Dinakar Reddy

Abstract Drama

4.0  

Dinakar Reddy

Abstract Drama

జిలిబిలి పలుకుల తార

జిలిబిలి పలుకుల తార

1 min
560


సితార ఆలోచిస్తోంది. ఇప్పుడు తన గతం మొత్తం చెప్పి తప్పు చేసిందా? దేవదాసు చేసిన సాయానికి పెళ్లి చేసుకుని అతనికి భార్యగా జీవించాలా? 


తను ప్రేమించిన రాజును మరచిపోగలదా? అలా మరచిపోకుండా దేవదాసును పెళ్లి చేసుకోవడం తప్పు కదా?


ఈ సమస్యలకు పరిష్కారం తన అంతమా?

చనిపోవడమే మార్గమా? 


అవును. చనిపోవాలి. ఈ శరీరం కాదు. ఈ పేరు చనిపోవాలి. సితార అన్న పేరు వినబడని చోటుకి నేను పారిపోవాలి. ప్రకృతిలో దాక్కోవాలి.


సితార ఆలోచిస్తోంది. బట్టలు సర్దుకుంది. ఎవ్వరికీ తెలీకుండా వేరే రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది.


తను ఎక్కిన బస్సులో ఆమెను ఎవ్వరూ గుర్తు పట్టలేదు. సితార గారూ! వెళ్లిపోతున్నారా? వెనుక సీట్లో దేవదాసును చూసి ఆమె కంగారుపడింది.


కంగారుపడకండి. ఇదిగో మీ రాజును తీసుకువచ్చాను అన్నాడు.

అంతలో అతను కూర్చున్న సీటు వెనుక రాజు కనిపించాడు. రాజు వచ్చి సితార పక్కన కూర్చున్నాడు. ఆమె అతడి చేతిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంది.


సితార కళ్ళు దేవదాసు వైపు కృతజ్ఞతతో చూశాయి.


అతడు బస్సు దిగుతూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు.

బస్సు కొండల మధ్యలో ఉన్న ఒక కుగ్రామం వైపు వెళ్ళిపోసాగింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract