naveen surya

Drama Tragedy

4.5  

naveen surya

Drama Tragedy

హైదరాబాద్ To చెన్నై - 2

హైదరాబాద్ To చెన్నై - 2

2 mins
1.4K



ఉదయం 9 గంటలకు 

-----------------------------


సత్య : హలో ప్రవీణ్ గారు ( ప్రాజెక్ట్ మేనేజర్ ) నిన్న ఇంటర్వ్యూ కి వచ్చిన అమ్మాయి ఇవ్వాళ వస్తె గనక కాల్ లేటర్ ఇచ్చి పంపకండి

అమ్మాయి కి హైదరాబాద్ లో ఆసక్తి ఉంటే నేను మా కంపెనీ లో జాయిన్ చేసుకుంటాను . తనతో మాట్లాడతాను వచ్చాక వెయిట్ చేయించండి నేను ఇప్పుడే బయలు దేరుతున్నాను


ప్రవీణ్ : అలాగే సార్ ఇంకా అమ్మాయి రాలేదు మీరు చెప్పినట్లే చేస్తాను 


----------------------------


అలా ఆఫీస్ లోనికి ఎంటర్ అయ్యానో లేదో రిజిస్టార్ లో తన పేరు నమోదు చేస్తుంది చాలా పద్దతి గా , హుందాగా , సంప్రదాయాలను ప్రతిబింబించేలా కనిపించింది వెంటనే క్యాబిన్ లోనికి వెళ్ళిపోయి 

సెక్యూరిటీ బెల్ కొట్టి సంధ్య నీ పిలిపించండి అని చెప్పి ఇవ్వాళ షెడ్యూల్ చూస్తున్నాను 


సంధ్య : may I come In sir 


నేను : రండి , వచ్చి కూర్చోండి 


సంధ్య : మీరు బస్ లో , నమ్మలేక పోతున్నాను సార్ , సారి సార్


నేను : పర్లేదు అండి .మీకు కాంపస్ ప్లేసెమెంట్ లో ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది మీకు ఇబ్బంది లేకపోతే నేను మా డైరెక్టర్ తో మాట్లాడి మిమ్మల్ని మా కంపెనీ లో జాయిన్ చేయాలి అనుకుంటున్నాం


సంధ్య : సార్ , కానీ ....... ఈ కంపెనీ లో ప్యాకేజీ ఎక్కువ అందులోనూ వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు


నేను : మరేం ఇబ్బంది లేదు , మీ మేనేజర్ తో నేను మాట్లాడతాను 

అదే ప్యాకేజీ కి మిమ్మల్ని తీసుకుంటాం , మీకు బదులుగా ఇంకో అమ్మాయి నీ నేను ఈ కంపెనీ కి రిఫర్ చేస్తారా 


సంధ్య : Thank You So Much Sir For Your Support , మీ మేలు ఎప్పటికీ మర్చిపోను . నాకు చెన్నై లో అస్సలు ఇష్టం లేదు 

కానీ తప్పడం లేదు 


నేను : అయ్యో ! ఇది చాలా చిన్న విషయం , హైదరాబాద్ కి వచ్చి నన్ను కలవండి 


సంధ్య : ఒకే , సార్


--------------------------------------


సంధ్య ఇంట్లో వాళ్ళ నుండి ఫోన్ 


జనార్ధన్ : ఏమ్మా ఉద్యోగం వచ్చిందా


సంధ్య : హా ! వచ్చింది నాన్న , హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేశారు , నేను వచ్చాక మిగిలిన విషయాలు చెప్తాను


జనార్ధన్ : చాలా సంతోషం తల్లి , చెన్నై లో ఎక్కడ ఇబ్బంది పడతావేమో అని బెంగ పెట్టుకున్నాం . పంపక తప్పలేదు 

ఇంకో విషయం నీకు ఫోన్ లో ఒక ఫోటో వివరాలు వచ్చాయి 

నచ్చితే ఫోన్ చేసి చెప్పు 


సంధ్య : అలాగే నాన్న 


----------------------------------


హైదరాబాద్ లో ( సత్యమూర్తి ఆఫీస్ లో )


సంధ్య : సార్ ! స్వీట్స్ తీసుకోండి నాకు పెళ్ళి కుదిరింది 


నేను : పెళ్లి కుదిరిందా , మొన్న చెన్నై లో కలిసినప్పుడు చెప్పనే లేదు 

(మనసులో బాధ తనని ఇక్కడ ఉద్యోగం ఇప్పించి నా మనసులో మాట చెప్పేలోపు తానే ఒక చేదు నిజం చెప్పేసింది) 


సంధ్య : సార్ ! ఇంటర్వ్యూ అయ్యాక నాన్న గారు ఫోన్ చేసి మాట్లాడాడు , అబ్బాయి నంబర్ ఇచ్చాడు , నాకు నచ్చాడు , నేను వెంటనే హైదరాబాద్ వచ్చేసాను , అమ్మ వాళ్ళు కరీంనగర్ నుండి ఇక్కడకి వచ్చారు అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు , మా బాబాయ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు , మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ అయింది దగ్గర్లో ముహూర్తాలు లేవు అని అప్పటికి అప్పుడు చేసేశారు .పెళ్లి ఇంకో నెల రోజుల్లో ఉంది సర్


నేను : నమ్మలేకపోతున్నాను , మొన్నే కలిసాము అప్పుడే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా ( ఒక అమ్మాయి నీ ఇష్టపడి నా నిర్ణయం చెప్పేలోపు తానే తన పెళ్లి వార్త మోసుకొచ్చింది 


సంధ్య : అవును సార్ , పెళ్లి కి తప్పకుండా రావాలి 


నేను : సంధ్య ! నేను నిన్ను ప్రేమిస్తున్నాను , అది చెప్పెలోగా నువ్వు పెళ్లి వార్త చెప్పావు , సంతోషంగా ఉండు అదే నాకు కావాల్సింది (ఇలా చెప్పాలని ఉంది )


సంధ్య : సార్ !!! సార్ !!!


నేను : హా ! సంధ్య నేను మళ్ళీ మాట్లాడతాను , మీటింగ్ ఉంది 


--------------------------


పెళ్లి రోజు ఉదయం 10:24 నిమిషాలకు 


( ఇంకా ఉంది )






Rate this content
Log in

Similar telugu story from Drama