SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"కథలో రాజకుమారి-5"

"కథలో రాజకుమారి-5"

6 mins
621


"కథలో రాజకుమారి-4" కి

కొనసాగింపు,

"కథలో రాజకుమారి-5"

కొన్ని రోజులు గడిచాయి.

పవన్ మాత్రం ఇంకా పల్లవి గురించే ఆలోచిస్తూ తన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇంకా తన ధ్యాసలోనే గడుపుతున్నాడు. అంత జరిగాక పల్లవి ఆ ఆటో వాడితో కాంటాక్ట్ అవ్వడం మానేసినట్టు భావించిన పవన్ కి తన అంచనా తప్పని తెలుస్తుంది. పల్లవి ఇంకా వాడితోనే కాంటాక్ట్ లోనే ఉన్నట్టు ఒకరోజు మళ్ళీ తన మొబైల్ హ్యక్ చేయడం ద్వారా తెలుసుకోగలిగాడు.

వాడితో ఎందుకంటూ పవన్ మళ్ళీ పల్లవి తో వారించాడు. దానికి పల్లవి అలాంటిదేం లేదని ముందు అబద్ధం చెప్పినా, పవన్ ప్రూఫ్ చూపించడం తో తను నిజం అంగీకరించక తప్పలేదు. ఇలా ఒక సారి కాదు, రెండు సార్లు కాదు, పల్లవి వాడితో కాంటాక్ట్ లో లేదని చెప్పడం, మళ్ళీ దొరికిపోవడం, దాన్ని ఏదోలా కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించడం. ఇలా పలు మార్లు జరగడంతో ఇక పల్లవి మారదని, తనకి చేస్తున్న మేలంతా పల్లవి ఇంకేప్పటికి అర్థం చేసుకోలేదని, అదంతా వృధా అని భావించి, పల్లవిని తన దారిన తనని వదిలేశాడు పవన్.

                           ****************

అలా ఇద్దరూ దాదాపు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం పూర్తిచేసి నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టారు. ఆ సంవత్సరం చదువు పూర్తయ్యాక ఇద్దరికీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు పవన్ తల్లి దండ్రులు, వాళ్ల మావయ్య (పల్లవి తండ్రి).

పల్లవి తల్లికి కానీ, పల్లవికి కానీ అది ఏ మాత్రం ఇష్టం లేదు. అదే విషయం పల్లవి తండ్రికి చెప్పే ప్రయత్నం చేసింది పల్లవి తల్లి. కానీ, దానికి ఏ మాత్రం ఒప్పుకోని పల్లవి తండ్రి నీకేం తెలియదు, నేను చెప్పినట్టు నా మేనల్లుడితోనే నా కూతురి పెళ్ళంటూ తన భార్యని చెడా మడా తిడుతూ కోపోద్రిక్తుడైయ్యాడు. దాంతో పల్లవి కూడా తన తండ్రి మాటకు ఎదురు చెప్పలేక, తనకి పవన్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే తన అభిప్రాయాన్ని వెల్లడించలేకపోయింది.

అలా రోజులు గడుస్తున్నాయి. కానీ, పల్లవి మనసుకి ఏ మాత్రం పవన్ ని చేసుకోవడం ఇష్టం లేదు. దీన్ని ఎలా సాల్వ్ చెయ్యాలో పల్లవికి పాలుపోక, అప్పటికే తను ప్రేమిస్తున్న రవి (అదే పల్లవి బావ, వాళ్ళమ్మ తరుపు) ని సలహా అడుగుతుంది.

”రోజూ ఇలా బాధ పడేకంటే, ఒకసారి దీన్ని పవన్ తో మాట్లాడి సెటిల్ చేసుకుంటే సరిపోతుంది కదా!" అంటూ రవి సలహా ఇచ్చాడు పల్లవికి.

"పవన్ కి కూడా నేనంటే ఇష్టమే!, తనకి ఇది ఎలా చెప్పను. పైగా ఇది వరకు ఒకసారి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఇంట్లో వాళ్లు మా ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకుంటుంటే కనీసం అడ్డు కూడా చెప్పడం లేదు తను. అయినా ఇదంతా ఓ ఆసరాగా చేసుకుని నన్ను ఎలాగైనా దక్కించుకోవడానకి ప్రయత్నిస్తున్నాడేమో?" అని పల్లవి మనసుని లేనిపోని ఆలోచనలు కుదిపేస్తున్నాయి.

చివరికి వాళ్ల బావ చెప్పినట్టు ఏదైతే అదయ్యింది, ఒకసారి పవన్ తో మాట్లాడి చూద్దాం అనుకుంది పల్లవి.

ఇక అనుకున్నదే తడువుగా తన మనసులో ఉన్నదంతా పవన్ కి చెప్పేయాలనుకుంది పల్లవి. చివరికి ఒక రోజు పవన్ కి మెసేజ్ చేసింది పల్లవి. తనని పర్సనల్ గా కలవాలని, తనతో మాట్లాడాలని.

చాలా రోజులు తర్వాత ఇలా పల్లవి మెసేజ్ చేయడంతో కొంచెం ఆశ్చర్యపోయాడు పవన్. కానీ, పవన్ కి అర్థమైంది పల్లవి తనని ఎందుకు కలవాలనుకుంటుందో!

అది వీళ్ళ ఇరువురి ఇళ్ళల్లో కొన్ని రోజులుగా నలుగుతున్న వీళ్లిద్దరి పెళ్లి గురించేనని, అది ఇష్టం లేని పల్లవి తనని కలిసి ఆ విషయమే చెప్పాలనుకుంటుందేమొనని ముందే సందేహించాడు పవన్. కానీ, ఒకవేళ పల్లవి మనసు మార్చుకుని, తన అభిప్రాయానికి ఫేవర్ గా కూడా విషయం ఉండొచ్చనే ఓ చిన్న ఆశా లేకపోలేదు పవన్ కి. పల్లవి ఏం చెప్తుందోనని ఆతృతగా తను చెప్పిన ప్లేస్ కి వెళ్ళాడు పవన్.

                            *******************

అలా వెళ్లిన పవన్ కి, అక్కడ పల్లవితో పాటు తన బావ రవి కూడా ఉండడం చూసి, కొంచెం ఆశ్చర్యం కలిగింది. అంతకు ముందు అతనితో పవన్ కి పెద్దగా పరిచయం లేదు. తనని కలిసి, చూసి కూడా చాలా ఏళ్ళు అయ్యింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాడు. కానీ, "తను ఇప్పుడెందుకు ఇక్కడ ఉన్నాడు. పైగా పల్లవి తననెందుకు తీసుకొచ్చింది. అనే సందేహాలు తనకి రాక తప్పలేదు" పవన్ కి.

పవన్ : "ఏంటి పల్లవి... కలవాలి, మాట్లాడాలి అన్నవ్..! ఏదైనా ముఖ్యమైన విషయమా?" అంటూ మొదలెట్టాడు తన మదిలో మెదులుతున్న సందేహాలు పక్కన పెట్టి.

పల్లవి: "హా అవును!.. బాగా ముఖ్యమైన విషయమే బావా! సారీ..పవన్."(రవి వంక చూస్తూ..)

పవన్: (కనీసం తనని బావ అని పిలవడానికి కూడా ఇష్ట పడని పల్లవి, పైగా వాళ్ల బావతో రావడం ... పవన్ కి పల్లవి ఏం చెప్పాలనుకుంటుందో అర్థమైంది. ఆశగా వచ్చిన పవన్ కి నిరాశే మిగిలినట్టైంది.) కానీ, ఇవేం పైకి కనపడనివ్వని పవన్ పల్లవి చెప్పిన సారీ కి నవ్వుతూనే "పర్లేదు... చెప్పు ఏంటా విషయం?" అంటూ అడుగుతాడు.

పల్లవి: "అది ..అది.. ఎలా చెప్పాలా అని...(పల్లవి నాన్చుతుంటే)"

రవి: "ఎందుకలా తడబడతావ్.. ఉన్నదేగా చెప్పు! చూడు బాస్ నేను పల్లవి ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. అంతకు మించి ప్రేమించుకుంటున్నాం. మీ ఇద్దరికి ఇంట్లో వాళ్లు మాత్రం పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు అంట. అది తనకి ఏ మాత్రం ఇష్టం లేదు. I mean ఇష్టపడిన నన్ను కాదని, ఇష్టం లేని నిన్ను చేసుకుని తను జీవితాంతం హ్యాపీ గా ఉండలేదు. నేను కూడా తనని వదులుకోలేను. ఇది చెప్దామని నిన్ను పిలిచాము. కానీ, ఈ విషయం చెప్పడానికి తనెందుకో తడబడుతుంది.

Of course, తనకి మీరంటే ఇష్టం లేదని మీకు తెలుసనుకొండి. మీ పెద్దవాళ్ళు మీ పెళ్లి టాపిక్ తెచ్చిన ప్రతిసారీ.. వద్దని చెప్పే దైర్యం చేయలేక బయటపడలేకపోతుంది. ఎందుకంటే, తానొక ఆడపిల్ల కాబట్టి. కానీ, మీకేం అయ్యింది? మీరు కూడా ఒకసారి ఆలోచించి, ఈ విషయాన్ని సున్నితంగా వాళ్ళతో చెప్తే సరిపోతుంది కదా! అది నాకు, మీకు తనకి కూడా మంచిదే కదా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా...

ఎందుకంటే, ఇది మన ముగ్గురి లైఫ్ మేటర్! అందుకే నేనిలా ఓపెన్ అయ్యి ముక్కుసూటిగా చెప్పాల్సి వస్తుంది." అంటూ అతనంటుంటే,

తన మాటలు పూర్తయ్యే లోపు కళ్లేర్రజేసీ కోపంగా అతని వంక చూసాడు పవన్.

దాంతో "ఒక చిన్న పనుంది, మీరిద్దరూ కంటిన్యూ చేయండి" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి.

పల్లవి: సారీ.., తనేధైనా తప్పుగా అనుంటే!.

పవన్: "ఛ.. ఛ.. మీ అభిప్రాయాలు మీరు చెప్పారు. అందులో తన తప్పేం ఉంది. మన ఇద్దరికీ పడదని మావయ్యకి, అత్తయ్యకి... పైగా మా అమ్మ నాన్న లకి కూడా తెలుసు. కానీ, మా వాళ్ళకి నిన్ను కోడలిగా చేసుకోవాలని, నన్ను అల్లుడిగా చేసుకోవాలని మావయ్యకి ఎప్పటినుండో ఉంది. మనం పుట్టకముందే వాళ్ళు డిసైడ్ ఐపోయారని వాల్లంటుండే వాళ్ళు.

నువ్వు మావయ్య మాట ఎలా కాదనలేవో, నేను కూడా అంతే మా నాన్న గారికి ఎదురు చెప్పలేకే నిశబ్ధంగా ఉండిపోయాను. నీకు తెలుసు గా చిన్నప్పటినుండి ఆయనంటే నాకెంత భయమో. అందుకే సైలెంట్ గా ఉండిపోయాను తప్ప. వాళ్ళని అడ్డుపెట్టుకుని నిన్ను ఏదోలా పొందాలని కాదు. ఇందాక తను అడిగిన వాటికి సమాధానమిది.

నిజం చెప్పాలంటే వాళ్ళతో పాటు నాకు ఉండేది, ఎప్పటికైనా నువ్వు నన్ను అర్ధం చేసుకోకపోతావా, మనిద్దరం ఒక్కటి కాకపోతమా అని..

కానీ, ఈ రోజుతో అది తేలిపోయింది. నిజానికి అమ్మ, నాన్న కి నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి వాళ్ల దగ్గరే పెరిగావు కదా.. వాళ్ళని చివరి వరకు బాగా చూసుకుంటావని వాళ్ళకి అదొక ఆశ. పైగా నాకీ బయట ప్రపంచంలో నువ్వు తప్ప వేరే అమ్మాయి కూడా తెలీదు. ఒకసారి ఆలోచించు పల్లవి.." అంటూ తన మనసులో మాట కూడా చెప్పాడు.

పల్లవి: "హమ్... ఇందులో ఆలోచించడానికి ఏముంది! వాళ్లకేం వాళ్లు ఎన్నైనా అనుకుంటారు. వాళ్లు ఏదో అనుకున్నారని, ఇష్ట పడ్డారని, మన ఇష్టాలని చంపుకుని కలిసి ఉండలేము కదా. నేనైతే కలిసి కాపురం చెయ్యలేను. నా గురించి కూడా నీకు చిన్నప్పటి నుండి తెలుసు.

ఇక మా బావ విషయానికి వస్తె, నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే తను కూడా నాకు ప్రపోజ్ చేశాడు. నీకు చెప్పిన సమాధానమే తనకి చెప్పాను. అయినా తను చాల లైట్ గా తీసుకున్నాడు. నేను కాదన్నా... అదేం మనసులో పెట్టుకోకుండా నాతో చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు కూడా.

కానీ, నువ్వు మాత్రం ఒకసారి ఎవడో లవ్ ఇచ్చాడంటూ నన్ను అనుమానించావ్... ఇంకోసారి అబ్బాయిలతో చాటింగ్ చేస్తున్నానని తప్పు పట్టావ్. ఎంత చెప్పినా వినకుండా నా ఫోన్ లో నిఘా పెట్టీ నన్ను అనుమానించావ్. ప్రతి చిన్న విషయంలో నన్ను అపార్థం చేసుకుంటూ అవమానించావ్, నాకు అమ్మ నాన్న దగ్గర లభించిన స్వేచ్ఛ నీవల్ల పోయినట్టనిపించింది. ఒక రకంగా నన్ను మానసికంగా హింసించావ్. ఆ రోజే అనుకున్నా నీలాంటి వాడితో జీవితాన్ని పంచుకుంటే నా లైఫ్ నాశనమై పోతుందని.

అప్పుడు కూడా... జరిగిందంతా నేను మా బావకి చెప్పాను. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. నీ అనుమానాలతో డిప్రెషన్ లోకి వెళ్ళిన నాకు ఆ టైంలో తోడున్నాడు. దైర్యం చెప్పాడు. ఆ డిప్రెషన్ నుండి బయటకి తీసుకొచ్చాడు. అప్పుడర్థమైంది నాకు తన ప్రేమలో స్వచ్ఛత ఉందని.

కానీ, నీ ప్రేమలో... అమ్మ కోసం, నాన్న కోసం, మావయ్య కోసం అంటూ ఎటు చూసిన స్వార్థమే. అందుకే నాకు నువ్వంటే మరింత అసహ్యం పెరుగుతుంది. ఇప్పుడు కూడా నువ్వు నన్ను నన్నుగా ప్రేమించానని చెప్పట్లేదు. అయినా ఆలోచించాల్సింది నేను కాదు, నీది ఎలాంటి ప్రేమో నువ్వే ఒకసారి ఆలోచించు

చివరిగా ఒక్క మాట, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకిష్టం లేని ఈ పెళ్లి నువ్వే ఎలాగైనా ఆపాలి. లేదంటే నేనెక్కేది పెళ్లి పీటలు కాదు పాడి." అంటూ.. అక్కడి నుండి కోపంగా లేచి వెళ్లిపోయింది పల్లవి.

"పవన్ మాత్రం తన మాటలకు ఇంకేం అనలేక అక్కడే నిశ్చేస్థుడై ఉండిపోయాడు.

"నీ సొగసుల సౌందర్యం మాయమైన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ నయనపు ఎదురుచూపులు!

నీ పలుకుల సవ్వడి మూగబోయిన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ నిరంతరపు ఆలోచనలు!

నీ పెదవుల చిరునవ్వు ఇక దొరకదన్న వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు!

నీ అడుగుల కదలిక దూరమైన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ హృదయపు స్పందనలు!"

ఇదే అసలైన ప్రేమంటూ నా మది నాకు మద్దతిస్తూ జై కొడుతుంది.

ఇక బయట పడవా అంటూ నా బుద్ధి నన్ను వెక్కిరిస్తూ ఛీ కొడుతుంది.

ఎవరి మాటని వినను? ఎవరికని నచ్చజెప్పను?

నువ్వే చెప్పు, ఓ ప్రియ నేస్తం!

దూరమైనా, చేరువైనా నా తీరపు అల నువ్వని,

బరువైనా, బాధ్యతైనా నా ఊహల పల్లకి నువ్వని,

భారమైనా, బంధమైనా నా హృదయపు తీగ నువ్వని,

స్వప్నమైనా, నిజమైనా నా వేకువ పొద్దు నువ్వని

వాటికీ... నీకు... తెలీదా?

చివరిగా, నీతో చెప్పాలనుంది...

నువు దూరమవుతున్నా...

ఎన్నాళ్లగానో నీకై నా ఈ మనోవేదన?

ఎన్నాల్లైనా తప్పదుగా నీకై నా ఈ నిరీక్షణ!

నీకై తపించే...

కాదు కాదు,

నీ ప్రేమకై నిరంతరం శ్రమించే

-ఓ ప్రేమ పిపాసి"

అంటూ పల్లవికి చెప్పాలనుకున్న మాటలు కాస్తా, బయటపడక తన మదిలోనే ఓ కవితా వరదై ఉప్పెనలా ఉప్పొంగుతూ పొంగి పొర్లుతుంది.

పవన్ తో చెప్పినా ఇక లాభం లేదని పల్లవి నే విషయం ఇంట్లో చెప్పిందా?

లేక తప్పు తన పై వేసుకుని పవన్ ఈ విషయం ఇంట్లో చెప్పాడా?

అసలీ విషయం వాళ్లిద్దరి ఇళ్ళల్లో తెలుస్తుందా?

పల్లవి అంటున్నట్టు రవి ప్రేమ స్వచ్ఛమైనదేనా?

లేక అదే నిజమైన ప్రేమ అనుకోవడంలో పల్లవి తప్పటడుగులు వేస్తుందా?

పల్లవి చెప్పినట్టు ఆ లవ్ లెటర్, ఆ చాటింగ్ విషయాలలో అనుమానించడం పవన్ తప్పా..? పవన్ చెప్పిన జాగ్రత్తలు తన పాలిట అనుమానాలుగా భావించడం పల్లవి తప్పా..?

ఇంజనీరింగ్ పూర్తి చేయబోతున్న వాళ్లిద్దరి జీవితాలు ఏమవబోతున్నాయి?

కథలో రాజకుమారి-6 లో తెలుసుకుందాం.

అప్పటి వరకూ పాఠకులారా...

మీ సహనమే నా అక్షరాలకి ఊపిరి.

మీ పఠనమే నా పదాలకు వారధి.

మీ సమీక్షలే నా కథలకు సారథి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు🙏🙏🙏

రచన: సత్య పవన్✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Classics