్ చెంప చెల్లు మనిపించాడు.

"ఏంటి బావా నువ్వు..! అసలేం జరిగిందో తెలియకుండా వాడి మీద చెయ్యి చేసుకుంటావ్? అయినా అది అలాగే వాగుతుంది. దానికేం తెలీదు. ఏమరెమనుకున్నా నా ఇంటికి కాబోయే అల్లుడు నా మేనల్లుడే " అంటూ అడ్డుపడతాడు పల్లవి తండ్రి.

"ఏంటి నాది వాగుడా...? నాకేం తెలీదా?

నాకు కూడా దాని(పల్లవి) పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కుంది.

అయినా నా కూతురికి ఒక మంచి జాబ్ ఉన్న వాడినే చేసి, దాని సుఖాన్ని కోరుకునే ఆశా నాకు ఉంటుందిగా. అందుకే, జాబ్ ఉన్న నా మేనల్లుడు రవికిచ్చి పల్లవిని చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎవరికి పడితే వాళ్ళకి చేయడానికి, మీ ఒక్కరికే దాని మీద అధికారం లేదు." అంటూ రెట్టించింది పల్లవి తల్లి

తన భార్య మాటలకు సహనం కోల్పోయిన పల్లవి తండ్రి

"ఏం కూసావే .." అంటూ తన భార్యపై చెయ్యి చేసుకోబోతాడు.

దానికి అడ్డు తగిలిన పవన్ తండ్రి..

"తను అన్న మాటలో తప్పేం ఉంది చెప్పు..?

అయినా నువ్వేదో ఆశా పడుతున్నావ్ అని తప్పా..!

ఇలాంటి వెదవకిచ్చి ఆ బంగారు తల్లి(పల్లవి) జీవితాన్ని నాశనం చేస్తున్నానేమోనని నా మనసుకి కూడా అనిపిస్తుంది.

కనీసం మనకి కూడా చెప్పకుండా వీడికి వీడు సొంతంగా తీసుకునే ఇలాంటి అనాలోచిత, క్షణికావేశ నిర్ణయాలతో ఎంత వరకూ బాగుపడతాడో అదీ చూద్దాం...(పవన్ వంక చూస్తూ)

చూడమ్మా..! చెల్లెమ్మా(పల్లవి తల్లిని ఉద్దేశించి) నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంతో మాకేం అభ్యంతరం లేదు. ఓ మంచి రోజు చూసుకుని ఒకసారి అన్నయ్యగారితో (రవి వాళ్ల నాన్న) కానీ, బాబాయ్ గారితో(రవి వాళ్ల తాతయ్య) గారితో నేనే దీని గురించి మాట్లాడతాను." అంటూ అక్కడి నుండి వచ్చేశాడు.

తనతో మాటే పవన్, పవన్ తల్లి కూడా...

అక్కడ జరిగిన సంఘటనతో పల్లవి ఉబ్బితబ్బిబ్బయ్యింది. తను కోరుకున్నది జరగడంతో తన ఆనందానికి అవధుల్లేవు.

తిట్టడమే కానీ, ఇదివరెక్కెన్నడూ తన పై చెయ్యి చేసుకోని తన తండ్రి ఆ క్షణం తనని అలా మొదటి సాటి కొట్టినందుకు పవన్ కళ్ళు చెమర్చాయి.

                             ****************

పల్లవి కి తెలియకుండా తెర వెనుక రవి ఆడిన నాటకాలన్నీ పల్లవికి తెలుస్తాయా?

రవి గురించి తెలిసి కూడా అంతగా ప్రేమించిన తన మరదలు పల్లవిని తన గురించి ఎలా వదులుకోవాలనుకున్నాడు.

అసలు రవి గురించే పవన్ జాబ్ వదులుకున్నాడా? లేక మరింకేధైనా కారణం కూడా ఉందా?

పల్లవి కోసం పవన్ చేసిన త్యాగాలన్నీ పల్లవికి అసలెప్పటికి తెలుస్తాయో?, ఎలా తెలుస్తాయో? అసలు తెలుస్తాయో లేదో?

పల్లవి కోరుకున్నట్టే తన బావ రవితో తన పెళ్లి జరుగుతుందా?

అప్పటికే ప్రతిసారీ తనంటే చెడు అభిప్రాయం ఉన్న పవన్ తండ్రికి ఈ ఘటనతో మరింతగా దూరం అవుతాడా?

చూద్దాం ఏం జరగబోతుందో?

తర్వాతి భాగం

కథలో రాజకుమారి-8 లో తెలుసుకుందాం

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు హృదయ పూర్వక ధన్యవాదములు.

రచన: సత్య పవన్✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract