Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

కొండ దారిలో రైలు

కొండ దారిలో రైలు

1 min
381


ఆ నలుగురూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సిద్ధమా అని ఒకడు బొంగురు గొంతుకతో అన్నాడు. మిగతా ముగ్గురూ సరేనన్నట్టు తలూపారు.


రైలు కొండ ప్రాంతంలో వెళుతోంది. మనుషులు, బొగ్గు సంచీలు కలిసే ఉండడం వలన ఎవరి వాసన ఏమిటో అర్థం కాకుండా ఉంది.


అక్కడక్కడా ఆడవారి మెడలో బంగారు ఆభరణాలు తళుక్కుమంటున్నాయి. ఖరీదైన వస్తువులూ ఉన్నాయి.


రైలు సొరంగ మార్గం గుండా ప్రవేశించగానే ఆ నలుగురూ కత్తులు పట్టుకుని సిద్ధమయ్యారు. చుట్టూ చిమ్మ చీకటి.


అందరూ హాహాకారాలు చేస్తున్నారు. ఎక్కడో రక్తం చిమ్మిన తాజా వాసన.


రైల్వే గార్డు అప్రమత్తమై లైట్లు వేయాలని చూసాడు. అవి పని చేయలేదు.


లాంతరు వెలిగించబోయి కాళ్ళకు తగిలిన రక్తం తడితో స్పృహ తప్పి పడిపోయాడు.


రైలు సొరంగ మార్గం దాటి కొండ ప్రాంతానికి టాటా చెప్పి మైదాన ప్రాంతంలోకి అడుగు పెట్టింది.


గార్డు కళ్ళు తెరిచి చూసాడు. నలుగురు మనుషులు గాయాలతో మూలుగుతూ తాళ్లతో కిటికీలకు కట్టివేయబడి ఉన్నారు.


రైలు బయట అంటించిన వాంటెడ్ పోస్టర్లలో ఉన్నది వాళ్లేనని గార్డుకు అర్థమయ్యింది.

కానీ ఎవరు వీళ్ళ లాంటి గూండాలను ధైర్యంగా పట్టుకుని కట్టేసింది? గార్డుకు ఏమీ అర్థం కాలేదు.


మిగతా ప్రయాణీకులు తమకేం పట్టనట్లు వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి చేతులకు అక్కడక్కడా తుడిచేసిన రక్తపు మరకల వాసన ఉంది.


కానీ మనుషులు, బొగ్గు సంచీలు కలిసే ఉండడం వలన ఎవరి వాసన ఏమిటో అర్థం కాకుండా ఉంది.


రైలు వచ్చే స్టేషన్లో ఆగిపోతుంది. అక్కడ రైల్వే పోలీసులు కూడా ఉంటారు.



Rate this content
Log in

Similar telugu story from Abstract